Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If you have an Adhar card, We will perform the operation

ఆధార్ కార్డు ఉంటే చాలు ఆపరేషన్ చేస్తాం..! కొత్త నోట్లు లేకపోయిన పర్వాలేదు..!
If you have an Adhar card, We will perform the operation

పెద్ద నోట్ల రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్లిన మా దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి ఇవి ఎవరు తీసుకోవడం లేదు, బ్యాంకుల ముందు లైన్ చూస్తేనే భయం వేస్తుంది అంటున్నారు. పెద్ద నోట్ల మార్పిడికి చాలా రోజుల టైం ఉన్న ప్రజలు మాత్రం బ్యాంకుల ముందు, ఏటీఎం ల ముందు బారులు తీరుతున్నారు. పెద్ద నోట్లు చెల్లకపోవడంతో ఆసుపత్రులలో కూడా ఏదైనా చికిత్స చేయించుకోవాలి అంటే చాలా ఇబ్బందులు పడుతున్న సమయం… డబ్బులు ఇవ్వంది ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు, విడిచిపెట్టడం లేదు… అలాంటి పరిస్థితులలో పాతనోట్లయినా పర్వాలేదు, మీదగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు మీ ఆధార్ కార్డు,రేషన్ కార్డు పట్టుకొని వచ్చి ఎలాంటి ఆపరేషన్ అయినా చేయించుకొని వెళ్ళండి అంటున్నాడు గుంటూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి…

పెద్ద నోట్ల కష్టాలు చిరు వ్యాపారి నుండి పెద్ద పెద్ద ఐటి కంపెనీలకు, కార్పొరేట్ ఆసుపత్రిలు కూడా పడుతున్నాయి. నరేంద్రరెడ్డి పేదల కష్టాల గురించి ఆలోచింది మానవ సేవే మాధవ సేవ అంటూ ముందుకు వచ్చాడు. ప్రధాని సూచించిన డిసెంబర్ 30 వరకు తమ ఆసుపత్రి అయిన ‘సాయిబాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో’ ఎముకలు, కీళ్ళకు సంబంధించిన ఔట్ పేషేంట్, ఇన్ పేషేంట్ విభగాలలో చికిత్స పొందే రోగులు మోకీలు, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకునే వారు నగదు చెల్లించకపోయిన చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఆధార్ కార్డు లేదా ఓటర్ గుర్తిపు కార్డు అందజేసి శస్త్ర చికిత్స చేయించుకొని వచ్చే సంవత్సరం మార్చి తరవాత వచ్చే కొత్త నగదు చెల్లించవచ్చు అని తెలిపారు. ఓపి సేవలకు ఎటువంటి గుర్తిపు కార్డు అవసరం లేదని ఎవరైతే రోగులు ఉన్నారో వారి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, చెక్ లు ఇతర ఆన్ లైన బ్యాంకింగ్ నగదు బదిలీ ప్రక్రియ ఆమోదిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నల్లధనం ప్రక్షాళన  లో భాగంగా మావంతు సహకారం  కూడా అందిస్తామని, పౌరులు కూడా తమ వంతు సహాకారం అందించాలని సూచించారు.

ఈ హాస్పిటల్ గుంటూరులో అరండల్‌పేటలో ఉంది, చికిత్స చేయించుకోవాలనుకుంటే 9849834016 నెంబర్ కి ఫోన్ చేసి అపాయింట్ మెంట్ చేసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If you have an Adhar card, We will perform the operation"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0