Ananda Vedika in schools Decision to Armored Implementation
- పాఠశాలల్లో ఆనంద వేదిక
- పకడ్బందీగా అమలుకు నిర్ణయం
- ప్రతి పాఠశాల ఉపాధ్యాయునికి శిక్షణ
- 14 నుంచి 25 వరకు నాలుగు విడతల్లో శిక్షణ
- ఎస్సీఈఆర్టీ నిష్ణాతులచేత శిక్షణ
- జిల్లా నుంచి శిక్షణకు వెళ్లనున్న ఉపాధ్యాయ బృందాలు
పాఠశాలకు చదువుకునేందుకు వచ్చిన విద్యారులను మొదటి అరగంట సేపు ఆనందం గా గడిపేలా పాఠశాల విద్యాశాఖ ఆనంద వేదిక రూపంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇళ్ల నుంచి పాఠశాలకు వచ్చిన తరు ణంలో ఇంటి వద్ద ఉన్న పరిస్థితుల కారణంగా ఏకాగ్రతతో పాఠాలు వినకపోవడాన్ని గుర్తించిన పాఠశాల విద్యాశాఖ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఆనంద వేదిక రూపంలో వినూత్నంగా కార్యక్రమాలను అమలు చేయా లని నిర్ణయించింది . అయితే ఇందుకు ఉపాధ్యా యులను కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని భావించింది . అందులో భాగంగా ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు . స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( ఎన్‌సీఈఆ టీ ) ఆధ్వర్యంలో నిష్ణాతులచే శిక్షణ ఇవ్వనుంది . ఈనెల 14 నుండి 25వ తేదీ వరకు నాలుగు విడత ల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వారు పాఠ్యాంశాలు బోధించే పాఠశాలల్లో ఆనంద వేదికను ఆనందంగా నిర్వహించేందుకుగాను ప్రణాళికలు రూపొందించింది .
మూడు కేటగిరీల్లో శిక్షణ :
ప్రాథమిక , ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలకు సంబంధించి మూడు కేటగిరీల్లో ఉపాధ్యాయు లకు శిక్షణ ఇవ్వనున్నారు . ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు , ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు , నాలుగురు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల నుంచి ముగ్గురు ఉపాద్యాయు లు ఆనందవేదిక శిక్షణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి . ఉన్నత పాఠశాలలకు సంబంధించి అక్కడి ఉపాధ్యాయుల సంఖ్యను ఆధారం చేసుకొని పదిమందికి తగ్గకుండా ఉపా ధ్యాయులు శిక్షణకు హాజరు కావాలి . ఉన్నత పాఠ శాలల నుంచి శిక్షణకు వెళ్లే ఉపాధ్యాయ బృందానికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు నేతృత్వం వహించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు . ప్రాథమిక పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు ఎల్ - 1 , ఎల్ - 2 మాడ్యు లకు సంబంధించిన పుస్తకాలు , ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఎల్ - 3 మాడ్యులకు సంబంధించిన పుస్తకాలు , ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఎల్ - 3 , ఎల్ - 4 మాడ్యులకు సంబంధించిన పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు .
స్వాగతిస్తున్న ఉపాధ్యాయులు :
ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశా లల్లో ఆనంద వేదిక నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు . ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఆనంద వేదిక అమలు చేస్తున్నా ఇప్పటి వరకు అందుకు సంబంధిత మాడ్యుల్స్ లేకపో వడం , ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వకపో వడంతో నామమాత్రంగా నిర్వహిస్తూ వచ్చారు . ఈసారి మాత్రం ఆనంద వేదికకు సంబంధించి పకడ్బందీగా శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన మాడ్యులకు కూడా సిద్ధంగా ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఉపా ధ్యాయులు అంటున్నారు . .
అరగంటపాటు ఆనంద వేదిక .
ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశా లల్లో తరగుతులు ప్రారంభానికి ముందు అరగం టసేపు ఆనంద వేదిక నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది . ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి 9 . 30 గంటల వరకు , ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9 . 45 గంటల నుంచి 10 . 15 గంటల వరకు ఆనంద వేదిక నిర్వహించాల్సి ఉంది . ఏ ఉపాధ్యాయుడు అయితే ఆనందవేదిక నిర్వహిస్తా డో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయుడు ఫస్ట్ అవర్ పాఠ్యాంశాలను బోధించాలి . ఆనంద వేదికలో భాగంగా మొదటి ఐదు నిముషాలు విద్యార్థులతో ధ్యానం చేయిస్తారు . ఆ తర్వాత ఇరవై నిముషాలు విద్యార్థులకు కథలు , నీతి కథ లు , మంచి పుస్తకాలు , వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థుల గురించి వివరించి వారిని మానసికంగా , శారీరకంగా పాఠాలు వినేం దుకు సిద్ధం చేయాలి . చివరి ఐదు నిముషాలు మరోమారు ధ్యానం చేయించిన తరువాత విద్యా ర్థులు నేరుగా తరగతులకు వెళ్లాల్సి ఉంటుంది .
0 Response to "Ananda Vedika in schools Decision to Armored Implementation"
Post a Comment