Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Within the Secretariat, the government has revised the scope of VROs

ఇక సచివాలయంలోనే..వీఆర్‌ఎస్‌ల (VRO)పరిధిని సవరించిన ప్రభుత్వం
పంచాయతీ కార్యదర్శులతో పాటూ విధులు
సందిగ్ధంలో రెవెన్యూ అధికారులు
Within the Secretariat, the government has revised the scope of VROs

గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో)గా కొనసాగుతున్న వారిని ప్రభుత్వం ఇటీవల గ్రామ రెవెన్యూ కార్యదర్శి(వీఆర్‌ఎస్‌)గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. వీరి పరిధిని కూడా తాజాగా సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకూ పంచాయతీల్లో పనిచేసినప్పటికీ తహసీల్దార్‌ల పర్యవేక్షణలో విధులు నిర్వహించేవారు. ఇక నుంచి గ్రామ పంచాయతీ పాలకవర్గం అజమాయిషీలో పనిచేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శుల మాదిరిగా గ్రామ సచివాలయ పరిధిలో విధులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ పాలకవర్గం అధ్వర్యంలోనే పనిచేస్తుండగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో) కార్యకలాపాలు మాత్రం పంచాయతీ పాలకవర్గంతో సంబంధం లేకుండా తహసీల్దార్‌ పర్యవేక్షణలో సాగేవి. గ్రామ రెవెన్యూ పనుల విషయంలో సర్పంచితో సంబంధం ఉన్నప్పటికీ అధికారికంగా ఎటువంటి అజమాయిషీ ఉండేది కాదు.*

ఇపుడు పేరు మార్పు చేయటమే కాకుండా పనిచేయాల్సిన విధానాన్నీ మార్పు చేశారు. దీంతో వీఆర్‌ఎస్‌లు గ్రామ సచివాలయ పాలకవర్గ ఆధ్వర్యంలోనే పంచాయతీ కార్యదర్శుల మాదిరిగా రెవెన్యూకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మండల స్థాయికి వచ్చేటప్పటికే తహసీల్దార్‌ పర్యవేక్షణలో పనిచేస్తారు. గ్రామ సచివాలయానికి వచ్చేటప్పటికి ఆధికారులంతా ఒకే గొడుగు కిందకు వస్తారు. కానీ శాఖలపరంగా చూస్తే మండల స్థాయి అధికారుల పరిధిలో ఉంటారు. ఉదాహరణకు మహిళా పోలీస్‌ను తీసుకుంటే పనిచేయటం గ్రామ సర్పంచి(ప్రస్తుతం ప్రత్యేక అధికారి) ఆధ్వర్యంలో కార్యదర్శి కన్వీనర్‌గా విధులు నిర్వహిస్తారు. గ్రామంలో శాంతి భద్రతల అంశాలను మండల స్థాయిలోని ఎస్‌ఐకి సమాచారం అందిస్తుంటారు. ఇలా సచివాలయ పరిధికి వచ్చేటప్పటికీ శాఖలన్నీ సంయుక్తంగా ఒకే గొడుగు కింద పనిచేస్తాయి.*

వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ సిబ్బంది గ్రామ స్థాయిలోని సమాచారాన్ని మండల వ్యవసాయ అధికారులకు, ఉద్యాన శాఖ అధికారులకు నివేదిస్తుండాలి. ఇదిలా ఉండగా ఆర్‌ఐ, తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ఇప్పటివరకూ పనిచేసిన వీఆర్‌వోలు ఇపుడు నేరుగా సచివాలయ పాలకవర్గం ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు అనేకం ఉంటున్నాయి. తమ కంట్రోల్‌ లేకుంటే వీర్‌ఆర్‌ఎస్‌లు మాట వినరన్న భావన తహసీల్దార్లలో కలుగుతోంది. అయితే గ్రామ స్థాయిలో పరిపాలన ఒకే గొడుగు కిందకు వస్తున్నందుకు స్థానికంగానే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తంచేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Within the Secretariat, the government has revised the scope of VROs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0