Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inter education ,IIT .. JEE code names should be removed from the boards

ఇంటర్‌ విద్య ప్రక్షాళన!


 బోర్డుల్లో ‘ఐఐటీ.. జేఈఈ’ తొలగించాలి

 పదిరోజుల్లో సరిచేయకుంటే కఠిన చర్యలు

 ఫీజుల నియంత్రణ కమిషన్‌ కార్యాచరణ ప్రారంభం

 ప్రైవేటు హాస్టల్స్‌ నియంత్రణకు చట్టం తెస్తాం

 ఈమెయిల్‌, వాట్సా్‌పలోనూ ఫిర్యాదులు: మంత్రి సురేశ్‌
Inter education ,IIT .. JEE code names should be removed from the boards

ఇంటర్‌ విద్య ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. సోమవారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా కార్పొరేట్‌, ఇంటర్‌ కళాశాలలు ఐఐటీ, ఐఐఎం, జేఈఈ అంటూ వివిధ కోర్సులకు కోచింగ్‌ ఇస్తామంటూ బోర్డులు పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పది రోజుల్లోగా బోర్డులు సరి చేయకపోతే తొలుత రూ.10 వేలు జరిమానా విధిస్తామని, అప్పటికీ సరిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఇంటర్‌ కళాశాల పేరు, ప్రభుత్వం ఇచ్చిన కోడ్‌, అనుమతి పొందిన కోర్సుల వివరాలు మాత్రమే బోర్డులపై ముద్రించాలని ఆదేశించారు. మిగతా ఏ వివరాలూ బోర్డులో పొందుపరచకూడదన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాలలకు తెల్లరంగు బోర్డుపై బ్లూ అక్షరాలు ఉండాలని స్పష్టం చేశారు. పలు కళాశాలల్లో అనుమతులు లేకుండా కోర్సులు నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.

రాష్ట్రంలో మొత్తం 3,216 ఇంటర్‌ కళాశాలలుండగా, వాటిలో 80 శాతం ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, ఇవేవి నిబంధనల మేరకు నడవడంలేదని చెప్పారు. ఐఐటీ, జేఈఈ, టెక్నో స్కూళ్లు అంటూ బోర్డులు ఎలా పెడతారని మంత్రి నిలదీశారు. ఇప్పటికే 700 కళాశాలల బోర్డులను ప్రభుత్వ అధికారులు అధికారికంగా తొలగించారన్నారు. ఇంకా 1300 కళాశాలలు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయని, వీటి బోర్డులనూ పరిశీలించి తొలగించకపోతే జరిమానా వేస్తామన్నారు. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు ప్రతి విద్యార్థికి 40 చదరపు అడుగుల స్థలం కేటాయించాలన్నారు. ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణపై ఏర్పాటు చేసిన కమిషన్‌ కార్యాచరణ ప్రారంభించిందన్నారు. 2-3 లక్షల మేర ఫీజులు వసూలు చేస్తున్నారని, దానిపై కమిషన్‌ త్వరలోనే ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుందన్నారు. కమిషన్‌ త్వరలోనే తనిఖీలు చేసి శాస్త్రీయంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారో లెక్కలు చెప్పాలని ఇప్పటికే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు లేఖలు రాశామని, లెక్కలు చెప్పని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. చాలా ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో మైదానాలు లేవని, అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు లేవని, వీటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిమాపక ధృవీకరణ పత్రాలు అందజేయాలని చెప్పినా ఇప్పటికీ చాలా కళాశాలలు అందజేయలేదన్నారు. ఇంటర్‌ విద్య, ప్రైవేటు ఇంటర్‌ కళాశాలల్లోని సమస్యలు, తదితరాలపై అమరావతికి వచ్చే ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. 93912 82578 వాట్సాప్‌ నంబర్‌కు, లేదా ౌఠటఛజ్ఛ్చీఞఃజఝ్చజీజూ.ఛిౌఝ ఈమెయిల్‌ ఐడీకి ఫిర్యాదు చేయవచ్చని, పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

త్వరలో జేఎల్‌ పోస్టుల భర్తీ

2013 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకూ ఇంటర్‌ బోర్డు సమావేశం జరగలేదని మంత్రి చెప్పారు. సిలబస్‌ మార్పులు, ఇతర సంస్కరణ గురించి బోర్డు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జూనియర్‌ లెక్చరర్ల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ప్రైవేటు హాస్టళ్లపై ఇప్పటి వరకు ప్రభుత్వానికి నియంత్రణలేదని, విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంలోనూ చట్టాన్ని సవరించాల్సి ఉందని, త్వరలో ప్రైవేటు హాస్టల్స్‌ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఆర్‌ఐవో వ్యవస్థను ప్రక్షాళన చేసి, పటిష్ఠపరుస్తామన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inter education ,IIT .. JEE code names should be removed from the boards"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0