Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Rajasthan government has taken decision. The girls decided not to have male teachers.



ప్రభుత్వం కీలక నిర్ణయం : అమ్మాయిలకు మగ టీచర్లు వద్దు

రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు మగ టీచర్లు వద్దు అని నిర్ణయించింది. రాష్ట్రంలోని బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష టీచర్లను వెనక్కి పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్ లో ఈవ్ టీజింగ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుందని అధికారులు తెలిపారు. బాలిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులను వెనుక్కి పిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతస్రా తెలిపారు.
The Rajasthan government has taken  decision. The girls decided not to have male teachers.

బాలికల స్కూల్స్ లో మహిళా టీచర్లనే నియమించడానికి ప్రాధాన్యం ఇస్తామని, ఒకవేళ వీరు సరిపోకపోతే 50 ఏళ్ల దాటిన వయస్సున్న పురుష టీచర్లను నియమిస్తామని చెప్పారు. బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానని, అది వచ్చాక పరిస్థితిని బట్టి మహిళా టీచర్ల నియామకాన్ని అమలు చేస్తామని మంత్రి వివరించారు.

ఈవ్ టీజింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెబుతున్నా.. పలువురు తప్పుపట్టారు. రాష్ట్రంలోని 1,019 బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లపు మగ టీచర్లను వెనక్కి పిలవడం చాలా సులభమే.. కానీ ఈ చర్య వల్ల దాదాపు 95 శాతం ఉన్న మిగతా పాఠశాలల్లోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు భయానికి లోనవుతారు అని యూనిసెఫ్ మాజీ పాలసీ ప్లానర్ కేబీ కొటారి అన్నారు. తాము వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని బాలికలు భయపడతారని అన్నారు.

రాజస్తాన్‌లో 1,019 బాలికల పాఠశాలు ఉన్నాయి. 68,910 కో-ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3.82 లక్షల మంది టీచర్లు పనిచేస్తుండగా పురుష, మహిళా టీచర్ల రేషియో 2:1గా ఉంది. రాజస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సమస్యకి ఇది పరిష్కారం కాదని అంటున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "The Rajasthan government has taken decision. The girls decided not to have male teachers."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0