Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Training of Secretariat employees in two further Steps.

సచివాలయ ఉద్యోగులకు మరో రెండు విడతల్లో శిక్షణ.

ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది మే 9 వరకు విడతల వారీగా . . 

 గ్రామ సచివాలయ ఉద్యోగులకు వారు నిర్వహించాల్సిన విధులపై ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 9వ తేదీల మధ్య మరో రెండు విడతలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది . ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది . కొత్తగా నియమితులైన ఉద్యోగులకు వారు విధులలో చేరక మునుపే గత నెల 30 , ఈ నెల 2వ తేదీ మధ్య 2 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఇచ్చారు .
Training of Secretariat employees in two further Steps.

షెడ్యూల్ ఇలా . . 

  •  ఉద్యోగులందరికీ ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ మధ్య ఒక్కొక్కరికీ ఆరు రోజుల చొప్పున విడతల వారీగా శిక్షణ ఉంటుంది . 
  • జిల్లాలో మొత్తం ఉద్యోగులను ఐదు బ్యాచ్ లుగా వర్గీకరించి అక్టోబరు 14 - 19 తేదీల మధ్య ఒక బ్యా చ్ కి , 21 - 26 తేదీల మధ్య రెండో బ్యాచ్ కి , అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు మూడో బ్యాచ్ కి , నవం బరు 4 - 9 తేదీల మధ్య నాలుగో బ్యాచ్ కి , నవంబరు 11 - 16 మధ్య ఐదో బ్యా చ్ కి శిక్షణ ఇస్తారు . 
  •  మలి విడతలో ఆయా ఉద్యోగ విధుల ఆధారంగా ఆయా శాఖల ద్వారా వేరుగా - శిక్షణ కార్యక్రమాలను రూపొందించారు . 
  • పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ - 5 ఉద్యోగు లకు నవంబరు 18న నుంచి వచ్చే ఏడాది మే 9న మధ్య ప్రతి ఒక్కరికీ రెండు వారాల చొప్పున విడతల వారీగా జిల్లాలో శిక్షణ ఇస్తారు . 
  • డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులకు నవంబరు 18వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 28 తేదీల మధ్య ఒక్కొక్కరికీ రెండు వారాల చొప్పన విడతల వారీగా శిక్షణ ఉంటుంది .
  • మిగిలిన ఉద్యోగులకు నవంబరు 18న నుంచి అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించి సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ ఆయా శాఖాధిపతులను కోరింది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Training of Secretariat employees in two further Steps."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0