Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New ‘Aarogyasri’ health cards from December 21


*డిసెంబర్ 21న ఆరోగ్యశ్రీ కార్డులు*
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహణ.
New ‘Aarogyasri’ health cards from December 21

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో ప్రారంభించబోతున్నారు. . రాష్ట్రంలో ప్రజా వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. మార్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, ఏలూరు, పులివెందులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటాను తయారు చేస్తాం. ప్రతి ఒక్కరికీ ఓ కార్డు ఇస్తాం. డిసెంబర్ 21న (ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు) అందరికీ కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తాం. లబ్ధిదారులకు సంబంధించిన హెల్త్ డేటా అందులో ఉంటుంది. ఆ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నాం. ప్రస్తుతం ఆరోగ్య శ్రీలో 1000 వ్యాధులు ఉన్నాయి. వాటిని పెంచుతున్నాం. డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా అందులోకి తీసుకొస్తాం.’ అని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ఆరోగ్య శ్రీలోకి మొత్తం 2వేల వ్యాధులను తీసుకొచ్చి జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.



*ముఖ్యాంశాలు :*
  • నవంబరు 1 నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు
  • శస్త్రచికిత్స చేయించుకున్నవారు కోలుకునేంతవరకు నెలకు రూ.5,000 లేదా రోజుకు రూ.225 (డిసెంబరు 1 నుంచి అమలు)
  • కిడ్నీ వ్యాది బాధితులకు నెలకు రూ.5,000
  • తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10,000
  •  పక్షవాతం, కండరాల క్షీణత, కాళ్లుచేతులు లేనివారికి నెలకు రూ. 5 వేలు పెన్షన్ (జనవరి 1 నుంచి అమలు)
  •  డెంగ్యూ జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు ఆరోగ్యశ్రీలో స్థానం
  • డబుల్ కాక్లియర్ ఇంప్లాంట్ కు ఆరోగ్యశ్రీలో స్థానం
  •  ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.16 వేలకు పెంపు
  • జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2000 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
  • ఇతర జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
  •  బైకుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు
  • ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి ఆసుపత్రి
  •  రోడ్డు ప్రమాద బాధితుల కోసం అత్యవసర నిధి ఏర్పాటు
  •             


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New ‘Aarogyasri’ health cards from December 21"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0