Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Here are 5 features that make your WhatsApp look great

WhatsApp: మీ వాట్సప్‌ని అద్భుతంగా మార్చే 5 ఫీచర్లు ఇవే

WhatsApp new features | 5 కొత్త ఫీచర్స్ మీ వాట్సప్ ఎక్స్‌పీరియెన్స్‌ను కొత్తగా మార్చనున్నాయి. 
 ఆ ఫీచర్స్ ఏంటీ? 
ఎలా పనిచేస్తాయి? 
అవి మీకు రోజువారీ వాట్సప్ యూసేజ్‌లో ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకుందాం.


Here are 5 features that make your WhatsApp look great


వాట్సప్... ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాట్సప్‌ని అద్భుతంగా మార్చేస్తోంది కంపెనీ. ఇప్పటికే అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని నయా ఫీచర్స్ యూజర్స్ కోసం రాబోతున్నాయి. ఆ ఫీచర్లను పూర్తిగా వాడుకుంటే మీ వాట్సప్ మరింత అద్భుతంగా మారిపోవడం ఖాయం. సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్, హైడ్ మ్యూటెడ్ స్టేటస్, గ్రూప్ ప్రైవసీ, స్ప్లాష్ స్క్రీన్, డార్క్ మోడ్... ఇలా 5 కొత్త ఫీచర్స్ మీ వాట్సప్ ఎక్స్‌పీరియెన్స్‌ను కొత్తగా మార్చనున్నాయి. మరి ఆ ఫీచర్స్ ఏంటీ? ఎలా పనిచేస్తాయి? అవి మీకు రోజువారీ వాట్సప్ యూసేజ్‌లో ఎలా ఉపయోగపడతాయి? 

Self-Destructing Messages: 

'సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్' లేదా 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ వాట్సప్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. గతంలో వచ్చిన ఫీచర్లన్నిటితో పోలిస్తే ఈ ఫీచర్ చాలా ప్రత్యేకం. సాధారణంగా వాట్సప్‌లో మీరు ఎవరికైనా మెసేజ్ పంపిస్తే డిలిట్ చేసే అవకాశం గతంలో ఉండేది కాదు. కానీ... ఆ తర్వాత మెసేజ్‌ను డిలిట్ చేసే ఫీచర్ అందించింది వాట్సప్. కొత్తగా రాబోయే 'సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్' ఫీచర్‌తో మీరు పంపిన ఏ మెసేజ్‌నైనా జస్ట్ 5 సెకండ్లలో మాయం చేయొచ్చు. అంటే వాట్సప్ మెసేజ్ చేయగానే 5 సెకండ్లలో మాయమైపోతుంది. మీరు 5 సెకండ్ల నుంచి 1 గంట వరకు టైమ్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ మెసేజ్ ఎంత సమయం కనిపించాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు 1 గంట అని టైమ్ సెట్ చేస్తే సరిగ్గా గంట తర్వాత ఆ మెసేజ్ మాయమైపోతుంది.

 Hide Muted Status: 

వాట్సప్‌లో ఎవరి స్టేటస్‌ అయినా నచ్చకపోతే మ్యూట్ ఆప్షన్ ద్వారా స్టేటస్ లిస్ట్‌లో టాప్‌లో కనిపించకుండా చేయొచ్చు. అలాంటి స్టేటస్‌ని పూర్తిగా హైడ్ చేసే ఫీచర్ రాబోతోంది. హైడ్ మ్యూట్ స్టేటస్ అప్‌డేట్స్ ఫీచర్ ద్వారా స్టేటస్‌ని పూర్తిగా కనిపించకుండా చేయొచ్చు. ఎవరి స్టేటస్ నచ్చకపోతే వారి కాంటాక్ట్‌ని హైడ్ చేయొచ్చు.

 New Group Privacy: 

వాట్సప్ గ్రూప్స్ అందరికీ పెద్ద సమస్యే. కాంటాక్ట్‌లో ఉన్నవారందరూ తమతమ గ్రూప్స్‌లో మిమ్మల్ని యాడ్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఇకపై ఈ సమస్య ఉండదు. మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే అనుమతి ఇవ్వొచ్చు. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో రాబోతున్న సరికొత్త ఫీచర్ ఇది.

 Splash Screen: 

మామూలుగా మీరు వాట్సప్ ఓపెన్ చేయగానే ఛాట్స్ ఓపెన్ అవుతాయి. ఇలా నేరుగా ఛాట్స్ కాకుండా ముందుగా వాట్సప్ లోగోతో వెల్‌కమ్ స్క్రీన్ కనిపించేలా మార్చుకోవడమే స్ప్లాష్ స్క్రీన్ ఫీచర్. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాట్సప్ బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

 Dark Mode:

 డార్క్ మోడ్... వాట్సప్‌లో చాలాకాలంగా ఊరిస్తున్న ఫీచర్. ఇప్పటికే ఇతర యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ పాపులర్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్‌లో మాత్రం డార్క్ మోడ్ ఫీచర్ లేదు. త్వరలో ఈ ఫీచర్ రానుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Here are 5 features that make your WhatsApp look great"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0