Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Single test different jobs

ఒక పరీక్ష.. భిన్న ఉద్యోగాలు
 గ్రూపులుగా రాష్ట్రంలోని పోస్టుల విభజన
 కసరత్తు చేస్తున్న ఏపీపీఎస్సీ

ఒక పరీక్ష.. భిన్న ఉద్యోగాలు

నిరుద్యోగ యువతపై పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ దీనిపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలను సివిల్‌ సర్వీసెస్‌, మెడికల్‌, ఇంజినీరింగ్‌, టీచింగ్‌, జనరల్‌ సర్వీసెస్‌ గ్రూపులుగా విభజించాలని కమిషన్‌ భావిస్తోంది. వీటికి అనుగుణంగా ప్రకటనలు జారీ చేసి, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Single test different jobs

ఒక్కో గ్రూపునకు ఒక్కో పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఈ గ్రూపుల్లో ఉండే ప్రత్యేక పోస్టుల(న్యాయ, ఆర్థిక తదితర)కు మాత్రం వాటి అర్హతలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కమిషన్‌ అంతర్గతంగా ఏర్పాటుచేసిన కమిటీ ద్వారా ఈ కసరత్తు చేస్తున్నారు.  నెలాఖరులోగా గ్రూపులపై చర్చించి  రాష్ట్ర ప్రభుత్వానికి  నివేదిస్తారు.  ప్రభుత్వ స్థాయిలో పరిశీలించాక అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఫలితమిస్తే ఉద్యోగార్థుల సమస్యలు తీరనున్నాయి. విభిన్న ఉద్యోగాలకు వివిధ పరీక్షలు రాస్తూ అనుభవిస్తున్న కష్టాల నుంచి యువత గట్టెక్కనున్నారు. ప్రస్తుతం డిగ్రీ అర్హతతో ఉన్న పలు ఉద్యోగాలకు వేర్వేరుగా పోటీ పరీక్షలు రాస్తున్నారు. అన్నింటికీ వేర్వేరుగా సన్నద్ధం అవుతున్నారు. వీటికోసం విలువైన సమయం వెచ్చిస్తున్నారు. ఖర్చులూ తడిసి మోపెడు అవుతున్నాయి. పైగా ఒక్కోదాని ఫలితాలు ఒక్కో సమయంలో వెలువడుతున్నాయి. మొత్తంగా... నియామక ప్రక్రియను ముగించడానికి అధికారులూ చాలాకాలం తీసుకుంటున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత కొందరు అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు ఎంపికవుతున్నారు. ఇలాంటి వారు తమకు ఇష్టమైన పోస్టులోనే ఉండిపోతున్నారు. మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంటూ వస్తున్న పోస్టులు మళ్లీ ఖాళీగానే ఉండిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఏపీపీఎస్సీ ప్రాథమిక కసరత్తు ప్రారంభించింది.

ఒక పరీక్ష.. భిన్న ఉద్యోగాలు

దారి చూపిన సచివాలయ ఉద్యోగాలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కింద ఇటీవల ప్రకటించిన పోస్టుల్లో నాలుగింటిని ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేశారు. దీనివల్ల అభ్యర్థులకు సులువైంది. ప్రభుత్వంపై ఆర్థిక, పనిభారం తగ్గింది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతి ఏడాది జనవరి నుంచే ఖాళీలను భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కమిషన్‌ నుంచి ప్రతిపాదనలు వెళ్లిన వెంటనే త్వరితగతిన ఆమోదం లభిస్తుంది. ప్రతి ఏడాది క్యాలెండర్‌ విధానంలో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సైతం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తంచేసింది.
స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌-ఎ

ఈ విభాగంలో 30కి పైగా పోస్టులు ఉండే అవకాశముంది. వాటిలో... డిప్యూటీ కమిషనర్‌(దేవాదాయ), అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(అటవీ శాఖ), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, డిప్యూటీ కలెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌(వాణిజ్య పన్నులు), డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు(పోలీస్‌), డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(మెన్‌), రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ పంచాయతీరాజ్‌ ఆఫీసర్‌్్స, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(వయోజన విద్య), రీసెర్చి ఆఫీసర్‌ (ఏపీ లెజిస్లేచర్‌ సెక్రటేరియట్‌), అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏపీ ఎకనామిక్స్‌), లే సెక్రటరీ(ఆరోగ్య శాఖ), డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌(కార్మిక శాఖ), సెరికల్చర్‌ ఆఫీసర్స్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌(వ్యవసాయ శాఖ), ఇతర పోస్టులు.
రాష్ట్ర, మల్టీజోన్‌, జోన్‌ స్థాయిలో భర్తీ జరిగే ఈ ఉద్యోగాలు గెజిటెడ్‌ కేటగిరీకి చెందినవి.

