Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC 2019-20 Instructions to teachers on changes in new questionnaires

SSC 2019-20 నూతన ప్రశ్నపత్రములలో మార్పులపై ఉపాధ్యాయులకు సూచనలు

తెలుగు పేపర్ - 1

అవగాహన - ప్రతి స్పందన :  గతంలో 12 మార్కులు ప్రస్తుతం 16 మార్కులు. ఇందులో నూతనంగా 4 మార్కులకు "పరిచితపద్యం" ఇస్తారు.
వ్యక్తీకరణ - సృజనాత్మకత (స్వీయరచన): గతంలో 18 మార్కులు - ప్రస్తుతం 22 మార్కులు. నూతనంగా 3 రెండు మార్కుల ప్రశ్నలు ఇస్తారు.
 భాషాంశాలు: 12 మార్కులకు కొన్ని మార్పులతో భాషాంశ ప్రశ్నలు ఇస్తారు. కనుక ఉపాద్యానయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి. గమనిక: పై మార్పులతో అనగా అవగాహన - ప్రతి స్పందనలో 4 మార్కులకు "పరిచిత పద్యం", వ్యక్తీకరణ – సృజనాత్మకతలో 2 రెండు మార్కుల ప్రశ్నలు, భాషాంశాలు:12 మార్కులకు 14 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది.
SSC 2019-20 Instructions to teachers on changes in new questionnaires

తెలుగు పేపర్ - 2

అవగాహన - ప్రతిస్పందన: గతంలో 12 మార్కులు ప్రస్తుతం 16 మార్కులు. ఇందులొ “అపరిచితగద్యం" 8 మార్కులకు భావం కూడా రాయమని ఇస్తారు.
వ్యక్తీకరణ- సృజనాత్మకత: గతంలో 18 మార్కులు - ప్రస్తుతం 22 మార్కులు. నూతనంగా ప్రత్యక్ష భాగస్వామనికి చెందిన 1 ప్రశ్న, విషయాత్మక ప్రశ్నను 1 ఎవ్వడం జరిగింది.
భాషాంశాలు:12 మార్కులకు కొన్ని మార్పులతో భాషాంశ ప్రశ్నలు ఇస్తారు. కనుక ఉపాద్యానయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి. - గమనిక: పై మార్పులతో అనగా అవగాహన - ప్రతి స్పందనలో 4 మార్కులకు "అపరిచితగద్యం" పై ప్రశ్నలు, వ్యక్తీకరణ - సృజనాత్మకతలో 2 రెండు మార్కుల ప్రశ్నలు, భాషాంశాలు: 12 మార్కులకు 15 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది

 కొంపోసిట్ తెలుగు - 3:

గతంలో కంటే ప్రస్తుత ప్రశ్నాపత్రం సులువైనది. బీట్ పేపర్  ఇప్పుడు 12 మార్కులకు పార్ట్ ఏ నందే ప్రశ్నలుంటాయి. అపరిచిత వ్యవహార రూపం (లేఖ, కరపత్రం, . . ) ప్రస్తుతం లేదు. రామాయణంలో వివిధ కాండల నుండి 5 వాక్యాలు ఇస్తారు. వాటి కాండల పేర్లు రాశి వరుస క్రమంలో రాయాలి. గతంలో ఒక పాత్ర స్వభావం ఇచ్చేవారు ఇప్పుడు 10 పాత్రల స్వభావములనుండి మూడు పాత్రల స్వభావాలు ఇస్తారు. ఉపాధ్యాయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి.
గమనిక: నూతన ప్రశ్నా పత్రం లో వచ్చిన మార్పులతో మాత్రమే 14 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది.

 కంపోజిట్ సంస్కృతం - 4:

 గతంలో 20 మార్కులు ప్రస్తుతం 30 మార్కులకు మార్చినారు.
1. భావాగమనం- ప్రతిస్పందన – అపరిచిత శ్లోకం అదనంగా చేర్చారు (4*1:4). అపరిచిత గద్యంశములో ఒక ప్రశ్న అదనంగా చేర్చారు. అనగా 4 ప్రశ్నలు విచ్చినారు (4*1=4).
2. భావ వ్యక్తీకరణం - సృజనాత్మకత — వ్యాసరూప ప్రశ్నలకు అదనంగా ఒక మార్కు పెంచబడినవి(1*5 = 5). – సృజనాత్మక ప్రశ్నలకు అదనంగా ఒక మార్కు పెంచబడినవి (1* 5 = 5).
3. భాషాంశములు: గతంలో 5 మార్కులు ప్రస్తుతం 8 మార్కులు గా మార్చినారు. ప్రశ్నకు 4 మార్కు బదులు 1 మార్కు గా మార్చారు (8*1 = 8). 8 ప్రశ్నలలో 2 బహులైచ్ఛికాలు 6 ఏక పదరుప సమాధాన ప్రశ్నలు.
-----

 హిందీ విషయుము నందు వచ్చిన మార్పులు

హిందీ ప్రశ్నపత్రము 100 మార్కులుగా నిర్ధారించారు.
పరీక్ష వ్రాయు సమయము 2.45 నిమిషాలు. చదవడానికి గాను 15 నిమిషాలు. మొత్తం సమయం 3 గంటలు.

