Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

On the day of Children's Day, Tamil Nadu education authorities have advised people not to use cell phones.

ఆ ఒక్క రోజు సెల్‌ఫోన్స్ వాడకండి . . తమిళనాడు విద్యా శాఖ విజ్ఞప్తి . .
On the day of Children's Day, Tamil Nadu education authorities have advised people not to use cell phones.

బాలల దినోత్సవం రోజు విద్యాశాఖ అధికారులు సెల్‌ఫోన్లు ఉపయోగించవద్దని సూచించింది . అలాగే చిన్నారుల తల్లిదండ్రులంతా ఆరోజు సెల్‌ఫోన్లు పక్కనపెట్టి పిల్లలతో గడపాలని సూచించింది 
రాబోయే బాలల దినోత్సవం నవంబర్ 14న 'గాడ్జెట్-ఫ్రీ' క్యాంపెయిన్ నిర్వహించాలని తమిళనాడు విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బాలల దినోత్సవం రోజు విద్యాశాఖ అధికారులు సెల్‌ఫోన్లు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే చిన్నారుల తల్లిదండ్రులంతా ఆరోజు సెల్‌ఫోన్లు పక్కనపెట్టి పిల్లలతో గడపాలని సూచించింది. ఉదయం 7.30గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు సెల్‌ఫోన్లు లేకుండా పిల్లల కోసం టైమ్ కేటాయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. తద్వారా క్రమేపీ గాడ్జెట్ ఫ్రీ సమయం పెరుగుతుందని.. పిల్లలతో గడిపేందుకు సమయం దొరుకుతుందని విద్యాశాఖ అభిప్రాయపడింది. దీనికి సంబంధించి అన్ని స్కూళ్లలో క్యాంపెయిన్ నిర్వహిస్తామని అధికారులు
తెలిపారు.

గాడ్జెట్ ఫ్రీ(#GadgetFreeHour) 

క్యాంపెయిన్‌లో పాల్గొనాలని విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి నవంబర్ 14వ రోజు.. వారు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండేలా చేయండి. ఉపాధ్యాయులు కూడా ఆరోజు సెల్‌ఫోన్ ఉపయోగించవద్దు. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ఆరోజు మొత్తాన్ని పిల్లల కోసం కేటాయించాలి. ప్రతీ జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు అన్ని స్కూళ్లకు ఈ సమాచారాన్ని చేరవేయాలి. ప్రతీ ఒక్కరూ ఇందులో తప్పక పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.
తమిళనాడు విద్యాశాఖ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "On the day of Children's Day, Tamil Nadu education authorities have advised people not to use cell phones."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0