Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PF Loans Easy For Employees

 PF Loans Easy For Employees

 ఉద్యోగులకు పీఎఫ్ రుణాలు ఈజీ..
జిల్లా పరిషత్తు , మండల పరిషత్తు యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉద్యోగులు , ఉపాధ్యాయులకు తాము దాచు ! కున్న ప్రావిడెంటు ఫండ్ నుంచి తాత్కాలిక రుణాలు , శాశ్వత రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం అనేక వెసు లుబాట్లు కల్పించింది . పీఎఫ్ విషయంలో ఈ విభాగం ఉద్యోగుల కోసం ప్రతి జిల్లాలో ఒక విభాగం ప్రత్యేకంగా పనిచేస్తోంది . జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఒక సూప రింటెండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షణలో పది మంది సిబ్బంది . ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు .
 PF Loans Easy For Employees

ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు సంబంధించి రుణాలు , తాత్కాలిక అడ్వాన్సులు మంజూరు చేసే అధికారం డి ప్యూటీ సీఈవో ఆధీనంలో ఉంచారు . ఉద్యోగులు , ఉపాధ్యాయులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న త ర్వాత నెల రోజుల్లో అన్ని వివరాలు , ఆధారాలను పరిశీ లించి వారి అర్హత , స్థాయి ఆధారంగా ఎంత మొత్తం చెల్లించాలో నిర్ణయించి చెక్కు రూపంలో అందిస్తారు . మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు , జిల్లా పరి షత్తు విభాగ ఉద్యోగులు , గుమస్తాలకు మండల విద్యా శాఖాధికారి ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి ప్రతిపాదనలు పంపిస్తే జడ్పీ ఆధికారులు మంజూరు చేస్తారు . ఇంతవ రకు ఈ విధానాన్ని నామమాత్రంగా నిర్వహిస్తుండగా , ఇప్పుడు కొత్తగా మార్పులు చేశారు . ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో పొందుపరిచారు . వారి సొమ్ము ఎంత ఉందో ఎవరికి వారు తెలుసుకునే అవకాశాన్ని క ల్పించారు . వివిధ అవసరాల నిమిత్తం దాచుకున్న సొమ్మును తీసుకునే విధానంలో కొన్ని వెసులుబాట్లు కూ డా కల్పించారు . ఆ వివరాలను ఈ వారం ' ఉద్యోగ పర్వం ' లో తెలుసుకుందాం . . .

 వివిధ రకాల అడ్వాన్సులు , అప్పులు

 సాధారణ భవిష్యనిధి ( పీఎఫ్ ) లో ఉద్యోగులు ప్రతి నెలా ఎంతో కొంత సొమ్ముని దాచుకుంటారు . ప్రైవేటు కంపెనీల్లో అయితే ఆ సంస్థ ప్రతినిధులు ఆ సొమ్మును ఉద్యోగుల నుంచి తీసుకోవడంతో పాటు అంతే మొత్తాన్ని జమ చేసి ప్రత్యేక ఖాతాలో ఉంచి వారు పదవీ విరమణ చేసినా , మరో కంపెనీకి బదిలీ అయినా దానిని అంది స్తారు . స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్తు , మండల పరిష త్తులలో అయితే నిల్వలో ఉన్న సొమ్మును తిరిగి చెల్లించ నవసరం లేని ఆప్పులుగా ఇస్తారు . వీటిని ఉద్యోగులు తాము దాచుకున్న సొమ్ము నుంచే అందిస్తారు . అందు వల్ల వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు .
పదవీ విరమణ సమయంలో ఈ విధంగా తీసుకున్న అడ్వాన్సులను మినహాయించి మిగిలిన సొమ్మును మాత్రమే ఇస్తారు . కొన్ని రుణాల విషయంలో ఉద్యోగుల సర్వీసులో మళ్లీ చెల్లించవలసిన అప్పులుగా నిర్ణయించి దాని ప్రకారం అందజేస్తారు . వీటికి నిర్ణీత గడువు విధించి ఆలోగా తీర్చడానికి వీలుగా నిబంధన విధిస్తారు . రుణాలు తీసుకునే ఉద్యోగులు , ఉపాధ్యాయులు తాము ప్రతినెలా చెల్లించాల్సిన పీఎఫ్ వాయిదా సొమ్మును చెల్లి స్తూనే . . . తీసుకున్న రుణాలకు సంబంధించి నెలవారి వాయిదాలను కూడా జమ చేస్తుండాలి . లేకపోతే వారి నుంచి బలవంతంగా వసూలు చేసే పరిస్థితి ఉంటుంది .

