Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The government issued the memo for the implementation of GO no 91

పండిత పోస్టులు పండితులకే..
 పీడీలుగా మారనున్న పీఈటీలు..
జీవో అమలుకు మెమో జారీ చేసిన ప్రభుత్వం..
గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 91ను  అమలు చేయాలని ఆదేశాలు జారీ..
తమకు న్యాయం చేశారంటూ జగన్ పై ప్రశంసల వర్షం
The government issued the memo for the implementation of GO no 91

భాషా పండితులు , పీఈటీ పోస్టుల ! ఉన్నతీకరణపై వైఎస్ జగన్మో హన్ రెడ్డి ప్రభు త్వం ఉన్నత నిర్ణయం తీసుకుంది . అనేక సంవత్సరాల నుంచి తమ పోస్టులను ఉన్న తీకరించాలంటూ భాషా పండితులు , పీఈటీ లు పోరుబాట సాగిస్తూ ఉన్నారు . అయితే గత ప్రభుత్వాలు వారిని మభ్యపెట్టే విధంగా వ్యవ హరిస్తూ ఓటు బ్యాంకుగా వినియోగించు కుంటూ వచ్చాయి . అయితే వైఎస్ జగన్మో • హన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాఠ | శాల విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు . i అందులో భాగంగానే దీర్ఘకాలంగా ఆపరిష్క * తంగా ఉన్న భాషా పండితులు , పీఠటీ పోస్టులను ఉన్న తీకరిస్తూ సంచలన నిర్ణయం తీసు ఆ రెండు కేటగిరిలకు చెందిన పోస్టులను ఉన్నతీకరిస్తూ గతంలో జారీ చేసిన జీ నంబర్ 91ను అమలు చేయాలటూ ప్రభుత్వం మెమో జారీ చేసింది .

రెండు దశాబ్దాల శ్రమకు ప్రతిఫలం

 తమ పోస్టులను ఉన్నతీకరించాలంటూ భాషాపండితులు , పీఈటీలు దాదాపు రెండు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు . పాలకులు వారి న్యాయమైన డిమాండ్లను పూర్తిగా పక్కన పెట్టేశారు . భాషాపండితులు , పీఈటీలు మాత్రం పట్టువిడవకుండా పాలకు లపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు . చంద్ర బాబు ప్రభుత్వం పోస్టుల ఉన్నతీకరణకు సంబంధించిన జీఓను గత ఏడాది ఆగస్టులోజారీ చేసినప్పటికీ అమలు చేయకుండా నాన్చుతూ వచ్చారు . చివరకు సార్వత్రిక ఎన్నికలు రావడంతో తమను గెలిపిస్తే జీఓను అమలు చేస్తామంటూ నమ్మించే ప్రయత్నం చేశారు . జీఓ జారీ చేసిన వెంటనే దానిని అమ లు చేయకుండా నాన్చుతూ రావడంతో ఆ రెండు కేటగిరిలకు చెందినవారు చంద్రబాబు తీరుపై తీవ్రంగా రగిలిపోయారు .

ఒక్క మెమోతో 1078 మందికి ప్రయో జనం 

భాషా పండితులు , పీఈటీల పోస్టుల ఉన్నతీక రణకు సంబంధించి గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం 91ను అమలుకు జగన్ ప్రభు | త్వం విడుదల చేసిన ఒక్క మెమోతో జిల్లా లోని 1078మందికి ప్రయోజనం కలగనుంది .జిల్లాలో 911 మంది . భాషా పండితులు ఉన్నారు . వీరిలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 453 మంది . హిందీకి సంబంధించి 452 మంది , ఉర్దూకునలుగురు , సంస్కృతంకు ఇద్దరు భాషా పండితులు ఉన్నారు . అదేవిధంగా 167 మంది పీఈటీ లకు కూడా ప్రయోజనం కలగనుంది .

జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై భాషాపండితులు , పీఈటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు . ప్రతిపక్షనేతగా ఉన్న సమ యంలో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో భాషాపండితులు , పీఈటీలు కలిసి తమ పోస్టుల ఉన్నతీకరణను ఆయన దృష్టికి తీసు కువచ్చారు . మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పోస్టులను ఉన్నతీకరిస్తానంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు . అధికారంలోకి వచ్చి ! ఆరునెలలు గడవకముందే పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలుచేస్తూ జగన్ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది . తమ న్యాయమైన డిమాండను పరిష్కరించిన జగన్ నిర్ణయాన్ని ఆ రెండు కేటగిరిలకు చెందినవారు హర్షిస్తు న్నారు . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డికి , విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The government issued the memo for the implementation of GO no 91"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0