Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Twinning Program

  • నైపుణ్యాభివృద్ధిరస్తు ! 
  • పాఠశాలల మధ్య భాగస్వామ్యం 
  •  కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రణాళిక 
  • విద్యార్థుల్లో నూతనోత్సాహం నింపడమే లక్ష్యం విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్త కార్యక్రమానికి నాంది
  •  విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం , వారిలోని సృజనాత్మ కతను వెలికి తీసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .
  •  పాఠశాల విద్యలో వివిధ బోధనారీతులను మేళవించి విద్యార్థులకు అందించేలా ఈ నూతన కార్యక్రమం కొనసాగుతుంది . 
Twinning Program

కార్యక్రమం లక్ష్యాలు 


  •  గ్రామీణ , పట్టణ , నగరాల్లోని ప్రైవేట్ , ఎయిడెడ్ , ప్రభుత్వం లోని వివిధ శాఖల పాఠశాలల విద్యార్థులను కామన్ ప్లాట్ ఫామ్ మీద కలపడం .
  •  ఒక స్కూల్ నుంచి మరొక స్కూలకు వెళ్లిన విద్యార్థులు , ఉపాధ్యాయుల మధ్య బెస్ట్ ప్రాక్టీసెస్ బదలాయింపు . 
  • ఆయా పాఠశాలల్లో తమ అనుభ వాలను పంచుకోవడం .
  • ఐకమత్యాన్ని , సోదరభావాన్ని పెంపొందించడం
  • ఉపాధ్యాయులు ఇతర పాఠశాలల్లోని బోధనారీతులను కళింపు చేసుకుని , తమ పాఠశాలల్లో అవలం బించడం.
  • ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాల్లో ప్రాథమికంగా అమలు చేసి సత్పలి తాలు సాధించడం జరిగింది .
  •  ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర భుత్వం అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా అమలు చేసేలా ఆదేశాలు , నిధులు విడుదల చేసింది .


గ్రామీణ , పట్టణ , నగరాల్లోని ఆయా పాఠశాలల్లోని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ , బోధనారీతులపై అవగాహన కల్పిం చడం జరుగుతోంది . అలాగే వివిధ పాఠశాలల్లో నిర్వహించే సామాజిక కార్యక్రమాలు , ఆట పాటలు , పోటీ పరీక్షల విషయాలూ పంచు కోవచ్చు . ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది . పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచితే కళా శాల స్థాయికొచ్చేసరికి వారు అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు . ఈ ఉద్దేశంతో ప్రైవేట్ , ఎయిడెడ్ , ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఏటా నెల రోజుల పాటు వేరే పాఠశాలలకు పంపి అక్కడి పరిస్థితు లు , బోధనా రీతులు , మెళకువ లను పరిశీ లించేలా కొత్త ప్రోగ్రామ్ ను తీసుకొస్తూ ప్రభుత్వం అడుగులు కదుపుతోంది . ఈ కార్యక్రమా న్ని ' ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ' అనే పేరుతో పాఠశాలల మధ్య నైపుణ్యాలు మార్పిడి చేసుకునేలా ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది . ' ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ' అంటే ' పార్టనర్ షిప్ అమాంగ్స్కూల్స్ ' అంటే పాఠశాలల మధ్య సమన్వయం లేదా పాఠశాలల భాగస్వామ్యంగా చెప్పవచ్చు . అక్టోబర్ నెలలో మూడో వారం నుంచి , నవంబర్ నెలలో మూడో వారం వరకు ఇలా నెల రోజుల ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ను అమలు చేస్తోంది . ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో ఈప్రోగ్రామ్ ను అమలు చేసేందుకు కొన్ని పాఠ శాలలను ఎంపిక చేయడం జరిగింది .

ప్రైమరీ , హైస్కూల్ స్థాయిల్లో . . 

విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ' ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ' కోసం ప్రైమరీలో 4 , 5 తరగతులు , హైస్కూల్లో 6 , 7 , 8 తరగతుల విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపను న్నారు . గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు నగరా ల్లోని , పట్టణాల్లోని అదేవిధంగా నగర , పట్టణ పాఠశాలల విద్యార్థులకు గ్రామీణ పాఠశాలల్లోని పరిస్థితులను , అక్కడి బోధనా పద్ధతులను తెలియజేయడం ద్వారా గ్రహణ శక్తిని పెంపొం దించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం . సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్రంలోని ఏయే పాఠశాలలను ఈ ట్విన్నింగ్ కోసం ఎంపిక చేయాలో కసరత్తు పూర్తయింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Twinning Program "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0