Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Innovative reforms in systam


  • విద్యాశాఖలో కీలక సంస్కరణలు 
  • అడుగులు కదుపుతున్న సర్కార్ 
  • ఉన్నత విద్య , పాఠశాల విద్య కమిషన్ల ఏర్పాటు
  • రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల మిగులు.
  • ఆంధ్రప్రభ విద్యాశాఖలో కీలక సంస్కరణ ల అమలు దిశగా సర్కార్ అడుగులు కదుపుతోంది . 
Innovative reforms in  systam

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖను ప్రక్షాళన చేస్తామని ప్రకటిం చిన విషయం తెలిసిందే . అలాగే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్పష్టమైన దిశానిర్దేశం కూడా చేశారు . అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖ కోసం బడ్జెట్లో ఏకంగా రూ  38 వేల కోట్లు కేటాయించడం సంచలనాత్మక నిర్ణయంగా భావించవచ్చు . ఈ నేపథ్యంలో ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలల ఫీజులు , వాటిలోని మౌలిక వసతులు , అనుమతుల వివరాలపై దృష్టి సారిస్తామని ప్రకటించారు . అందుకోసం పాఠశాల విద్య , స్థాయిలో ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చారు . అలాగే కళాశాలల్లో అడ్డగోలుగా జరుగుతున్న దోపిడీని నియం త్రించ డం , గుర్తింపు లేని కళాశాలలను రద్దు చేయడం వంటి అంశాలపై త్వరిత గతిన నిర్ణయాలు తీసు కోగలిగేలా ఉన్నత విద్యకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది . వీటితో పాటుగా . . విద్యాశాఖలో గతంలో చే పట్టిన ఒప్పందాలపై పునఃసమీక్ష చేసేందు కు రివర్స్ టెండరింగ్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . తాజాగా విద్యా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక మాజీ ఐఏఎస్ ఆధికారిని సైతం ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది . 


నాడు - నేడు కోసం మానిటరింగ్ సిస్టమ్ 


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటి ముఖ చిత్రాల ను మార్చేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది . మూడేళ్లలో పాఠశాల లన్నింటిలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించేలా ' నాడు - నేడు ' పేరిట స్కూళ్ల ఫొటోలను సేకరించి ఒక యాప్లో పొందుపరిచింది . ఈ కార్యక్రమం సక్రమంగా ఆమలయ్యేలా స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ పేరిట ఎప్పటికప్పుడు చేపట్టిన చర్యలను నమోదు చేసేలా డిజిటల్ డేటా బ్యాంకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది .

 నిజంధనలు అతిక్రమిస్తే ఉక్కుపాదం . . 

ప్రభుత్వ గుర్తింపు లేకుండా , నిబంధనలు పాటించ కుండా , మౌలిక వసతులు కల్పించకుండా కొనసాగుతున్న ప్రైవేట్ , కార్పొరేట్ పాఠశాలలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది . అందుకోసం పాఠశాల విద్యా నియంత్రణ , పర్యవేక్షణ కమిషనన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . కమిషన్ స్వేచ్చగా పనిచేసుకోగలిగేందుకు వీలుగా నియమ నిబంధనలు సైతం రూపొందిస్తున్నారు . ఈ రెగ్యులేటరీ , మానిటరింగ్ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జస్టిస్ ఆర్ . కాంతా రావును నియమించడం ద్వారా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదనే ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేశారు . విద్యావ్యవస్థలో నెలకొన్న నిర్లక్ష్య జాడ్యాన్ని రూపుమాపేలా , నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేయించగలిగేలా కమిషన్‌కు అధికారాలు కట్టబెట్టడం విశేషం . ఈ కమిషన్ ఇప్పటికే కార్యాచరణలోకి దిగడంతో పాటు అన్ని జిల్లాలడీఈవోలు , ఎంఈవోల నుంచి అన్ని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వివరాలు , విద్యాశాఖప్రభుత్వం . . . గుర్తింపు కోసం సమర్పించిన రికార్డులలో ఉన్న ఫీజు - వివరాలను పరిశీలించే పనిని ప్రారంభించింది.

 ఉన్నత విద్య కమిషన్ కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు 

రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల స్థితిగతులను పరిశీలిం చేందుకు ప్రభుత్వం ఉన్నత విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది . రాష్ట్రంలో పలు ప్రైవేట్ , కార్పొరేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించిన విద్యార్థులను చేర్చుకుంటూ ఇష్టారీతిగా కొనసాగుతున్నాయి . అలాగే సరైన బోధనా సిబ్బంది , వసతి సదుపాయాలు లేకుండానే భారీ ఫీజులను వసూలు చేస్తున్నాయి . వీటిని నియంత్రించేం దుకు ఉన్నత విద్య రెగ్యులేటరీ , మానిటరింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్యను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఈ కమిషన్ పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రారం భించేందుకు అవసరమైన స భ్యులను నియమించుకునేం దుకు నలుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది . ఈ సెక్స్ కమిటీ నిస్పక్ష పాతంగా వ్యవహరించగల విద్యా వేత్తలు , న్యాయ నిపుణులను సభ్యులుగా ఎంపిక చేయనుంది.

రివర్స్ టెండరింగ్ ' నిధులు ఆదా 

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జలవ నరులు , విద్యుత్ శాఖల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ అయిన విషయం విదితమే . ఈ నేపథ్యంలో ఇదే తరహా ప్రయోగాన్ని విద్యాశాఖలోనూ చేపట్టి ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు మిగల్చాలని భావిస్తోంది . . అందుకోసం గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు , చెల్లింపులు జరిపిన బిల్లులను నిశితంగా పరిశీలించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌలిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం . అలాగే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అధిక చెల్లింపులు జరిపినట్లు ఆధారాలు లభిస్తే తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది .

 అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ . . . 

రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకు తీసుకొచ్చేం దుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు వేదికలపై స్పష్టం చేసిన విషయం తెలిసిందే . ఇందుకోసం పలు రాష్ట్రాలు విద్య విషయంలో తీసుకొస్తున్న పథకాలపై అధ్యయనం చేసి . . మన రాష్ట్రానికనుగుణంగా కొత్త పథకాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది . విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రణాళిక లు రూపొందించాలని భావిస్తోంది . అందులో భాగంగా . . . మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని విద్యాశాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . రాష్ట్రంలో విద్యను బలోపేతం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సత్ఫలితాలిచ్చేందుకు మూడేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు . 2022 నాటికి ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మాళిక వసతుల కొరత లేకుండా ఉండాలని , నిరక్ష్యరాస్యత అనేది పూర్తిగా పోవాలనే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే దిశగా ఇప్పటికే ఆయా విభాగాలు కార్యాచరణ ప్రారంభించాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Innovative reforms in systam"

Post a comment