ప్రశ్నపత్రము ను మొత్తము 4 భాగాలు గా విభజించారు.
భాగాలు వారిగా వివరణ
మొదటి భాగము
ఇందులో ...వ్యాకరణాంశముల ఆధారంగా 1 మార్కు ప్రశ్నలు ఉండును. ( వ్రాయుటకు సమయం 12 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.)
ప్రశ్న 1. तत्सम మరియు तत्भव  పదాలను 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు
ప్రశ్న 4. कारक చిహ్నములను 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు.
ప్రశ్న 5.  समास వదమును గుర్తించుటకు సరైన జోడీ పదాలను రెండు ఇవ్వడం జరుగుతుంది.
ప్రశ్న 8. मुहावरा పదాన్ని గుర్తించి దాని అర్ధాన్ని 3 ఛాయిస్టు గా ఇచ్చి గర్తించమని అడుగుతారు.
 రెండవ భాగము
ఇందులో ...మొత్తము 6 పరిఛ్ఛేదములు(6*4=24) మరియు రెండు ప్రశ్నలు (2*4=8) ఉండును. మొత్తము 32 మార్కులు. ( వ్రాయుటకు సమయం 40 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది.)
*పరిఛ్చేదము 1 (13 వ ప్రశ్న )*
ఇందులో నాలుగు ప్రశ్నలు వ్యాకరణాంశము ఆధారంగానే ఇవ్వబడును. (संज्ञा  सर्वनाम   विशेषण क्रिया   उपसर्ग प्रत्यय    पर्याय विलोम ) పదాలలో ఏవైనా 4 అంశములను ఇచ్చెదరు.)
*పరిఛ్ఛేదము 6 (18 వ ప్రశ్న )*
ఒక విజ్ఞాపమును( అడ్వర్ టైజ్ మెంట్ ) ఇచ్చెదరు. ప్రశ్నలు 19, 20.. ఒక గద్యభాగము నందు మరియు ఒక పద్యభాగమునందు ఇచ్చెదరు.
మూడవ భాగము:  ఇందులో మొత్తము 8 ప్రశ్నలు ఉండును..ఒక్కో ప్రశ్న కు 2 మార్కులు. (82+2=16) పద్యభాగము లో 2 ప్రశ్నలు. గద్యభాగము లో 3 ప్రశ్నలు. మరియు ఉపవాచకము లో 3 ప్రశ్నలు ఇవ్వబడును. ( వ్రాయుటకు సమయం 32 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది. ఒక్కో ప్రశ్నకు 4 నిమిషములు
 నాల్గవ భాగము: ఇందులో మొత్తము 5 ఉపభాగములుండును ..ఒక్కో భాగమునకు కు 8 మార్కులు. (5 ఇ'8=40) ( వ్రాయుటకు సమయం 75 నిమిషముల గా నిర్ధారించుకుంటే మంచిది. ఒక్కో ప్రశ్నకు 15 నిమిషములు ).
अ, आ, ई, उ  :  భాగములకు గాను ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వడం జరిగింది...ఒక్క "బి" భాగమునకు గాను ఛాయిస్ లేదు. హింట్స్ ఇవ్వడం జరుగుతుంది. హింట్స్ ఆధారంగా కథను వ్రాయవలిసి ఉన్నది.

 Third language - English

Changes in SSC Question Paper-1(13E)*
   As we all know certain changes have been made in the question paper pattern for students appearing SSC Public Examinations from March-2020 onwards. The following are the noticeable changes that the students have to be sensitized with.
 Under Part - A There are four comprehension passages (one poem) in reading comprehension section. The passages' length is increased. The first passage is from 'A readings' with 2 'Wh' questions and 3 Multiple Choice Questions. The second comprehension is a stanza from a poem under 'B readings' with 3 MCQs. The third comprehension passage is from 'B readings' with 2MCQs. The fourth comprehension
passage is from 'C Readings' with 2 'Wh' questions and 3MCQS.
In part - B Grammar section 2 marks are allotted to 'Reported speech'. The reported speech question is in the form of an exchange. Marking of omission of articles with 'X' is the new thing to be noticed. 2 marks are allotted for filling the 4 blanks with suitable verb forms.
Under Part -C Creative Expressions 'Framing of Questions for the underlined parts of a passage taken from the 'C Readings' is an important inclusion in the present model.
Teachers should train the students to write all the answers for the Questions under Part - B (Grammar) at one place in their answer sheet.
   
