Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ad WhatsApp groups can break you without your permission. And learn how to use that feature

WhatsApp: వాట్సప్ గ్రూప్స్‌ మీకు సమస్యగా మారాయా? ఈ ఫీచర్ ట్రై చేయండి

వాట్సప్ వాడుతున్నవారికి శుభవార్త. వాట్సప్ యూజర్లు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మరో ప్రైవసీ ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ అనుమతి లేకుండా మిమ్మల్ని వాట్సప్ గ్రూప్స్‌లో యాడ్ చేసేవారికి బ్రేక్ వేయొచ్చు. మరి ఆ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి
Ad WhatsApp groups can break you without your permission. And learn how to use that feature

వాట్సప్ గ్రూప్‌ల విషయంలో యూజర్లకు స్వేచ్ఛ, నియంత్రణ కల్పించేందుకు గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్‌ను రూపొందించింది వాట్సప్.

ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలంటే ముందుగా మీ అనుమతి తీసుకోవాల్సిందే.

 గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్'తో వాట్సప్ యూజర్లకు నియంత్రణ లభించినట్టైంది. మీరు వద్దనుకుంటే ఎవరూ మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయలేరు. ఇందుకోసం మీరు సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్‌లో కొత్తగా బ్లాక్ లిస్ట్ ఆప్షన్ రాబోతోంది. అంటే మీకు గ్రూప్ ఇన్విటేషన్ ఎవరు పంపొద్దనుకుంటే వారి నెంబర్ బ్లాక్ చేయొచ్చు.

 గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్' వాడుకోవడానికి ముందుగా మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత మీ వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో Account క్లిక్ చేసి Privacy ఓపెన్ చేయండి. Groups సెక్షన్‌లో మీకు మూడు ఆప్షన్స్ Everyone, My Contacts, Nobody అని కనిపిస్తాయి

మీరు ‘Everyone’ ఎంచుకుంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు. కేవలం ‘My Contacts’ ఎంచుకుంటే మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లు మాత్రమే మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయగలరు. ఒకవేళ మీరు ‘Nobody’ అని సెలెక్ట్ చేసుకుంటే... మీ అనుమతి ఉంటే తప్ప మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయలేరు

మిమ్మల్ని ఏదైనా గ్రూప్‌లో యాడ్ చేయడానికి గ్రూప్ అడ్మిన్ తమ వాట్సప్‌ గ్రూప్‌లో చేరాలంటూ మీకు గ్రూప్ ఇన్విటేషన్ పంపిస్తారు. ఆ ఇన్విటేషన్ 72 గంటలు మాత్రమే యాక్టీవ్‌గా ఉంటుంది. మీరు ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తేనే గ్రూప్ అడ్మిన్ మిమ్మల్ని తన గ్రూప్‌లో యాడ్ చేయడానికి అవకాశముంటుంది

గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్‌ను చాలాకాలం క్రితమే కొందరు యూజర్లకు మాత్రమే రిలీజ్ చేసింది వాట్సప్. ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత ఇప్పుడు యూజర్లందరికీ రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ ఆప్షన్‌ను యాడ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

*🔹ఐఓఎస్ యూజర్లు 2.19.110.20 వర్షన్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లు 2.19.298 వర్షన్ అప్‌డేట్ చేసుకున్నవారు బ్లాక్ లిస్ట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.*
®

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ad WhatsApp groups can break you without your permission. And learn how to use that feature"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0