Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Fee reimbursement plus accommodation for students and meals of Rs.20,000




  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇది అదనం: సీఎం
  • 25 లోక్‌సభ స్థానాల్లో 25 హెచ్‌ఆర్‌డీ కేంద్రాలు
  • వీటిని అనుసంధానిస్తూ ప్రత్యేక యూనివర్సిటీ
  • ప్రతి పేద కుటుంబం నుంచి ఇంజనీరు/డాక్టర్‌!
  • ఆ లక్ష్యంతోనే ఉన్నత విద్యకు చేయూత
  • పాఠశాలలను శిథిలావస్థలో వదిలేయాలా?
  • కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ము కాయాలా?
  • నాపై అవాకులు చవాకులా: సీఎం జగన్‌
  • ‘మన బడి.. నాడు-నేడు’కు శ్రీకారం
  • ఇంగ్లిష్‌ మీడియంపై వెనక్కి తగ్గేదే లేదు
  • పేద పిల్లల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయం
Fee reimbursement plus accommodation for students and meals of Rs.20,000


ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ప్రతి విద్యార్థికీ ఏడాదికి వసతి, భోజనానికి రూ.20 వేలు ఖర్చవుతుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది.
సీఎం జగన్‌

 ఇక నుంచి ఇంటర్మీడియట్‌పైన చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాంటి 25 కేంద్రాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని చెప్పారు. గురువారం ఒంగోలులో ‘మన బడి.. నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గత 5 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలన్న చట్టం ఉన్నందున ఈ మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలు అవసరమని చెప్పారు.

🌻రాష్ట్రంలో ఇంటర్‌ పూర్తయిన తర్వాత కేవలం 24 శాతం మంది విద్యార్థులే చదువులు కొనసాగిస్తున్నారని, ఎక్కువ శాతం మంది చదవకపోవడానికి కారణం పేదరికమని తెలిపారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక ఇంజనీరు లేక డాక్టర్‌ లేక కలెక్టర్‌ ఉండాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యకు చేయూతనివ్వబోతున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ప్రతి విద్యార్థికీ ఏడాదికి వసతి, భోజనానికి రూ.20 వేలు ఖర్చవుతుందని.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. సంక్షేమ, సబ్సిడీ పథకాలతో రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తామన్నారు. మంచి మనసుతో ముందడుగు వేస్తే పైన ఉన్న దేవుడు, ప్రజల దీవెనలు కాపాడతాయని చెప్పారు. సవాళ్లను అధిగమిస్తేనే ఫలితాలు లభిస్తాయని తెలిపారు. చరిత్రను మార్చే ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని.. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఎలా ఉన్నాయో.. ఏడాది తర్వాత ఎలా ఉన్నాయో ఫొటోలు తీసి చూపిస్తామన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తామని తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Fee reimbursement plus accommodation for students and meals of Rs.20,000"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0