Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A total of 130 teachers from 10 districts are selected from each of the 13 districts of the state.

ఒక్కో జిల్లా నుండి 10 మంది ఉపాధ్యాయుల ఎంపిక డిసెంబర్ 2 నుండి ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ 
 జనవరి నుండి మార్చిలోగా జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ  పాఠశాలలో ఇంగ్లీషు విద్యా బోధన కోసం ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటినుండే పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించింది . వచ్చే విద్యా సంవత్సరం నాటికి 1 నుండి 6 తరగతుల వరకు ఆంగ్ల మాధ్య మంలో విద్యా బోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మీదట , విద్యా శాఖ ఆ దిశగా పనులను వేగిర పరుస్తోంది . ఇందు కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలలనుండి ఒక్కో జిల్లాకు 10 మంది చొప్పున ఉపాధ్యాయులను మొత్తం 130 మందిని ఎంపికచేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు . ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు డిసెంబర్ 2నుండి శిక్షణ ఇప్పించనున్నారు . వీరు ఈ శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం జిల్లాలకు వెళ్లి మండలాల వారీగా అక్కడ ఉపాధ్యా యులకు శిక్షణ ఇవ్వనున్నారు . ప్రతి నాలుగు మండలాలకు ఒక రిసోర్సు పర్సను నియమించి ఈ శిక్షణను పూర్తి చేయనున్నారు . ఈ తంతును డిసెంబర్ 31లోగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు . మండల స్థాయి శిక్షణను జనవరి నెలలో ప్రారంభించి మార్చి నాటికి ముగించాలని నిర్ణయించారు . అటుతరువాత వేసవి సెలవుల్లో సైతం ఉపాధ్యాయులకు వివిధ పాఠ్యాంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . ముఖ్యంగా విద్యాఖ వచ్చే విద్యా సంవత్సరం ప్రారం భంలోనే ఇంగ్లీషు మీడియంలోని పాఠ్య పుస్తకాలను అందించేందుకు కసరత్తు ప్రారంభించింది . ఇందుకోసం వెట్రి సెల్విని ప్రత్యేక అధికారిని కూడా నియమించారు . ఆయన ఇప్పటికే విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు , సలహాలను అందచేయడంతోపాటు నిర్దేశిత కార్యాచరణను కూడా వారికి అప్పగించారు . అన్ని పాఠ్యాంశాలు ఇంగ్లీషులో బోధించేందుకు అనుగుణంగా ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేశారు . ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 - 20 విద్యాసంవత్సర లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 62 , 559 పాఠశాలలు ఉన్నాయి . వీటిల్లో 70 , 90 , 217 మంది విద్యార్థులు ఉన్నారు . అయితే , 13 , 877 ప్ర భుత్వ , ఎయిడెడ్ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న విద్యార్థులు 14 , 52 , 979 మంది ఉన్నారు . అలాగే 14 , 516 ప్రైవేటు పాఠశాలల్లో 29 , 68 , 550 మంది విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో విద్యనభ్యసిస్తున్నారు . రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62 . 86 శాతం మేర ఇంగ్లీషు విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో విద్యనభ్యసిస్తున్నారు . ఇందులో 35 . 74 శాతం మేర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తుండగా , 98 . 15 శాతం మేర ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను అభ్యసిస్తున్నారు .

గిరిజన , ఉర్దూ పాఠశాలల్లో ఆంగ్ల బోధనపై మీమాంస


 ఇంగ్లీషు బోధన అంశం గిరిజన ప్రాంత పాఠశాలలపై ఎక్కువ ప్రభావన్ని చూపే విధంగా ఉందని ప్రాథమికంగా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు . అయితే , ఇక్కడ ఆ సమస్యను అధిగమిం చేందుకు ఏం చేయాలనే అంశంపై నిపుణులతో చర్చిస్తున్నారు , ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల్లో విద్యార్థుల చేరికతక్కువగా ఉంటోంది . పాఠశాలల్లో చేరే విద్యార్థుల శాతం కేవలం 6 . 89 మాత్రమే ఉంది . ఇందులో కూడా ఇంగ్లీషు మీడియంలో చేరేవారి శాతం 3 . 67 శాతంగా ఉంది . ఈ పాఠశాలల్లో దాదాపుగా 18 , 975 మంది విద్యార్ధులకు గిరిజన భాషల్లో విద్యా బోధన చేస్తున్నారు . శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల్లో సవర భాష లోనూ , తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొండ , కోవి , ఆదివాసి , ఒడిషా భాషల్లోనూ , గుంటూరు జిల్లాలో సుగాలి , లంబాడ భాషల్లోనూ విద్యా బోధన చేస్తున్నారు . అంతేకాకుండా ఈ భాషల్లో విద్యార్దును మరింతగా ఆకర్షింపచేసేందుకు సర్వశిక్షాభియాన్ కింద రూ . 80 లక్షలు కేటాయింది . ఒక్కో భాషకు సుమారుగా రూ . 13 . 33 లక్షల మేర వివిధ రకాల పుస్తకాల ప్రచురణ కోసం వెచ్చిస్తున్నారు . నిఘంటువులు , కథల పుస్తకాలు , బొమ్మల పుస్తకాల వంటివాటిని తయారుచేస్తున్నారు . ఈ ప్రయత్నంతో ఆయా పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది . అయితే , ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మాధ్యమాన్ని తప్పనిసరిచేస్తే ఈ సంఖ్య ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అంశమేనని అధికారులు చెబు తున్నారు . ఈ పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గకుండా వారికి ఆంగ్ల మాధ్యమం వైపు మరల్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటు న్నారు . అలాగే ముస్లిం విద్యార్ధులపై కూడా ఈ ఇంగ్లీషు మీడియం ప్ర భావం ఏమేరకు పడుతుందన్నదానిపై కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు . ఇప్పటికే రాష్ట్రంలోని 200 ఉర్దూ పాఠశా ల్లలో 20 వేల మంది ఉర్దూ భాషలో విద్యనభ్యసిస్తున్నారు . . రాష్ట్రంలోని మండల , జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలల్లో డిగ్రీ తెలుగు మాధ్యమంలో పూర్తిచేసి తెలుగు మాధ్యమంలో సక్సెస్ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A total of 130 teachers from 10 districts are selected from each of the 13 districts of the state."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0