The examinations that are to be held from 14-10-2019 onwards will focus on the changes discussed above and the marks distribution is as given below.(13E).
Reading comprehension - 15 Marks (As explained above)
Grammar - 05 Marks (Only changed model questions)
Creative expression - 05 Marks (Framing 'Wh' Questions)
Total - 25 Marks.

గణిత శాస్త్రం


  • నూతన పరీక్షా విధానంలో భాగంగా, గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా మనం గమనించవలసిన అంశాలు_*:
  • గతంలో పార్ట్-బి కు బదులుగా ప్రస్తుతం సెక్షన్-1 లో 12 అతి లఘు సమాధాన  ప్రశ్నలుంటాయి ప్రతి ప్రశ్నకు అర మార్కు.
  • ఈ ప్రశ్నలకు సమాధానాలను సమాధాన పత్రం లోనే వ్రాయవలెను,
  • బహుళైచ్చ్చిక ప్రశ్నలు ఉండవు.
  • అతి లఘు సమాధాన ప్రశ్నలు అన్ని విద్యా ప్రమాణాలకు సంబంధించి ఉంటాయి.
  • ప్రశ్నలు తాత్కాలిక ఆలోచన మరియు వివేచనకు సంబంధించి ఉంటాయి.
  • ఈ సెక్షన్ లోని ప్రశ్నలకు సాధనను సంక్షిప్తంగా చేయడం లేదా నేరుగా సమాధానాన్ని వ్రాయునట్లుగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలి.


సామాన్య శాస్త్రము


  • 2019 -20 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షా నిర్వహణలో భాగంగా నూతన పరీక్షా విధానంలో భాగంగా భౌతిక రసాయనశాస్త్రం మరియు జీవ శాస్త్రం పేపర్ల నందు ఉపాధ్యాయులుగా మనం గమనించవలసిన అంశాలు_
  •    గతం లోని బిట్ పేపర్ స్థానంలో ప్రస్తుతం ఒక పదం లేదా ఒక వాక్యం రూపం లో వ్రాయబడు అర మార్కు బిట్లు 12 ఇచ్చి 6 మార్కులకు లెక్కిస్తున్నాము. 
  • వీటిలో అన్ని విద్యాప్రమాణాలు పరీక్షిస్తారు. వీటిలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు బహుళైచ్చ్చిక ప్రశ్నలు ఉండవచ్చును.
  •   22 , 23 వ తేదీలలో జరుపబోవు సంసిద్ధతా పరీక్షలలో ప్రత్యేకంగా అర మార్కు ప్రశ్నలపై మాత్రమే అన్ని విద్యా ప్రమాణాలలో 40 ప్రశ్నలు ఉంటాయి.

సాంఘిక శాస్త్రము


  • _గతం లో పార్ట్-బి నందు ప్రత్యేకంగా 20 బహుళైచ్చ్చిక ప్రశ్నలు 30 నిమిషాలలో వ్రాయవలసి ఉండేది.   
  • కానీ ప్రస్తుతం SCERT వారు ఇఛ్చిన మార్గదర్శకాల ప్రకారం మెయిన్ క్వశ్చన్ పేపర్ నందే సెక్షన్ - 1 లో 12 అతి లఘు సమాధాన ప్రశ్నలు ఇవ్వబడతాయి. 
  • ఇవి అన్ని విద్యా ప్రమాణాలకు చెందినవై ఉంటాయి. 
  • వీటికి ప్రత్యేక సమయం కేటాయించలేదు కానీ విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తీసుకుని చివరలో సమయాభావం వల్ల  వ్యాసరూప ప్రశ్నలు వదిలివేసే అవకాశం ఉంది. 
  • కావున విద్యార్థులు ఈ ప్రశ్నలకు అతి లఘు సమాధానాలు తక్కువ సమయంలో ఇచ్చునట్లుగా తర్ఫీదు ఇవ్వాలి. 
  • 24 , 25 వ తేదీలలో జరుపబోవు సంసిద్ధతా పరీక్షలలో ప్రత్యేకంగా అర మార్కు ప్రశ్నలపై మాత్రమే అన్ని విద్యా ప్రమాణాలలో 40 ప్రశ్నలుంటాయి._*



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC 2019-20 Instructions to teachers on changes in new questionnaires"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0