Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ananda Vedika Daily programmes 22.11.2019 Friday.

Ananda Vedika Daily programmes 22.11.2019 Friday.

Ananda Vedika Daily programmes 20.11.2019 Wednesday.Ananda Vedika Daily programmes 21.11.2019 Thursday


1st Level (1st,2nd Classes)

 లెవెల్1
తరగతి గది నిర్వహణా కార్యక్రమం
కృత్యం - కోతి బావ
లైవెల్:1 (1,2 తరగతులు )
తేది: 22.11.2019, శుక్రవారం
.సమయం: 30 నిముషాలు, 9.15 నుండి 9.45 వరకు
18-వారం
ఆనందవేదిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న
ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికీ అభినందనలు
మైండ్ ఫుల్ నెస్ కార్యక్రమం
సమయం: 5 నిముషాలు
ముందుగా విద్యార్థులను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోమనాలి సాధారణ శ్వాసలు తీసుకోవాలి.సాధారణ శ్వాసలు కొనసాగించాలి
అ శ్వాస పై ధ్యాసను ఉంచాలి. (ఒక నిము పాటు)
ఇప్పుడు దీర్ఘశ్వాసను తీసుకోవాలి దీర్ఘశ్వాసలు కొనసాగించాలి. (2 నిముషాల పాటు)
తిరిగి సాధారణ శ్వాసను రావాలి
సాధారణ శ్వాసను కొనసాగించాలి (ఒక నిముషం పాటు)
పరిసరాలను గమనిస్తూ మెల్లమెల్లగా వెనుకకు రావాలి
మెల్లగా కళ్ళు తెరవాలి
ముఖ్య గమనిక: పరీక్షల నేపథ్యంలో గురువారం, శుక్రవారం రెండురోజుల
కృత్యాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం
కృత్యం: కోతి బావ
ఉద్దేశ్యం లక్ష్యాలు
ఏకాగ్రత కల్గి ఉండటం నేర్పించుట
సహనం యొక్క ప్రాధాన్యత గుర్తింపజేయుట
కృత్యనిర్వహణా సోపానాలు
తరగతి గదిలో వున్న వసతిని బట్టి 10 లేక 15 మందిని ఒక జట్టుగా ఏర్పరచి
గుండ్రంగా కూర్చోమని చెప్పాలి
ఆనందవేదిక తరగతి గది నిర్వహణా కార్యక్రమాన్ని ఎన్నో
వాట్సాప్ గ్రూపులలో అందరికీ స్వచ్ఛందంగా ఫార్ార్డ్ చేస్తున్న
ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు
అ గుండ్రంగా కూర్చుని వున్న విద్యార్థులు కళ్ళు మూసుకొని రెండు చేతులూ
కోతి మాదిరిగా ముందుకు పెట్టమని చెప్పాలి
అ గుండ్రంగా కూర్చుని వున్న బృందం మధ్యలోనికి వేరొక విద్యార్థిని పంపించాలి
ఆ విద్యార్థి తన మాటలతో నవ్వులతో కోతులుగా కూర్చున్న విద్యార్థులను
కవ్వించి వారు కళ్ళు తెరచే విధంగా చేస్తాడు
ఇలా కవ్వించినప్పుడు కళ్ళు తెరచే విద్యార్థిని బృందం నుండి ఇతరులకు
ఇబ్బంది లేకుండా బయటకు తీసుకు రావాలి
చివరకు ఎవరైతే సహనంతో కళ్ళు తెరకుండా ఉంటారో వారిని చప్పట్లతో
అందరూ అభినందించాలి
ప్రతిస్పందనలు
అ ఈ కృత్యం మీకు ఎలా అన్ఫించింది
అ 'విద్యార్థులను కవ్విస్తూ వారిని ఔట్ చేసేందుకు ప్రయత్నించినపుడు నీకు
ఎలా అన్పించింది' అని కవ్వించిన విద్యార్థిని అడగాలి
కళ్ళు మూసుకొని కృత్యం చేస్తున్నపుడు మీకు ఎలా అన్పించింది
మీరు కళ్ళు ఎందుకు తెరచి ఔట్ అయ్యారు
కళ్ళు తెరచి ఔట్ అయినపుడు మీ భావాలు ఎలా ఉన్నాయి
చివరి వరకూ ఔట్ కాకుండా ఎలా ఉండగలిగావు? చివరి వరకూ నిలిచిన
విద్యార్థిని ప్రశ్నించాలి
అసహనంతో మనల్ని మనం నియంత్రించుకోవడం అవసరమా
అమనల్ని మనం నియంత్రించుకోక పోతే ఏమవుతుంది
ముగింపు (Check out)
చివరి రెండు, నిముషాల పాటు మౌనప్రక్రియ నిర్వహించాలి. ఈసమయంలో ఎటువంటి సూచనలూ చేయనవసరం లేదు
సూచనలు
విద్యార్థులతో మమేకమై కృత్యాన్ని నిర్వహించాలి
విద్యార్థులను గేలిచేయడం, వెటకారంగామాట్లాడటం
ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు.ఆనందవేదిక పిరియడ్లో హాజరు, మధ్యాహ్న భోజన వివరాలు
తీసుకోకూడదు

2nd Level (3,4,5Classes)


3rd Level (6,7,8 Classes)


4th Level (9,10 Classes)

















SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ananda Vedika Daily programmes 22.11.2019 Friday."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0