Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The ideal teacher

ఆదర్శ ఉపాధ్యాయుడు

  •  ఆదర్శ ఉపాధ్యాయుడు మురళీకృష్ణ
  •  పాఠశాల సమయం అయిపోగానే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ సెలవులు 
  •  ఖాళీ సమయాల్లోనూ అభ్యర్థులకు పాఠాలు 
  • గ్రామ సచివాలయాల్లో ఆయన శిష్యులు 19 మందికి ఉద్యోగాలు
The ideal teacher


రోజంతా పనిచేస్తున్నాం . . ఇంటికెళ్లి కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి అని మనలో చాలా మందిమి అనుకుంటాం . . లేదా కుటుంబంతో అలా బయటకెళ్లి సరదాగా గడిపొద్దాం అని ఎవరికైనా ఉంటుంది . . అయితే మురళీ కృష్ణ మాస్టారు అలా అనుకోలేదు . తాను పడిన కష్టాలు ఎవరూ పడకూడదని భావించారు . పేదరికరం పోవాలన్నా , అసమానతలు తొలగాలన్నా , సమాజం నుంచి నిరుద్యోగితను తరిమికొట్టడమే ఏకైక మార్గం అని అనుకున్నారు . పాఠశాల వేళలు అయిపోగానే నిరుద్యోగులకు పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణనిస్తారు . ఏదో మొక్కుబడిగా కాకుండా విశ్లేషణాత్మకంగా రాత్రి పొద్దుపోయే వరకు శిక్షణనిచ్చి . . ఆనక ఇంటికెళతారు . ఇటీవల జరిగిన నచివాలయ పరీక్షల్లో ఆయన శిష్యులు 19 మంది ఉద్యోగాలు సాధించడం ఆయన కృషికి మచ్చుతునక . . .

 పగలల్లా తరగతి గదిలో విద్యార్దు లకు పాఠాలు బోధిస్తారు . . . సాయంత్రం వేళ , సెలవు దినాలలో ఖాళీ సమయంలో నిరుద్యో గుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత శిక్షణ ఇస్తారు . . . ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటల పాటు ఇది ఉచిత సేవ . ఆయన చేస్తున్న సేవ ఎందరో నిరుద్యోగుల పాలిట వెలుగులవుతున్నాయి . ఆయనే పట్టణంలోని ఎల్‌సీ కార్యాలయం పక్కనే ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రెబ్బు మురళీకృష్ణ మాస్టారు .

బోధనపై మక్కువ . . 

మురళీకృష్ణకు బోధన అంతే ఎంతో మక్కువ , తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు సులువు గా అర్ధమయ్యేలా బోధించడమే కాకుండా , సాయం త్రం వేళ పోటీపరీక్షలు రాసే నిరుద్యోగులకు ఉచితంగా శిక్ష ఇనిస్తూ ముందుకు సాగుతున్నారు . వృత్తి బోధన అయినప్పటికీ ప్రవృత్తి మాత్రం నిరు ద్యోగలకు ఉచిత శిక్షణనివ్వడం . ఆయన పాఠ శాల వదిలిన తరువాత సాయంత్రం 4 గంటల నుంచి ఖాళీగా ఉండలేక గత రెండేళ్లుగా పోటీప రీక్షలు రాసే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ నిస్తు న్నారు . దాదాపు ఏడాదిన్నర కాలంగా గ్రూపు - 2 , గ్రూపు - 3 పరీక్షలకు సిద్ధ మవు తున్న అభ్య ర్థులతో పాటు సచివాలయ ఉద్యోగాలకు , కానిస్టేబుల్ రాత పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్ష ణ ఇచ్చారు . విజయవాడ వంటి నగరాలకు వెళ్లి శిక్షణ పొందాలంటే వేలాది రూపా యల ఫీజులు చెల్లించలేక ఇంటి వద్దే ఉండి సిద్ధమయ్యే పేద వర్గాల అభ్యర్థులకు ఆయన ఇస్తున్న శిక్షణ ఎంతో ఉపయుక్తమవుతోంది .

19 మందికి సచివాలయ ఉద్యోగాలు

 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 1 . 30 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించడం జరిగింది . సచివాలయ ఉద్యోగాలకు దర ఖాస్తున్న నిరుద్యోగులకు నెలరోజుల పాటు మురళీకృష్ణ మాస్టారు ఉచిత శిక్షణనిచ్చారు . శిక్షణకు నూజివీడుతో పాటు గుడివాడ , జై కలూరు , హనుమాన్ జంక్షన్ , విస్సన్నపేట , నందిగామ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 100 మంది అభ్యర్థులు రాగా వారిలో 19 మందికి ఉద్యోగాలు లభించడం గమనార్హం .

యస్.ఆర్.ఆర్.యస్.ఆర్.ఆర్.హైస్కూల్ ఆవరణలో 

పట్టణంలోని ఎస్ఆర్ఆర్ హైస్కూల్ ఆవరణలో ఉన్న గ్రేడ్ -1 శాఖ గ్రంథాలయం ఆవరణలో కొంతకాలం , ఆ తరువాత ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు . వీరికి సిలబస్లోని అంశాలే కాకుండా జనరల్ నాలెడ్జ్ కరెంట్ ఆఫైర్స్ అంశాల గురించి విశదీకరిస్తూ బోధించారు . శిక్ష గానిస్తూనే మరల రెండు రోజులకొకసారి అధ్య ర్థులకు స్లిటెస్టు నిర్వహిస్తూ వారి సామ ర్యాన్ని పరీక్షిస్తూ తగ్గట్టుగా శిక్షణను నిర్వ హించారు .

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే . . 

కోచింగ్లకు డబ్బులు చెల్లించలేక ఇంటి వద్దనే ఉండి ప్రిపేర్ అయ్యే పేదవర్గాల అభ్యర్థులకు ఉపయో గపడాలనే లక్ష్యంతో ఉచిత శిక్షణ ఇస్తున్నాను . గతంలో గ్రూపు - 2 రాసిన అనుభవం వీరికి కోచింగ్ ఇవ్వడానికి ఎంతో ఉపయోగప డుతోంది . శిక్షణను కూడా అధ్య ర్థులకు అనుకూలమైన సమయా లోనే నిర్వహిస్తున్నాం . ఉద్యోగం లేని సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాను . నేను పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదనే ఉచితంగా శిక్షణ ప్రారంభించాను . ఉద్యో గాలు వచ్చిన వారి కళ్లల్లో ఆనందం ఎప్పటికీ మరిచిపోలేను , -

రెబ్బు  మురళీకృష్ణ , ప్రభుత్వ ఉపాధ్యాయుడు , నూజివీడు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The ideal teacher"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0