Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New capital for AP


  • ఏపీకి కొత్త రాజధాని ? 
  • శివరామకృష్ణ కమిటీ నివేదిక . .
  •  అమలు దిశగా అడుగులు 
  • 13 జిల్లాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా నిర్ణయాలు 
  •  విశాఖలో హైకోర్టు . . .
  •  రాయలసీమకు బెంచ్ 
New capital for AP


 క్యాపిటల్ నిర్మాణానికి కేంద్రం సాయం
నవ్యాం ధ్రప్రదేశ్ రాజధాని అంశం కొత్త మలుపు తీసుకుం టోంది . ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని అంశంపై అనేక ఊహాగానాలు వచ్చాయి . మంత్రి బొత్స సత్యనారాయణ లీకుల వ్యాఖ్యలతో మొదలైన రాజధాని మార్పు అంశం ఏపీ ప్రజలను అయోమయంలో పడేసింది . తాజా పరిణా మాలతో బొత్స వ్యాఖ్యలు నిజమేనని , రాజధాని మార్పు తథ్యమని తెలుస్తోంది . అమరావతి నుంచి వేరొక ప్రాంతానికి మార్చనున్నట్లు అధికార పార్టీ వర్గా లు స్పష్టం చేస్తున్నాయి . ఇందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది . జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చూస్తుంటే వీలైనంత త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసేలా , కొత్త రాజధాని నగరం అన్వేషణను మరింత వేగవంతం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది . కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న ఓ రహస్య నివేదిక ఆధారంగా కొత్త రాజ ధాని ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది .

 ఇదే అంశం కొత్త రాజధాని ఏర్పాటులో కీలక మారబోతుంది . ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణ కమిటీ తయారు చేసిన 187 పేజీల నివేదిక ప్రస్తుతం కేంద్రంవద్ద ఉంది . ఆ నివేదికలో పొందుపర్చిన పలు కీలక మైన అంశాల మేరకు కేంద్రం అడుగులు వేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి . 2014లో రాష్ట్రం లోని 13 జిల్లాల్లో పర్యటించిన కమిటీ 187 పేజీల నివేదికను కేంద్ర హోంశాఖకు 2 రకాల నివేదికలు సమర్పించింది . ఒక నివేదికను బహిరంగంగా సమర్పించగా , మరొకటి రహస్యంగా అందజేసింది . రెండవ నివేదికపై కేంద్ర హోంశాఖతో కమిటీ సుదీర్ఘంగా చర్చించి సమర్పించింది . ఆ నివేదికలో కీలకమైన అంశాలను ప్రస్తావించింది . ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అత్యవసరమని సూచించింది . ఒకవేళ అది సాధ్యంకాని పక్షంలో ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం మంచిదని చెప్పింది . అలాగే విజయవాడ , గుంటూరు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు ఆర్థికంగా , పర్యావరణ పరంగా నష్టమని స్పష్టం చేసింది . రాజధాని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ . 1536 కోట్లు అవసరమని సూచించింది . శాసనసభ , సచివాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది . అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో లేవని ఉదహరించింది .

సేకరణ :అమరావతి , ఆంధ్రప్రభ బ్యూరో : 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New capital for AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0