Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vajrapath App protects against Thunderbolt

పిడుగు నుంచి రక్షించే వజ్రపాత్
 చరవాణి లో ముందస్తు సమాచారం
 అందుబాటులో ప్రత్యేక యాప్ .
 Vajrapath App protects against   Thunderbolt

వాతావరణంలో అనూహ్య మార్పులతో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం . . పీడుగు - పడటం సర్వసాధారణమైంది . వీటి నియంత్రణకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది . పిడుగుపాటు గుర్తించి 30 నిమిషాలకు ముందు - గానే హెచ్చరిక జారీ చేసేలా సంక్షిప్త సమాచారాలు అందించే ఏర్పాటు చేసింది . ఇందు కోసం వజ్రాత్ యాప్ అందుబాటులోకి వచ్చింది . పీడుగు ముప్పును ముందుగానే గుర్తించి - అప్రమత్తం కావడానికి ఇది దోహదపడుతుంది .

ఇన్స్టాల్ చేయడం ఇలా . .

  • మీ ఫోన్ లో గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి వజ్రపాత్ అని ఆంగ్లంలో టైప్ చేస్తే నీలం రంగులో మేఘం , మెరుపు గుర్తుతో యాప్ కనిపి స్తుంది .
  •  దానిని డౌన్ లోడ్  అందులో లొకేషన్ తదితరాలు తెలు పాలి . 
  • అనంతరం చరవాణి సంఖ్య నమోదు చేస్తే యాప్ ఇన్స్టాల్ అవుతుంది . 
  • తెలుగు , ఆంగ్లం , హిందీ తదితర భాష లలో సమాచారం అందుబాటులో ఉంటుంది .
  • నచ్చిన భాష ఎంచుకోవచ్చు .

వినియోగం ఇలా :


  • వజ్రపాత్ యాప్ లో రెండు అంశాలుంటాయి .
  •  ఒకటి పిడుకు సమాచార చిత్ర పటం , రెండోది పిడుగుపాటు హెచ్చరిక  సమాచారం . 
  • పిడుగు చిత్రంలో మీరున్న ప్రాంతం కేంద్రంగా మూడు వలయాలుంటాయి . 
  • ఎరుపు రుగు చూపితే 8 కి . మీ , నారింజ రంగు అయితే 15 కి . మీ . పసుపు రంగులో కనిపిస్తే 33 కిలోమీటర్ల పరిధిని చూపిస్తాయి .
  •  మీరు ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి ఎంత దూరంలో పిడుగుపడే ప్రమాదం ఉందనే అంశాన్ని ప్రత్యేకంగా చూపు తుంది . 
  • నీలం రంగు చూపితే మీరు సురక్షి తంగా ఉన్నట్టే భావించవచ్చు .

 గూగుల్ చిత్రపటం ఆధారంగాజాగ్రత్తలు ఇవి . . .


  • ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం వస్తే అప్రమత్తం కావాలి .
  • ఇంట్లో ఇనుప కిటికీలు , తలుపు లకు దూరంగా ఉండాలి .
  • ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించరాదు . మెరుపు వచ్చే సమయంలో చేతులు కడగడం , స్నానం చేయడం , దుస్తులు ఉతకడం చేయరాదు .
  •   బహిరంగ ప్రదేశాల్లో ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి .
  •  పొలం పనుల్లో ఉంటే ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలకు దూరంగా ఉండాలి .  
  •  వదులుగా వేలాడే విద్యుత్తు తీగలు , స్తంభాల కింద నిల్చోరాదు . "

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Vajrapath App protects against Thunderbolt"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0