Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Five types of benefits with LIC policy.

యల్.ఐ.సి పాలసీ తో ఐదు రకాల ప్రయోజనాలు.

దేశంలో బీమా అంటే మొట్టమొదట అందరికీ గుర్తు వచ్చేది LIC నే . అంతేకాదు దేశంలోనే అతి పెద్ద బీమా రంగ కంపెనీ కూడా ఇదేనని అందరికీ తెలుసు . బీమా పాలసీలు తీసుకునే వారిలో అత్యధికులు దీనికే మొగ్గు చూపుతుంటారు . మరి ఇందులో పాలసీ తీసుకునే వారిలో అత్యధికులకు మాత్రం వాటి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియవనే చెప్పాలి . ఎల్‌ఐసీ పాలసీ తీసుకునేవారికి ఆదాయపు పన్ను నుంచి ఐదు రకాల ప్రయోజనాలు కలుగుతాయని తెలుసుకోవాలి . . అవేంటో తెలుసుకుందాం .
Five types of benefits with LIC policy.

  • సాధారణంగా వివిధ రకాల పాలసీలను లబ్దిదారులకు అందిస్తోంది . పెన్షన్ , టర్మ్ , హెల్త్ , ఎండోమెంట్ , మనీ బ్యాక్ వంటి పలు పాలసీలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు . అయితే ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు .
  • కానీ ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు . అదేలానో . . . . చూద్దాం . . . 
  • ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 80 సీ కింద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు . 
  • పిల్లలు , భార్య , పన్ను చెల్లింపుదారుడి పేరుపై తీసుకున్న పాలసీకి ఇది వర్తిస్తుంది . అదే అవిభాజ్య కుటుంబం లో ఎవరి పేరుమీదైనా పాలసీ తీసుకుంటే ప్రీమియం మొత్తంలో 20 శాతం పన్ను మినహాయింపుకు అవకాశముంది . 
  • పాలసీ తీసుకున్న సంవత్సరం ఆధారంగా మినహాయింపు మొత్తం మారుతుంది . జీవన్ నిధి ప్లాన్ , జీవన్ సురక్ష ప్లాన్ వంటి పెన్షన్ అందించే యాన్యుటీ ప్లాన్లపై పన్ను ఆదాయం నుంచి డిపాజిట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు . 
  •  పన్ను చెల్లింపుదారులు తన పేరుపై లేదా పిల్లలు , భార్యపేరుపై హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దీనిపై కూడా సెక్షన్ 80 డీ కింద రూ . 25 , 000 మినహాయింపు పొందే అవకాశముంది . 
  • అదే సీనియర్ సిటిజన్ పేరు పైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే . . అప్పుడు ఈ రూ . 25 , 000 మినహాయింపు రూ . 30,000వరకూ పెరుగుతుంది . 
  • తల్లిడండ్రులకూ పాలసీ తీసుకుంటే అదనంగా రూ . 25 , 000 వరకూ మినహాయింపు పొందొచ్చు .
  •  ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (10వ ) ( 3 ) ప్రకారం . . జీవన్ సురక్ష , జీవన్ నిధి యాన్యుటీ ప్లాన్స్ నుంచి పొందిన పెన్షన్ మొత్తం పై పన్ను మినహాయింపు ఉంది .
  •  సెక్షన్ 80డీ కింద జీవన్ ఆధార్ ప్లాన్ , జీవన్ విశ్వాస్ ప్లాన్ కలిగిన వారికీ పన్ను ప్రయోజనం ఉంది . మనపై ఆధారపడిన వికలాంగుల కోసం ఈ ప్లాన్స్ తీసుకోవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Five types of benefits with LIC policy."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0