Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Central Electoral Commission is another opportunity for changes and additions to the voter list

మరో అవకాశం..ఓటరు మార్పులు, చేర్పులకు ఇంకో చాన్స్‌
15 వరకు వెరిఫికేషన్‌ జోరుగా సాగుతున్న ప్రక్రియ
The Central Electoral Commission is another opportunity for changes and additions to the voter list

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అధికారులు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పుఒప్పులను సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టర్‌ వెరిఫికేషన్‌ ప్రొగ్రాం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో అక్టోబరు 15వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దీని ప్రకారం ఓటర్లు జాబితాలను పరిశీలించుకుని సవరణలు చేసుకోవచ్చు. 18ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే వీలుంది.

సవరణ విధానం ఇలా...

ఓటరు జాబితా సర్వేలో భాగంగా బూత్‌లెవల్‌ అధికారులు ఇంటింటికీ వస్తారు. ఈ సమయంలో పూర్తి వివరాలు వారికి చెప్పాలి. సవరణ కోసం ఏడు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని చూపించాలి. లేకుంటే సమీపంలో కామన్‌సర్వీసు సెంటర్‌(సీఎస్‌సీ)కి వెళ్లి సవరణ చేసుకోవచ్చు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓటరు సహాయక కేంద్రానికి కూడా వెళ్లొచ్చు. ఓటర్స్‌ సర్వీసు పోర్టల్‌ లేదా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా మార్పులకు దరఖాస్తు చేసుకునే వీలుంది. దివ్యాంగ ఓటర్లు హెల్ప్‌లైన్‌ 1950కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయొచ్చు. సవరణకు వచ్చిన అభ్యర్థనలను బూత్‌లెవల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారు

నమోదు ఇలా....

18ఏళ్లు నిండి ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరులేని వారు ఫారం-6ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ ఆన్‌లైన్‌ ద్వారా యాప్‌ లేదా స్వయంగా దరఖాస్తు అందించే అవకాశం ఉంది. ఫ మరణించిన, శాశ్వత వలస కారణాలపై తొలగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఫ ఇందుకు కుటుంబ సభ్యులు లేదా ఇతరులు దరఖాస్తు చేసుకున్న తర్వాత పూర్తి ఆధారాలు పరిశీలించిన తరువాతే తొలగింపు జరుగుతుంది. ఫ ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఓటు బదిలీ కోసం పారం 8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Central Electoral Commission is another opportunity for changes and additions to the voter list"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0