Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Integration of schools

బడుల అనుసంధానం.. విద్యార్థులకు వరం
గ్రామీణ విద్యార్థులకు వారం రోజుల పాటు పట్టణ పాఠశాలల్లో బోధన
జిల్లాలో 876 పాఠశాలల ఎంపిక
Integration of schools

     విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, మేధో మథనం, భావవ్యక్తీకరణ పెంపొందించేందుకు సమగ్ర శిక్షణాభియాన్‌ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలను అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించి జిల్లాలో 876 పాఠశాలలను ఎంపిక చేశారు. అక్టోబరు మూడో వారంలో దీన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
      నగర, పట్టణంలోని పాఠశాలల్లో మెరుగైన వసతులున్న పాఠశాలలను గ్రామీణ ప్రాంత పాఠశాలలకు అనుసంధానం చేసి ఉపాధ్యాయులను పరస్పర మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను నగర, పట్టణ ప్రాంత పాఠశాలలకు తీసుకెళ్లి వారం రోజుల పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల నుంచి రెండేసి పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆయా బడుల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఆట స్థలం, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌, డిజిటల్‌ తరగతి గదులు తదితర సాంకేతిక వసతులతోపాటు పచ్చదనం, స్వచ్ఛత, శుభ్రత ఉన్నవాటినే ఎంపిక చేశారు.

విద్యార్థుల ఎంపిక ఎలాగంటే..

 ఎంపిక చేసిన పాఠశాలల్లో చురుకైన విద్యార్థులను గుర్తించాలి. తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. వారం రోజుల పాటు వీరికి గుణాత్మక విద్య, బోధనా విధానంపై అవగాహన కల్పించాలి. ప్రాజెక్టు వర్క్‌ రూపకల్పనపై మెలకువలు, విజ్ఞాన యాత్రలు, ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించే ఏర్పాట్లు చేయాలి. ఆర్ట్‌, క్రాప్ట్‌, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. జీవ నైపుణ్యాలు, జీవన శైలిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్రయోజనమిచ్చే కార్యక్రమం
      గ్రామీణ ప్రాంత విద్యార్థులను పట్టణ ప్రాంత పాఠశాలలకు తీసుకెళ్లి అక్కడ పలు అంశాలపై అవగాహన కల్పించడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఎంఈవోలు ఇచ్చిన నివేదికల ఆధారంగా జిల్లాలో 876 పాఠశాలల నుంచి 876 మంది విద్యార్థులను గుర్తించాం. పట్టణాలు, నగరాలకు సమీపంలో ఉన్న గ్రామీణ పాఠశాలలను ఎంపిక చేశాం. ఎంపిక చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులను పట్టణ ప్రాంతాలకు పంపిస్తాం. అక్టోబరు మూడో వారంలో మొదటి విడత కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
-బీవీవీ సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్షాభియాన్‌ అకడమిక్‌ పర్యవేక్షణాధికారి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Integration of schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0