Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

4000 jobs in South Central Railway .. Eligible ITI

దక్షిణమధ్య రైల్వేలో 4 వేల ఉద్యోగాలు.. అర్హత ఐటీఐ
దక్షిణమధ్య రైల్వేలో 4 వేల ఉద్యోగాలు.. అర్హత ఐటీఐ4000 jobs in South Central Railway .. Eligible ITI

సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 4103 ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ.

మొత్తం 4103 ఖాళీల్లో
ఫిట్టర్- 1460,
ఎలక్ట్రీషియన్- 871,
డీజిల్ మెకానిక్- 640,
 వెల్డర్-597,
ఏసీ మెకానిక్- 249,
ఎలక్ట్రానిక్ మెకానిక్- 102,
మెకానిస్ట్- 74,
పెయింటర్- 40,
ఎంఎండబ్ల్యూ- 34,
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18,
కార్పెంటర్- 16, ఎంఎంటీఎం- 12 పోస్టులున్నాయి.

 పోస్టులకు 2019 నవంబర్ 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది.
 2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.100.

అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. లాలాగూడ, మెట్టుగూడ, కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లో ఈ యూనిట్లు ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "4000 jobs in South Central Railway .. Eligible ITI"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0