Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sand permits in village secretaries. 'Transit pans are valid for 48 hours immediately after payment

  • గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు.
  • ' డబ్బు చెల్లించిన వెంటనే ట్రాన్సిట్ పాన్లు 48 గంటల పాటు చెల్లుబాటు 
  •  నదుల్లో వరద నేపథ్యంలో వాగులు , వంకలు , ఏరులలో ఇసుక వినియోగానికి విధి విధానాలు జారీ 
  • ప్రతి జిల్లాలో 1 - 3 ఆర్డర్ రీచ్ గుర్తింపు బాధ్యత కలెక్టర్లకే
  •  వలంటీర్లకు రీచ్ పర్యవేక్షణ బాధ్యత 
  • వాల్టా చట్టం పకడ్బందీగా అమలు 
  • 3 నెలల తర్వా త మరోసారి సమీక్షించనున్న ప్రభుత్వం
Sand permits in village secretaries.  'Transit pans are valid for 48 hours immediately after payment


రాష్ట్రంలో చిన్నచిన్న వాగులు , వంకలు , ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు కొరత తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇందులో భాగంగా ఏరులు , వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు , రవాణాను క్రమబద్దీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది . ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్టీమ్స్ గా పరిగణించే వంకలు , వాగులు , ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది . గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది .

ముఖ్యమంత్రి సూచన మేరకు మార్గదర్శకాలు . . . 

ఇప్పటివరకు ప్రజలు ఎక్కువగా పెద్ద పెద్ద నదుల ఇసుకపైనే ఆధారపడుతూ వస్తున్నారు . వరదల నేపథ్యంలో దీనివల్ల సమస్య ఏర్పడింది . ఈ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బుధవారం చర్చించిన అనంతరం ఆయనసూచనల మేరకు భూగర్భగనుల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది . ఒకటి నుంచి మూడు ఆర్డర్ స్టీమ్స్ లో ఇసుక తవ్వకాలు , వినియోగానికి సంబంధించి తాజాగా రూపొందించిన మార్గదర్శకాలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని , తర్వాత సమీక్షించి అవసరమైన మార్పు చేర్పులు చేస్తామని అందులో స్పష్టం చేసింది .

 ఇసుక రీచ్ ల గుర్తింపు బాధ్యత కలెక్టర్లకు

 భారీగా ఇసుక లభించే గోదావరి , కృష్ణా , తుంగభద్ర , వంశధార , పెన్నా లాంటి పెద్ద నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు వీలు లేనందున ఏర్పడిన కొరతనువంకలు , ఏరులు , వాగుల ద్వారా అధిగమిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది . అప్ టు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ గా పేర్కొనే వీటిలోని ఇసుకను ఏపీ వాల్టా చట్టం నిబంధనల మేరకు తవ్వి స్థానిక అవసరాలు తీర్చాలని గనుల శాఖ ఆదేశించింది . ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలవారీగా జిల్లాల్లో ఈ తరహా ఇసుక రీ లు ఎన్ని ఉన్నాయో గుర్తించే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది . ఇందులోని ఇసుకను స్థానిక అవసరాలకు ( వ్యాపారానికి కాదు ) మాత్రమే వినియోగించు కునేలా గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షిస్తారు .

సరఫరా ఇలా . . .

 ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్ ( ట్రాన్సిట్ పాస్ ) తీసుకోవాలి . సచివాలయ అధికారి ఒరిజినల్ పర్మిట ను ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు . ఇసుక రీచ్ పర్యవేక్షణను గ్రామ సచివాలయ ఇన్‌చార్జి సంబంధిత వలంటీరు అప్పగిస్తారు . సచివాలయంలో డబ్బులుచెల్లించిన వారు రేవు వద్దకు వెళ్లి పర్మిట్ ను . . వలంటీరు ఇచ్చి ట్రాక్టరు , ఎద్దుల బండిలో ఇసుక నింపుకొని తీసుకెళ్లవచ్చు . ఈ పర్మిట్ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది . నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్ చెల్లుబాటు కాదు . ట్రాక్టర్లలో ఇసుకను రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి తీసుకెళ్లరాదు .

 పర్మిట్ తప్పనిసరి . .

 ఇసుక రవాణా పర్మిట్ పాన్ల జారీ కోసం ముద్రించిన ఫారం - ఎస్ 3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేస్తుంది . ఇసుకను తరలించేందుకు పర్మిట్ తప్పనిసరి . పాస్ లేకుండా తరలిస్తే జరిమానా విధిస్తారు . ప్రతి పాసకు ఒరిజనల్ , డూప్లికేట్ అనే రెండు పేపర్లు ఉంటాయి . దీంతో ఏయే గ్రామ సచివాలయం పరిధిలో ఎంత ఇసుక విక్రయించారనే గణాంకాలు పక్కాగా ఉంటాయి . వరదల వల్ల తాత్కాలికంగా ఏర్పడిన ఇసుక సమస్యను పరిష్కరించడం కోసమే భూగర్భ గనుల శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది .

 భారీ వరదలు , వర్షాలతో . . . . 

మాఫియాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇసుకతవ్వకం , సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు నాలుగో తేదీన కొత్త విధానాన్ని ప్రకటించింది . ప్రజల అవసరాల మేరకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ( ఏపీఎండీసీ ) కి అప్పగించింది . ఈ సీజన్లో అన్ని నదుల్లో నిరంతరాయంగా వరద కొనసాగుతోంది . ఈ వారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది . నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రీచ్ లన్నీ నీటితో నిండిపోయి ఇసుక తవ్వకాలు జరపలేని పరిస్థితి ఏర్పడింది .

 ఐదేళ్లకు సరిపడా నిల్వలు

 ప్రస్తుతం రాష్ట్రంలోని నదుల్లో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలున్నాయి . వరదనీరు తగ్గుముఖం పట్టగానే రీచ్ లో తవ్వకాలు ఆరంభించి ప్రజలు కోరినంత ఇసుక సరఫరా చేస్తామని భూగర్భ గనులశాఖ అధికారులు తెలిపారు . ప్రారంభంలో ఏపీఎండీసీ రోజుకు ఐదు వేల టన్నుల ఇసుకను మాత్రమే ప్రజలకు సరఫరా చేసేది . ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ 45 వేల టన్నుల వరకు సరఫరా చేస్తోంది . వరద తగ్గితే రోజుకు లక్ష టన్నులు సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఏపీఎండీసీ అధికారులు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sand permits in village secretaries. 'Transit pans are valid for 48 hours immediately after payment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0