Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SA-I Exams are new pattern in 10 th class

  • టెన్తలో మాల్ ప్రాక్టీస్ నియంత్రణకు చర్యలు జరిది.
  • ఆడిషనల్ షీటకు స్వస్తి 
  •  24 పేజీల ఆన్సర్ బుక్
  • బిట్ పేపర్ రద్దు
  • ఇక పేపర్ల వారీగా గ్రేడులు
  •  పది పరీక్షల్లో కీలక సంస్కరణలకు విద్యాశాఖ శ్రీకారం 2020 మార్చి టెన్ పరీక్షల నుంచే అమలు
  • కొత్త పద్ధతిలోనే సమ్మేటివ్-1 పరీక్షలు..
  • పరీక్షల సమయం 15 నిమిషాల పెంపు..
  • నూతన పరీక్ష విధానంలో ప్రశ్న పత్రం ఇలా..
SA-I Exams are new pattern in 10 th class


 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూతనం సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం నుంచి 20 మార్కుల అంతర్గత మార్కులను తొలగించి ప్రతి సబ్జెక్టు పేపరు 100 మార్కులు ఉండాలా చర్యలు తీసుకున్నారు . ఈ విద్యా సంవత్సరా నికి సంబంధించి 2020 మార్చిలో నిర్వహించే ఎస్ఎస్సీ పరీక్షల నుంచే మరిన్ని సంస్కరణలు అమలు కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది . దీంతో ఇప్పటి వరకూ నిర్వహించే నిరంతర సమగ్ర మూల్యాంకనం ( సీసీఈ ) పరీక్షల విధానంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి . మాల్ ప్రాక్టీసు అవ కాశం లేకుండా పాదర్శకంగా పరీక్షలు నిర్వ హించేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకో నున్నారు . . . తాజా ఉత్తర్వుల ప్రకారం పదో తరగతి మార్కుల జాబితాలో ఇక నుంచి పేప ర్ - 1 , పేపర్ - 2 వారీగా , సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు ఇవ్వనున్నారు . పదో తరగతిలో హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉంటాయి . దీని ప్రకారం ఏదైనా సబ్జెక్టులో ఒక పేపరులో గ్రేడ్ పరంగా ఫెయిల్ అయినా , పేప ర్లవారీగా రెండు పేపర్ల మార్కుల కలిపిన తరు వాత పాస్ మార్కుల గ్రేడ్ వస్తే ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తారు . జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక - 2005 సిఫార్సులు , నూతన విద్యా విధానం - 2019 కోసం విద్యాశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు పది పరీక్షల్లో మార్పులు తెచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి సీవీ రేణుక తెలిపారు .

 బ్లూప్రింట్లో మార్పులు 

నాలుగు సెక్షన్లుగా విభజించారు . చాయిస్ లేకుండా ఆబ్జెక్టివ్ టైపు ( ఒక పదంలో సమాధానం ఇవ్వాలి ) , వెరీ షార్ట్ ఆన్సర్ టైపు ( ఒకటి లేదా రెండు వాక్యాల్లో సమాధానం రాయాలి ) , షార్ట్ ఆన్సర్ ( రెండు నుంచి నాలుగు వాక్యాల్లో సమాధానం రాయాలి ) , చాయిసకు అవకాశం ఉండే విధంగా వ్యాస రూపం ప్రశ్నలు ( ఎనిమిది నుంచి పది వ్యాక్యాల్లో సమాధానం రాయా లి ) , తెలుగు పేపర్ - 2లో రెండో ప్రశ్న , ఆంగ్ల పేపర్ - 1లో 35వ ప్రశ్న , పేపర్ - 2లో 28 ప్రశ్నలకు ఛాయిస్ ఇవ్వలేదు . 

అడిషనల్ షీటకు స్వస్తి

 పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు నాలుగు పేజీలు బుక్ లెట్ ముందు రాయాలి . తర్వాత ఆవసరమైన ఆన్సర్ షీట్లను విద్యార్థులు ఇన్వి జిలేటర్ నుంచి తీసుకుని రాసేవారు . ఇక
 పది పరీక్షలలో నాణ్యత ఉండేలా బ్లూప్రిం లో మార్పులు చేసారు . ప్రశ్నాపత్రాన్ని| ఆవిధానానికి విద్యాశాఖ స్వస్తి పలికింది . పది | జవాబు పత్రం స్వరూపం మారింది . జవాబు పత్రాలు విడిగా కాకుండా ఓఎంఆర్ షీలో | కలిపి ఒకేసారి 24 పేజీలతో కూడిన సింగిల్ ఆన్సర్ బుక్ లో అందిస్తారు . అదనపు సమా ధాన పత్రాలు ఇవ్వరు .