సివిల్‌ సర్వీసెస్‌-బి

ఈ విభాగంలోకి కనీసం 60 రకాల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిలో... అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌(దేవాదాయ), ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(ఏపీ ఫారెస్ట్‌ సర్వీసెస్‌), మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌(కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-2, పంచాయతీ కార్యదర్శులు, సబ్‌ రిజిస్ట్రార్‌, డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌(జువైనల్‌ వెల్ఫేర్‌), అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌, ఆబ్కారీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ గ్రేడ్‌-2 (రిజిస్ట్రార్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌), సీనియర్‌ ఆడిటర్‌(ఆడిట్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌), జూనియర్‌ అసిస్టెంట్స్‌(రవాణా, పంచాయతీరాజ్‌, డ్రగ్స్‌ అండ్‌ కాపీ రైట్స్‌, ప్రొహిబిషన్‌ ఇతర), జూనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌(వ్యవసాయ) తదితర పోస్టులు ఉన్నాయి.
రాష్ట్ర, జోనల్‌, మల్టీ జోనల్‌ స్థాయిల్లో భర్తీ జరిగే ఈ పోస్టులన్నీ నాన్‌-గెజిటెడ్‌ విభాగానివి.

జనరల్‌ సర్వీసెస్‌

ఈ విభాగంలో కనీసం 25 నుంచి 30 పోస్టులు ఉండే అవకాశం ఉంది. వీటిలో... తెలుగు, ఇంగ్లీష్‌ రిపోర్టర్లు, ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కెమిస్ట్‌, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌(హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ డిపార్టుమెంట్‌), అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్స్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌-1), అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌(పశు సంవర్థక శాఖ), పోర్టు ఆఫీసర్‌(పోర్టు డిపార్టుమెంట్‌), ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌(ఫారెస్ట్‌ సర్వీస్‌), జూనియర్‌ అనలిస్ట్‌(డ్రగ్‌ కంట్రోల్‌), అసిస్టెంట్‌ క్యూరేటర్‌, సినిమా ఆపరేటర్‌, రీసెర్చి ఇన్వెస్టిగేటర్‌, డార్క్‌రూం అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(గిరిజన), క్రేన్‌ రెగ్యులేషన్‌ ఇన్‌స్పెక్టర్స్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ షుగర్‌ కేన్‌), అసిస్టెంట్‌ డైరెక్టర్‌(గిరిజన సంక్షేమం) తదితర పోస్టులు ఉన్నాయి.
రాష్ట్ర స్థాయి, జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయిల్లో వీటిని భర్తీ చేస్తారు. ఇందులో గెజిట్‌డ్‌, నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు ఉన్నాయి.

మెడికల్‌ సర్వీసెస్‌

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌(స్పెషలిస్ట్స్‌), డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, మెడికల్‌ ఆఫీసర్లు(యునానీ, హోమియో, ఆయుర్వేద), క్లినికల్‌ సైకాలజిస్ట్‌, ఇతర పోస్టులు.
రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ఇవన్నీ గెజిటెడ్‌ కేటగిరీలోకి వస్తాయి.

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌

ఈ విభాగంలో 40 వరకు పోస్టులుంటాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏపీ పోలీస్‌ కమ్యూనికేషన్స్‌), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్స్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌), అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌(గ్రౌండ్‌ వాటర్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్స్‌(సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌), అసిస్టెంట్‌ ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మన్‌ (టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌) తదితర పోస్టులు ఉన్నాయి.
వీటిని రాష్ట్ర స్థాయిలో, జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయి(గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌)లో భర్తీ చేస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Single test different jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0