తిరిగి చెల్లించే విధానం 

సాధారణ కారణాలతో తీసుకున్న రుణాన్ని 12 నెలలు లేదా 24 నెలల్లో సమాన వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది . ప్రత్యేక కారణాలతో తీసుకున్న అప్పును 24 నెలలు లేదా 36 నెలల్లో తిరిగి చెల్లించాలి . ఆయితే నెలల నిర్ణయం ఉద్యోగుల ఇష్టాన్ని బట్టి ఉంటుంది . త్వరితంగా రుణాన్ని తీర్చివేయాలని అనుకున్నవారు తక్కువ నెలల గడువును కోరుకుంటారు . పాత లోన్ తీరకుండా మళ్లీ కొత్తగా అవసరమైతే తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది . అలా తీసుకుంటే పాత , కొత్త దానికి కూడా ప్రతినెలా నగదు చెల్లించాల్సి ఉంటుంది .

నిబంధనలు పాటించాల్సిందే . .

 ఈ విధంగా తాత్కాలిక ఆడ్వాన్సులు తీసుకునే సమవనలను కచ్చితంగా పాటించాలి . నును ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు . రెండుసార్లు ఆడ్వాన్సులు తీసుకుంటే రెండింటికీ మధ్య ఆరు నెలల తేడా తప్పనిసరిగా ఉండాలి . . . .

మంజూరు చేసే అధికారం 

భవిష్యనిధి అడ్వాన్సులను , రుణాలను వివిధ స్థాయిల లో ఉద్యోగులు , ఉపాధ్యాయులకు మంజూరు చేసే అధికారం ఉన్నతాధికారులకు అప్పగించారు . - ఎస్కీవోలందరికీ జీతాలిచ్చే డ్రాయింగ్ అధికారి వీటిని మంజూరు చేస్తారు . ఒకవేళ డ్రాయింగ్ అధికారి గెజిటెడ్ కాకపోతే ఈ శాఖలో ఉన్న గెజిటెడ్ అధికారికి మంజూరు చేసే అధికారం ఉంటుంది . అదే కార్యాలయంలో ఇద్దరు , ముగ్గురు గెజిటెడ్ అధికారులుంటే వారికంటే పైస్థాయిలో ఉన్న అధికారులు మంజూరు చేస్తారు . » జిల్లా పరిషత్తు , ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశా లల ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖాధికారి , ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు గెజిటెడ్ ప్రధానో పాధ్యాయులు , ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ డీఈవోలు మంజూరు చేస్తారు . - జిల్లా పరిషత్తు ప్రధానోపాధ్యాయులకు , వారి కార్యాల యాల్లో పనిచేసే సిబ్బందికి జడ్పీ సీఈవో మంజూరు చేస్తారు . - మంజూరైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందిస్తారు .

 బూస్టర్ స్కీమ్ . . 

జిల్లా పరిషత్తు పరిధిలో ప్రావిడెంటు ఫండ్ ఖాతాదా రులు సర్వీసులో ఉంటుండగా చనిపోతే వారికి బూస్టర్ స్కీమ్ పేరుతో అత్యధికంగా రూ . 20 వేలు అందిస్తారు . చనిపోవడానికి మూడేళ్ల ముందు వారి ఖాతాలలో గెజి టెడ్ ఉద్యోగులకు రూ . ఎనిమిది వేలు , నాన్ గెజిటెడ్ వారికి రూ . ఆరు వేలు , లాస్ట్ గ్రేడ్ వారికి రెండు వేల రూపాయల నిల్వ ఉండాలి . అలా ఖాతాలో నిల్వ ఉన్న మొత్తానికి రెట్టింపు లేదా రూ . 20 వేలు మించకుండా చె ల్లిస్తారు . దీనిని బూస్టర్ స్కీమ్ గా పిలుస్తారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to " PF Loans Easy For Employees"

  1. Please mention eligibility to take non recoverable loan

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0