Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tejas, who runs on rails. All facilities in flight.

రైలు లేటయితే పెనాల్టీ చెల్లిస్తారు 

ఆ రైల్లోకి ఎక్కగానే రైలు హోస్టెస్  
 ( కోచ్ క్రూ ) స్వాగతం పలుకుతారు . లగేజీ సర్దిపెడతారు . తినడానికి ఏం అడిగినా సీటు దగ్గరికే తెచ్చిస్తారు . బోరు కొడితే మన సీటు ముందున్న స్క్రీన్లో సినిమాలు చూసుకోవచ్చు . అవును మరి . . . . . ఇది చూడ్డానికే రైలుగానీ విమానంలో ఉండే సకల సౌకర్యాలూ ఇందులో ఉన్నాయి . ఈ మధ్యనే పట్టాలెక్కిన తొలి ప్రైవేట్ బ్రెయిన్ తేజస్ ప్రత్యేకతలు ఒకటా రెండా . . . . 
Tejas, who runs on rails. All facilities in flight.

రైళ్ల లో కేటరింగ్ రిజర్వేషన్ బాధ్యతల్ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనే ప్రయివేటు సంస్థకు అప్పగించిన భారతీయ రైల్వే ఈ మధ్య సొంత రైలును నడుపుకునే అవకాశాన్ని కూడా ఆ సంస్థకి ఇచ్చింది . అలా మనదేశంలో తొలి ప్రైవేట్ రైలుగా గుర్తింపు పొందిన తేజస్ దిల్లీ - అఖనపూ మార్గంలో పరుగులు తీస్తోంది . 

దీని ప్రత్యేకతలు చూద్దామా


  • లఖనపూ నుంచి ఉదయం 6.15 నిమిషాలకు బయలుదేరి దిల్లీ వెళుతుంది .
  •  మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది . 
  • మధ్యలో కాన్పూరు . ఘజియాబాద్ స్టేషన్లలో మాత్రమే తేజస్ ఆగుతుంది .
  • 550 కిలోమీటర్ల దూరాన్ని ఆరుగంటల్లోనే చేరుకుంటుంది ఈ రైలు 
  • టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇంటినుంచి లగేజీ తీసుకెళ్లి ఆప్షన్ను ఎంచుకుంటే . . ప్రయాణ సమయానికి IRCTC సిబ్బంది మన ఇంటి వద్దకే వచ్చి తీసు కెళతారు . 
  • మళ్ళీ మనం వెళ్లే చోటుకు లగేజీ అందజేస్తారు . 
  •  సమయానికి రైలు పట్టాల పైకి రాకున్నా , గమ్యస్థానానికి చేరకపోయినా   IRCTC   పెనలిటీ అందిస్తుంది . 
  • గంట ఆలస్యానికి వంద రూపాయలు , 
  • రెండు గంటలూ , అంతకు మించి అయితే 250 రూపాయలు చెల్లిస్తుంది .  
  • ప్రయాణికులకు ఉచితంగా పాతిక లక్షల ప్రమాద బీమానూ , దొంగతనం జరిగితే లక్ష రూపాయలు రికవరీగానూ వస్తుంది . తేజస్ 
  • ఇది బయట చూడ్డానికి రైలులానే ఉన్నా లోపల మాత్రం ఫ్లైట్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటం దీని ప్రత్యేకత . 
  •  చైర్ కార్ టైపు కోట్లు పన్నెండూ , 750 సీట్లు ఉన్న ఈ రైలు మొత్తా నికీ ఏసీ సౌకర్యం
  • ఉంటుంది .
  •  అలానే ట్రెయిన్ అంతటా ఉచిత వైఫై , భద్రత కోసం సీసీ కెమెరాలూ , జీపీఎస్ స్క్రీన్లూ అమర్చి ఉండి తరవాతి స్టేషన్ పేరును వాటిలో డిస్ ప్లే చేస్తారు . 
  • దీనిలోని ఎగ్జిక్యూటివ్ కోచ్ మిగతావాటి కంటే కాస్త విలాసవంతంగా ఉంటుంది . 
  • సీటుకు ముందు ఫ్లెట్లో మాదిరి స్క్రీన్లు ఉంటాయి . 
  • అలానే చూపులేని వారికోసం బ్రెయిలీ స్క్రీన్ల ఏర్పాటూ ఉంది ఇందులో . 
  •  సీటు పైన రీడింగ్ లైటూ , కోచ్ క్రూ కాలింగ్ బటన్ కూడా అమర్చి ఉంటాయి . 
  • తేజలోని బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు అతి తక్కువ నీటిని ఉపయో గించుకోవడంతోపాటు ఎక్కువ శుభ్రంగా ఉంటాయి .
  •  సెన్సర్లతో పనిచేసే పంపులూ , హ్యాండ్ డ్రయ్యర్లూ , టాయిలెట్ ఆక్యుపెన్సీ లైట్ల ఏర్పాటు కూడా ఉంది . 
  • రైలు ఆగగానే వాటంతట అవే తెరుచుకునే డోర్లు దీని ప్రత్యేకం . 
  • బోగీల మధ్య కూడా సెన్సర్లతో వాటంతటవే తెరుచుకునే అద్దాల తలుపులుంటాయి . తేజస్లోకి ఎక్కాక కోచ్ క్రూ స్వాగతం పలికి లగేజీ సర్ది పెడతారు .
  •  సీటు వద్దకే మంచినీళ్లూ , కాఫీ , టీలూ , భోజనం , స్నాక్స్ , పేపర్లూ , పత్రికలూ అందిస్తారు . 
  •  అరవై రోజుల ముందు నుంచీ ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ , ఆక్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు . 
  • ఇండియన్ రైల్వేస్ మాదిరి తత్కాల్ టికెట్ , ఇతర రాయితీ సౌకర్యాలేమీ దీనికి లేవు . పట్టాలపై పరుగులు తీసే ఈ ఫ్లెట్ ను మనమూ ఎక్కేద్దామా ఒకసారి .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tejas, who runs on rails. All facilities in flight."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0