Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Twinning Schools


  • అందరికీ సమాన జ్ఞానం ట్విన్నింగ్ స్కూళ్లతో సరికొత్త ప్రయోగానికి సర్కారు శ్రీకారం.
  •  ప్రభుత్వ , ప్రైవేటు స్కూళ్ల భాగస్వామ్యం ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి
  • ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు విద్యార్థులు కూడా .   గ్రామీణ , పట్టణ , నగర పాఠశాలల పర స్పర భాగస్వామ్యం
  • రాష్ట్రవ్యా ప్తంగా 11 , 378 పాఠశాలల ఎంపిక

Twinning Schools

 గ్రామీణ , పట్టణ , నగర ప్రాంతాల విద్యార్థులందరూ సమానమైన జ్ఞానాన్ని సముపార్జించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది . ప్రభుత్వ , ఎయిడెడ్ , ప్రైవేటు స్కూళ్ల మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకునేలా ట్విన్నింగ్ , పార్టనర్ షిప్ , టీచర్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమాలను ప్రారంభిస్తోంది . గ్రామీణ , గిరిజన ప్రాంతాలలోని స్కూళ్లు . . పట్టణ , నగర ప్రాంతాల్లోని స్కూళ్ల మధ్య పరస్పర జ్ఞాన మార్పిడి కార్య క్రమాలు చేపట్టనున్నారు . ఇందులో టీచర్లు , విద్యార్థులమార్పిడి కార్యక్రమాలుంటాయి . గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత తరగతుల విద్యార్థులు , టీచర్లను వారం రోజులపాటు పట్టణ ప్రాంతాల స్కూళ్లకు పంపిస్తారు .

 ఏయే తరగతుల విద్యార్థులంటే .

విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు తరగతుల వారీగా ఉంటాయి . ప్రాథమిక స్థాయిలో 4 , 5 తరగతుల విద్యా ర్డులను , ప్రాథమికోన్నత స్థాయిలో 6 , 7 , 8 తరగతుల విద్యార్థుల లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సమగ్ర శిక్షా అభి యాన్ ( ఎస్ఎస్ఏ ) ద్వారా చేపడతారు . కేంద్ర మానవవ నరుల అభివృద్ధి శాఖ ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది . జ్ఞాన మార్పిడి కార్యక్రమాలకు అను వైన స్కూళ్లను కూడా ఎంపిక చేయడానికి నిర్ణీత విధివి ధానాలను ఎస్ఎస్ఏ ప్రకటించింది . అక్టోబర్ మూడో వారం , నవంబర్ మూడో వారంలో ఈ ' ట్విన్నింగ్ స్కూళ్ల కార్యక్రమాన్ని అమలుచేస్తారు .

స్కూళ్ల కార్యక్రమాలకు ప్రాతిపదికలివీ .


  •  ట్విన్నింగ్ కార్యక్రమానికి సంబంధించి స్కూళ్లఎంపికకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు .
  •  వాటి ప్రాతి పదికగా స్కూళ్ల ఎంపిక చేపడుతున్నారు . 
  • కరిక్యులమ్ లో క్వాలిటీ ( గుణాత్మక ) , బోధనా విధానాలు , ప్రాజెక్టులు , స్టడీ ( టూర్స్ , ఎక్స్పోజర్ విజిట్స్ ) , సైన్స్ ఫెయిర్స్ , ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ , స్పోర్ట్సు అండ్ గేమ్స్ , కల్చరల్ , లిట రరీ , స్వచ్చంద సేవ , లైఫ్ స్కిల్స్ , స్కూల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , మేనేజ్ మెంట్ కమిటీలు , టీచర్ కౌన్సిల్స్ వంటి అంశాలను బేరీజు వేసుకుని 
  • ఆయా స్కూళ్ల మధ్య టీచర్లు , విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు వారం రోజులపాటు ఉంటాయి . కాగా , రాష్ట్ర , జిల్లా , మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసి స్కూళ్ల ఎంపిక చేపడుతున్నారు . 
  • కార్యక్రమాల నిర్వహణ బాధ్య తలు కూడా ఈ కమిటీలకే అప్పగించారు .

స్కూళ్ల ఎంపిక ఇలా . .

  • ఈ ట్విన్నింగ్ కార్యక్రమానికి గ్రామీణ , నగర ప్రాంతాల నుంచి రెండు పాఠశాలలను ఎంపిక చేస్తు న్నారు . అంతేకాక . . > మౌలిక , ఆధునిక వసతులు , ఆట స్థలం , క్రీడా పరికరాలున్న స్కూళ్లను ఎంపిక చేయాలి . > బహుముఖ పరిజ్ఞానం , నైపుణ్యం ఉన్న టీచర్లను గుర్తించాలి . > ప్రయాణ సదుపాయం ఉండాలి . > విద్యార్థుల్లో ఉత్సాహం , ఆరోగ్యం , తెలివిగల వారికి ప్రాధాన్యమివ్వాలి . > వేరే పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిలేని వారిని గుర్తించి వారి తల్లిదండ్రులతో సంప్రదించిన తరు వాతే పంపాలి . సత్సంబంధాలతో ప్రయోజనం
  • ట్విన్నింగ్ కార్యక్రమాల ద్వారా టీచర్లు , విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతర విద్యార్థులకు , టీచర్లకు పంచడం ద్వారా వారి మధ్య ఇచ్చిపుచ్చు కునే భావన ఏర్పడి స్కూళ్ల పురోగతికి మరింత తోడ్పడుతుంది . 
  • జ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరికి విస్తృ తపర్చడం ద్వారా నెట్వర్కింగ్ పెరుగుతుంది . 
  • టీచర్ల మధ్య శిక్షణాంశాల సమాచారం , సాంకేతికాం శాలు , ప్రాజెక్టులు , ఇతర కార్యక్రమాల అంశాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి .

 ట్విన్నింగ్ ప్రోగ్రాంకు  జిల్లాల వారీగా ఎంపికైన స్కూళ్ల వివరాలు. 


శ్రీకాకుళం               874
విజయనగరం        874
విశాఖపట్నం.         878
 తూ . గోదావరి      876
 ప . గోదావరి         874
కృష్ణా                    876
 గుంటూరు            874
ప్రకాశం                  874
నెల్లూరు                 874
కడప                     874
 కర్నూలు               876
అనంతపురం         876
చిత్తూరు.               878

మొత్తం                11,378

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Twinning Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0