Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Methods of promotion of linguistic scholars


*భాషా పండితుల ఉన్నతీకరణ విధివిధానాలు ఖరారు..*
*ఉత్తర్వులు జారీ..*
*డిగ్రీలో తెలుగు ప్రధాన సబ్జెక్టు లేకుండా ఎంఏ తెలుగు చేసిన వారికి అవకాశం లేదు..*


త్వరలో భాషాపండితుల ఉన్నతీకరణ విధివిధానాల ఖరారు
 రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ , అనుబంధ రంగాల పాఠశాల్లో పనిచేస్తున్న లాంగ్వేజీ పండిట్లు ( ఎల్‌పీ ) , పీఈటీ , ఎన్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ బి . రాజశేఖర్ బుధవారం జీవో నంబరు - 77 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు . ఎంపీపీ , జిల్లా పరిషత్ , ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న లాంగ్వేజీ పండిట్లు , ఎన్జీటీలు స్కూల్ అసిస్టెంట్ - తెలుగుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా డిగ్రీలో తెలుగు ప్రధాన సబ్జెక్టుగాను ఓరియంటల్ లాంగ్వేజీ డిగ్రీ ( బీఓఎల్ ) చదివా ఉండాలి . దాంతోపాటు తెలుగు పండిట్ ట్రైనింగ్ / బీఈడీలో తెలుగు మెథడాలజీ సబ్జెక్టుగా ఉండాలి . డిగ్రీలో తెలుగు ప్రధాన సబ్జెక్టు లేకుండా ఏంఏ తెలుగు చేసిన వారికి అవకాశమివ్వలేదు . ఇదే పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్ - ఉర్దూ , కన్నడం , ఒరియా , తమిళ్ , సంస్కృతం , హిందీ పోస్టులకు నిబంధనల్ని విధించారు . డిగ్రీలో తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టుల లాంగ్వేజీ కలిగి ఉండాలి . పీఈటీ - స్కూల్ అసిస్టెంట్ స్థాయి పదోన్నతికి అభ్యర్థులు డిగ్రీతోపాటు బీపీఈడీ / ఎంపీఈడీలో అర్హత సాధించాలి . పూర్తి వివరాలను జీవోలో పొందుపరిచారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Methods of promotion of linguistic scholars"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0