Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Grama Sachivalayam Orders for assigning places for those who do not come to counseling

30 రోజుల్లో విధుల్లోకి . . 
 సచివాలయ అభ్యర్థులకు గడువు నిర్దేశం కౌన్సెలింగ్ కు రానివారికి ప్రదేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు 
Grama Sachivalayam Orders for assigning places for those who do not come to counseling

సచివాలయ ఉద్యోగాలకు ఎంపి కైన అభ్యర్థులకు ప్రదేశాలు కేటాయించేందుకు శాఖల్లో కసరత్తు ప్రారంభమైంది . ఇప్పటికే ప్రదేశాలు కేటాయించిన శాఖల్లో అభ్యర్థులు విధుల్లో చేరేందుకు ( పోస్టింగ్ ఆర్డరు అందుకున్న తేదీ నుంచి ) 30 రోజులు గడువు నిర్దేశించారు . అప్పటికీ విధుల్లో చేరని వారి స్థానాలను ఖాళీలుగా పరిగణిస్తామని అధికారులు వెల్లడిం చారు . ప్రదేశాలు ఎంపిక చేసుకునేందుకు నిర్వహించిన కౌన్సెలింగ్ కు హాజరుకాని వారికి ప్రదేశాలను సూచిస్తూ అభ్యర్థులు సమాచారమందించే చర్యలు తీసుకు న్నారు . 

ఉద్యోగాలకు ఎంపికైన వారికి శాఖల వారీగా ప్రదేశాలు కేటాయింపు జరు గుతోంది . ఒకటి రెండు శాఖల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేసి , ఇప్పటికే ప్రదేశాలు కేటాయించారు . కొన్ని శాఖల్లో కౌన్సెలింగ్ విషయమై జాప్యం చోటుచేసుకుం టోంది . విజయనగరం ఉత్సవాలు , శ్రీపైడితల్లి అమ్మవారి పండగ నేపథ్యంలో శాఖలు వారీగా బాధ్యతలు రావడంతో కొంత సమయం పట్టనుందని ఆయావ ర్గాలు బదులిస్తున్నాయి . దీంతో నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది . పంచాయతీశాఖలో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయి అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు . కౌన్సెలింగ్ కు రానివారికి ప్రదేశాలు సూచిస్తూ ఉత్తర్వులను అందజేస్తామని డీపీవో బి . సత్యనారాయణ తెలి పారు . సాంఘికసంక్షేమశాఖ ద్వారా గ్రామ సంక్షేమ , విద్య సహాయకుల పోస్టుకు సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ కు 450 మంది హాజరయ్యారు . వీరికి రెండో రోజుల్లో ప్రదేశాలను సూచిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు . ఈ కౌన్సెలింగ్ విధానమే కావాలని . . . : నియామకపత్రాలు అందుకున్న వారంతా శాఖల్లో రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మాన్యువల్ గా మూడు ప్రదేశా లను సూచించారు . ఈ నేపథ్యంలో కొందరు అవగాహనలేమితో ప్రదేశాలను పొందుపర్చడం జరిగింది . ఆయా ప్రదేశాలనే కేటాయిస్తారా ? పంచాయతీశాఖ తర హాలో కౌన్సెలింగ్ నిర్వహించే విషయంలో సందిగ్ధం నెలకొంది . ఆన్లైన్ విధా నంలో ప్రదేశాలను కేటాయించాలన్న డిమాండను అభ్యర్థులు లేవనెత్తుతున్నారు . అధికారులు దీనిని సమర్థిస్తున్నారు . మాన్యువల్ విధానంలో సిఫార్సులు వచ్చే అవకాశమున్నందున ఆన్లైన్ లోనే నిర్వహించే విషయమై యోచిస్తున్నారు . కలె క్టర్ ఎం . హరిజవహర్లాల్ సెలవులో ఉన్నందున ఆయన వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లు కొందరు అధికారులు న్యూ స్టుడే దృష్టికి తీసుకొచ్చారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Grama Sachivalayam Orders for assigning places for those who do not come to counseling"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0