Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Toll Free Number for Solving Tribal Student Problems Throughout the State

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి  టోల్ ఫ్రీ నెంబర్..1800599111కి ఫోన్ చేసి విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం..
Toll Free Number for Solving Tribal Student Problems Throughout the State

 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకుల పాఠశాలల్లోని సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరు ప్రారంభిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు . పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో మంత్రి పుష్ప శ్రీవాణి రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గురువారం బూసరాజపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో నాడు - నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ' 18005991111 ' టోల్ ఫ్రీ నెంబరును పోలవరం ఎంఎ బాలరాజుతో కలిసి మంత్రి పుష్పశ్రీవాణి ప్రారంభించారు . అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీలో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు . దీనిలో భాగంగానే టోల్ ఫ్రీ నెంబరు ప్రారంభించామని , విద్యార్థులు తమ సమస్యలను ఫోన్ చేసి తెలియజేయొచ్చన్నారు . అంతేకాకుండా ప్రభుత్వ , ప్రయివేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ప్రతి విద్యార్థి తల్లికి ఆర్థిక భరోసా ఇచ్చేలా 2020 జనవరి తొమ్మిదో తేదీన అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు . అనంతరం మండల కేంద్రంలో జిసిసి ఆధ్వర్యంలో రూ . 18 లక్షలతో నిర్మించనున్న సూపర్బర్‌కు శంకుస్థాపన చేశారు . అలాగే రాజానగరంలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ . 31లక్షలతో నిర్మించిన అదనపు తరగతి భవనాన్ని ఆమె ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ , ఐటిడిఎ పిఒ సూర్యనారాయణ ఉన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Toll Free Number for Solving Tribal Student Problems Throughout the State"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0