Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prime minister Jan Dhan Yojana

మీకు "జన్ ధన్‌" అకౌంట్ ఉందా..? దాని లాభాలు తెలుసా..? లేదంటే ఇలా తీసుకోండి
Prime minister Jan Dhan Yojana

జన్ ధన్ యోజన.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు గ్రామీణ ప్రాంతానికి కూడా అతి తక్కువ సమయంలో చేరువయ్యాయి. అంతేకాక ఈ పథకం ద్వారా.. ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకు అకౌంట్లు తెరవడంతో.. ఈ పథకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించుకుంది. అయితే అసలు ఈ జన్ ధన్ యోజన్ కింద బ్యాంక్ ఖాతాలను తెరవడం ఎలా.. దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి.

జన్ ధన్ ఖాతా తెరవడం ఎలా..

జన్ ధన్ అకౌంట్ అనేది జీరో అకౌంట్. దీనిని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. అంతేకాదు.. పలు కార్పొరేషన్ బ్యాంకులతో పాటు.. పోస్టాఫీస్‌లో కూడా ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు. ఈ ఖాతా తెరవడానికి మీకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, నివాస పత్రం, రెండు ఫోటోలు ఉంటే చాలు. ఇక ఈ అకౌంట్‌ ప్రారంభించేందుకు ఎవరి ష్యూరిటీ అవసరం లేదు.

బ్యాంకుల్లో కాకుండా కూడా ఇలా తీసుకోవచ్చు..

ఇక సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు దాదాపు రద్దీగా ఉంటాయి. దీంతో ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఈ అకౌంట్‌ను మరో విధంగా కూడా ఓపెన్ చెయ్యవచ్చు. ప్రతి గ్రామంలో బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బ్యాంకు మిత్ర ఏజెంట్లను కూడా ప్రభుత్వం నియమించింది. వీరి ద్వారా కూడా ఈ జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేసే సౌలభ్యం ఉంది. అంతేకాదు.. వీరి వద్ద నుంచి కూడా బ్యాంకు లావాదేవీలు కొనసాగించవచ్చు.

జన్ ధన్ అకౌంట్ లాభాలు..


  • ఇక ఈ జన్ ధన్ అకౌంట్ ప్రారంభించడానికి ఎలాంటి రుసుము అక్కర్లేదు
  • జీరో బ్యాలెన్స్‌తో మీ అకౌంట్ తెరవబడుతుంది
  • ఈ జన్‌ ధన్ ఖాతాకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయదు
  • జన్ ధన్‌ ఖాతా ద్వారా ఏటీఎం కార్డుగా 'రూపే' కార్డు జారీ అవుతుంది
  • ఈ రూపే కార్డుకు ఎలాంటి రుసుము ఉండదు
  • రూపే కార్డుకు రూ.1లక్ష ప్రమాద బీమా కూడా ఉంటుంది.
  • ఈ ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వ పథకాలు.. నగదు బదిలీ వంటివి డైరక్టుగా జమ చేయడానికి వీలుంటుంది.
  • ఇక మీరు నియమితంగా దీనిని ఉపయోగిస్తే.. బ్యాంకు మీకు ఓవర్ డ్రాఫ్ట్ (రూ.5000) సౌకర్యం కూడా కల్పిస్తుంది.
  • అత్యవసర పరిస్థితుల్లో ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ సౌకర్యాన్ని ఆరు నెలల పాటు బ్యాంకు ఖాతాలో లావాదేవీలు నిర్వహించిన తర్వాతే అందిస్తున్నారు.
  • ఇక ఈ అకౌంట్లను మైనర్లకు కూడా ప్రారంభించవచ్చు. అయితే ఇందుకు వారి తరఫున వారి సంరక్షకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 
  • సో.. పై లాభాలన్నీ మీకు కూడా కావాలంటే.. వెంటనే మీరు జన్ ధన్ ఖాత తెరవండి. అందుకోసం సమీప బ్యాంకును కానీ.. పోస్టాఫీసును కానీ సంప్రదించండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prime minister Jan Dhan Yojana"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0