Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Whose assets are registered without the involvement of scribes


పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం

రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం
మీరే మీ ఆస్తిని రిజిస్ట్రేషన్​ చేసుకునే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచే ప్రయోగత్మకంగా అమల్లోకి తేనుంది.

Whose assets are registered without the involvement of scribes

లేఖర్ల ప్రమేయం లేకుండానే ఎవరి ఆస్తులు వారే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురానుంది. పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖ నగరాల్లో తొలుత అమలు చేయనున్నారు.

వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.... వాటి ఆధారంగా అంశాల వారీగా దానంతట అదే నాలుగు పేజీల దస్తావేజు తయారవుతుంది. ఇరు పక్షాలవారు దీనికి అంగీకరించిన అనంతరం సబ్‌రిజిస్ట్రార్‌ విలువను అనుసరించి పన్ను వేసి ఆమోదిస్తారు.

ఈ నూతన విధానం తొలుత విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎక్కడ్నుంచైనా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవచ్చు. తదుపరి జారీ అయ్యే రశీదు ద్వారా డాక్యుమెంట్లను తీసుకునే అవకాశాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ కల్పించింది.

ఆన్‌లైన్​లో వివరాలు నమోదు చేయగానే వచ్చే రశీదు, ప్రింట్లతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే డిజిటల్ సంతకంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. గంట వ్యవధిలోనే దస్తావేజులు సైతం జారీ చేసే విధంగా ఈ విధానాన్ని రూపొందించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Whose assets are registered without the involvement of scribes"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0