Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Group-I Mains


  • 1:12 నుంచి 1:15 నిష్పత్తి పక్కకు..
  • పాత విధానమే కొనసాగింపు
  • ప్రభుత్వ పరిశీలనలో నిరుద్యోగుల విన్నపం
  • కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కుల పద్ధతికి బ్రేక్‌
  • త్వరలోనే ప్రకటించనున్న 

Group-I Mains

ప్రభుత్వం! గ్రూప్‌-1 ఉద్యోగాలకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ రాసిన అభ్యర్థుల నుంచి ఒక్కో పోస్టుకు 50 మందికి మెయిన్స్‌ రాసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. నిరుద్యోగ అభ్యర్థుల విన్నపంతోపాటు కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 2018లో విడుదల చేసిన నోటిఫికేషన్‌(27/2018) ప్రకారం 169 గ్రూప్‌-1 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయవలసి ఉంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 26న స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఏపీపీఎస్సీ గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం... స్ర్కీనింగ్‌ టెస్ట్‌ రాసిన అభ్యర్థుల నుంచి ఒక్కో పోస్టుకు 1:12 నుంచి 1:15 నిష్పత్తి మధ్య అభ్యర్థులకు మెయిన్స్‌ రాసే అవకాశం కల్పించాల్సి ఉంది. కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కుల పద్ధతి అమలు కావాల్సి ఉంది. తద్వారా ఆయా కేటగిరీలకు క్వాలిఫైయింగ్‌ మార్కులు మారే అవకాశం ఉంటుంది. గ్రూప్‌-1 సర్వీసులతో పాటు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే అన్ని ఇతర సర్వీసులకూ ఈ విధానం వర్తింపజేయాలన్నది ఏపీపీఎస్సీ నిర్ణయం. ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎంత కటాఫ్‌ మార్కు అనేది ఏపీపీఎస్సీ విచక్షణ ప్రకారం నిర్ణయిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ చేసిన ప్రతిపాదనకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 2018 జనవరి 5న జీ.వో.నం.5 జారీచేసింది. అంటే యూపీఎస్సీ అనుసరిస్తోన్న పద్ధతినే ఇకపై ఏపీపీఎస్సీ కూడా అమలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లయింది. అప్పటి వరకు ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున స్ర్కీనింగ్‌ టెస్ట్‌ లేదా ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అర్హత కల్పిస్తున్నారు. అభ్యర్థుల రిజర్వుడ్‌ కేటగిరీని చూడకుండా ఎంపికలు చేస్తున్నారు. 2017 మార్చి 8న ప్రభుత్వం జారీచేసిన జీ.వో నం.570 ప్రకారం ఏపీపీఎస్సీ ఈ పద్ధతిని అమలు చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఓపెన్‌ కాంపిటీషన్‌(ఓసీ)లోని పోస్టుల అభ్యర్థులకు ఇబ్బందేమీ లేదు. కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌ తదితర రిజర్వుడ్‌ కేటగిరీల్లో తగినంత మంది అభ్యర్థులు దొరకటం లేదని పలువురు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు.

యూపీఎస్సీ తరహాలోనే ఏపీపీఎస్సీ కూడా కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కుల విఽధానాన్ని అమలు చేయాలని కోరారు. దీంతో ఏపీపీఎస్సీ సెక్రెటరీ పలుమార్లు ఈ మేరకు ప్రభుత్వానికి లేఖలు రాశారు. జీ.వో.నం.570కి సవరణలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ చేసిన ప్రతిపాదనకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రూప్‌-1 సర్వీసుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కొత్త విధానంలో పోస్టులకు కటాఫ్‌ మార్కులు నిర్ణయిస్తామని గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ చెప్పారు. మెయిన్స్‌ రాసే వారిని ఎంపిక చేసే విషయంలో యూపీఎస్సీ పద్ధతినే ప్రాతిపదికగా తీసుకుంటామన్నారు.

మెయిన్స్‌కు 1:12 లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేలా కటాఫ్‌ మార్కులను నిర్ణయించేందుకు ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చిందని చెప్పారు. ఏ రిజర్వేషన్‌ కేటగిరీలో అయితే తగిన సంఖ్యలో అభ్యర్థులు ఎంపికకారో అక్కడ కటాఫ్‌ మార్కులను తగ్గిస్తామని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు లేని కారణంగా పోస్టులు క్యారీ ఫార్వర్డ్‌ అయ్యే అవకాశం ఉండదని ఆయన చెప్పారు. కానీ, నిరుద్యోగుల నుంచి వచ్చిన విన్నపంతో పాత పద్ధతితో 1:50 నిష్పత్తి విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Group-I Mains"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0