Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI's new offer .. Account with no minimum balance required


ఎస్‌బీఐ కొత్త ఆఫర్.. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా అకౌంట్‌..
SBI's new offer .. Account with no minimum balance required


దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ పెహ్లా కదమ్, పెహ్లీ ఉడాన్ అనే రెండు కొత్త అకౌంట్లను అమలుచేస్తుంది. ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఈ ఖాతాను తెరవొచ్చు. అయితే ఈ అకౌంట్లను కేవలం చిన్న పిల్లల కోసమే కేటాయించింది. ఈ అకౌంట్ తీసుకున్న వారు అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా అన్ని ఖాతాలకు ఉన్నట్టుగా ఈ ఖాతాకు కూడా చెక్ బుక్ సౌకర్యం, ఏటీఎం సౌకర్యం ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ఖాతా ద్వారా పొందవచ్చు.

అంతేకాక ఈ అంకౌంట్ ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఒక్కో ఖాతాలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ ను కలిగి ఉండొచ్చు.
ఈ ఖాతాలో కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది ఎస్ బీఐ. దీని ద్వారా పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఖాతాపై చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇప్పుడు ఎస్ బీఐ కల్పించింది. ఈ ఏటీఎం కార్డు ద్వారా రోజుకు రూ.5,000 వరకు క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇక పోతే బిల్ పేమెంట్స్, టాప్ అప్స్ వంటి ఫెసిలిటీలు కూడా ఈ ఖాతాదారులకు ఉన్నాయి, వీటి ట్రాన్సాక్షన్ పరిమితి మాత్రం రూ.2,000 మించకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI's new offer .. Account with no minimum balance required"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0