పరీక్షల కాల వ్యవధిలో స్వల్ప మార్పు

 పరీక్ష రాసే సమయంలో స్వల్ప మార్పు | చేసారు . ఇప్పటి వరకూ పరీక్ష రాసేంవుకు 2 . 30 గంటల సమయం కేటాయించేవారు . ఇప్పుడు మరో 15 నిమిషాలు అదనంగా ప్రశ్నాపత్రం విద్యార్థి క్షుణంగా చదువుకునేందుకు కేటాయిం | చారు . దీంతో పరీక్షా కాల వ్యవధి 2 . 45 గంటలు ఉంటుంది . ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ / ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సుకు | 8 . 15 గంటలు , సెకండ్ లాంగ్వేజ్ కి 3 గంటలు | సమయంలో జవాబులు రాయాల్సి ఉంది .

ప్రశ్నాపత్రాల రూపకల్పన ఎస్సీఈ ఆర్టీదే 

ఇప్పటి వరకూ పదో తరగతి ప్రశ్నాపత్రాలను జిల్లా విద్యాశాఖ జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థలు ప్రకటించిన బ్లూ ప్రింట్ ఆధా రంగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యా యులతో రూపొందించేవారు . ఈ పద్ధతిని ఇక నిలపుదల చేశారు . ప్రశ్నాపత్రాల రూపకల్పన బాధ్యతను ఎస్సీఈ ఆర్టీకి పాఠశాల విద్యాశాఖ అప్పగించింది . దీనికోసం ఒక అసెస్మెంట్ సెల్ ను ఎస్సీఈఆర్టీ అధికారుల ఏర్పాటు చేసు కోవాల్సి ఉంటుంది . ప్రశ్నాపత్రాలకు సంబంధిం చిన కాన్ఫిడెన్షియాలిటీని చూసేందుకు ఎస్సీ ఈఆర్టీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .

నూతన పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం ఇలా 

వ్యాస రూప ప్రశ్నలకు                     4 మార్కులు 
లఘు సమాధాన ప్రశ్నలకు :            2 మార్కులు
 అతి లఘు సమాధాన ప్రశ్నలకు :    1 మార్కు
 లక్షాత్మక ప్రశ్నలకు 2 :                    1 / 2 మార్కు


సమయం ఇలా 

పరీక్షకు మొత్తం సమయం :    2 . 45 గంటలకు 
ప్రశ్నపత్రం చదవడానికి :        10 నిమిషాలు 
పరీక్ష రాయడానికి :              2.30 గంటలు సమాధానాలు                     
సరిచూసుకోవడానికి:         15 నిమిషాలు

ప్రతి పేపర్లో 15మార్కులు రావాలి 


  • పాఠశాల విద్యలో ఇప్పటివరకు ఉన్న ప్రధాన , సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు విడివిడిగా పరీక్ష పత్రాలు ఉండేవి . చివరి అర్ధగంట సమయంలో 30 మార్కులకు బిటీ పేపర్ ఉండేది . ఇందులో జహుళైచ్చిక ( మల్టిపుల్ చాయిస్ ) విధా నంలో సమాధానాలు రాసేవారు . ప్రస్తుతం వాటిని తొల గించి మొత్తం వ్యాసరూప ప్రశ్నలే ఇవ్వనున్నారు . . . . • గతంలో రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు , ఇప్పుడు అలా కాకుండా ప్రతి పేపరులోనూ తప్పనిసరిగా 15 మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లుగా ఫలితాల్లో ప్రకటి స్తారు .
  • పరీక్ష సమయాన్ని అదనంగా 15 నిమిషాలు పెంచారు . 
  • ఈ కొత్త విధానంలో మొత్తం పరీక్ష సమయం 2 . 45 గంటలుగా నిర్ణయించారు . 
  • ఇదే విధానంలో త్వరలో సమ్మెటీవ్ అసెస్మెంట్ - 1 పరీక్ష లను నిర్వహించనున్నారు .
  •  హిందీ మినహా మిగిలిన పాఠ్యాంశాలకు రెండు పేపర్లు ఉంటాయి . 
  • హిందీ ప్రశ్నపత్రం 100 మార్కు లకు ఉంటుంది . చూసిరాతలను నివారించేందుకు ఇంటర్మీడియట్ తరహాలో 12 నుంచి 15 పేజీలుండే బుక్ టన్ను అందించనున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SA-I Exams are new pattern in 10 th class"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0