More Guidelines for Amma Odi
అమ్మ ఒడికి మరిన్ని మార్గదర్శకాలు
శ్రద్ధ చూపితే అందరికీ ఫలాలు
బడికి పిల్లల్ని పంపే ప్రతి తల్లికీ ఆర్థిక ఆసరా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేయనున్న అమ్మఒడికి పథకానికి గడువు సమీపిస్తోంది. ఈ నెల 19 నాటికి పూర్తి వివరాలను అందజేయాలని తొలుత విద్యాశాఖ అధికారులు ఆదేశాలను జారీ చేశారు. దాన్ని రెండ్రోజులు పొడిగించారు. సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు మరింత గడువు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న కొన్ని అంశాలకు పరిష్కారాన్ని చూపుతూ మరిన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.
- విద్యార్థుల్లో రేషన్ కార్డు ప్రధాన సమస్యగా ఉంది. కార్డులో పేరు నమోదు కాకపోవడం, ఫొటో లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.
- తెల్ల బియ్యం కార్డు తప్పనిసరి అని చెబుతుండడంతో చాలా మంది అయోమయానికి గురవుతున్నారు.
- దీనికి పరిష్కారంగా ఫారం 6ను తీసుకొచ్చారు.
- దీనిలో వివరాలను పూర్తి చేసి వాలంటీరుకు అందజేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి పథకానికి అర్హత ఉందో, లేదో ధ్రువీకరిస్తారు.
- విద్యార్థి ఆధార్‌తో పాటు తల్లి ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు ఉండాలి.
- తల్లి లేని పక్షంలో తండ్రి ఖాతా ఇవ్వొచ్ఛు ఇద్దరూ లేకపోతే సంరక్షకుని ఆధార్, బ్యాంకు ఖాతా నకలు ఇవ్వాలి.
- ఆధార్, ప్రవేశ పత్రం, ఆన్‌లైన్‌లో విద్యార్థి, తల్లి పేర్లు ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
- ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే పథకం వర్తిస్తుంది.
- ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే, పెద్దవారి పేరును నమోదు చేయించుకోవాలి.
- విద్యార్థుల హాజరు 75 శాతం తప్పనిసరిగా ఉండాలి.
- పాఠశాలలో విద్యార్థి భౌతికంగా లేకుండా ఛైల్డ్ ఇన్‌ఫోలో పేరు ఉంటే దాన్ని తొలగించి డ్రాప్ బాక్స్‌లో పెట్టాలి.
- 30వ తేదీలోపు వీటిని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. బడుల్లో విధిగా ప్రదర్శించాలి.
- ఆన్‌లైన్ నమోదు గడువు ముగిసే సమయానికి పేర్లు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల వంటి సమస్యలు ఉంటే వాటిని చేతి రాతతో ప్రధానోపాధ్యాయుని పరిశీలన అనంతరం అధికారులకు అందజేయాలి.
- తప్పులు లేకుండా చూసుకోవాలి: రాజ్యలక్ష్మి, డీఈవో
- ఆధార్, బ్యాంకు ఖాతా, పాఠశాల ప్రవేశ పుస్తకం, ఆన్‌లైన్‌లో విద్యార్థి, తల్లి, తండ్రి లేదా సంరక్షకుని పేరులో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇతర వివరాలను కూడా సరిచేసుకోవాలి.
- అందరికీ పథకంలో లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పారదర్శకంగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు, విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించడం ద్వారా అవసరమైన పత్రాలను సేకరించాలి.
- ఆఖరి జాబితా వచ్చాక ఎవరూ బాధపడకుండా ముందుగానే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి
0 Response to "More Guidelines for Amma Odi"
Post a Comment