Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health ATM in Railway. Stations

Health ATM | పేరు , వయస్సు , మొబైల్ నెంబర్ లాంటి వివరాలను ఎంటర్ చేసి డబ్బులు చెల్లిస్తే చాలు . . . కేవలం 5 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది .

Health ATM in Railway. Stations

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ ఇటీవల రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు ప్రయాణికులకు వినూత్నమైన సౌకర్యాలను కూడా కల్పిస్తోంది. అలాంటి సదుపాయాల్లో ఒకటి 'హెల్త్ ఏటీఎం'. దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో 'హెల్త్ ఏటీఎం'లను ఏర్పాటు చేస్తోంది భారతీయ రైల్వే. ప్రయాణికులు ఎవరైనా 'హెల్త్ ఏటీఎం' సెంటర్లలో కేవలం 5 నిమిషాల్లో హెల్త్ రిపోర్ట్ పొందొచ్చు. పల్స్ రేట్, బ్లడ్ ప్రెజర్, మెటబాలిక్ ఏజ్, బోన్ టెస్ట్ లాంటి 10 నుంచి 12 హెల్త్ పారామీటర్స్‌లో హెల్త్ రిపోర్ట్ లభిస్తుంది. ఫీజు కూడా రూ.10 నుంచి రూ.50 మధ్యే ఉంటుంది.
హెల్త్ ఏటీఎం సెంటర్‌లో ఎవరైనా హెల్త్ రిపోర్ట్ పొందాలంటే అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది హెల్ప్ చేస్తారు. పేరు, వయస్సు, మొబైల్ నెంబర్ లాంటి వివరాలను ఎంటర్ చేసి డబ్బులు చెల్లిస్తే చాలు... కేవలం 5 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇప్పటికే హెల్త్ ఏటీఎం కియోస్క్‌లను పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే. రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో త్వరలో హెల్త్ ఏటీఎంలు కనిపించనున్నాయి. మరి మీరు కూడా ఎప్పుడైనా బీపీ, పల్స్ రేట్ చెక్ చేయించుకోవాలంటే వందలకు వందలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ప్రయాణించే సమయంలో రైల్వే స్టేషన్‌లోని 'హెల్త్ ఏటీఎం'లో రిపోర్ట్ పొందొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health ATM in Railway. Stations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0