Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Release of tenth class fee schedule

పదో తరగతి ఫీజు షెడ్యూల్ విడుదల.
Release of tenth class fee schedule

. పదో తరగతి ఫీజుకు సంబంం . ధించిన షెడ్యూల్ విడుదలైంది . ఈ విద్యా సంవత్సరంలో మార్చి , 2020లో పరీక్షలు రాసే విద్యార్థులు , 2017 నుంచి 2019 వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజులు కట్టుకో వచ్చచు . ఎస్ఎస్ సీ , ఓఎస్ఎస్సీ , ఎస్ఎస్ సీ ఒకేషనల్ కోర్సు లకు సంబంధించి మార్చిలో జరగబోయే పరీక్షలకు ఫీజులు , ఫీజు చెల్లించడానికి ఉన్న గడువు షెడ్యూల్ ను పరీక్షల విభాగం సంచాలకులు ఎ . సుబ్బారెడ్డి విడుదల చేశారు . ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21 నుంచి డిసెంబర్ 5వ తేదీ లోపు అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్లు ఫీజులు వసూలు చేసి బోర్డుకు పంపాలి . డిసెంబర్ 5వ తేదీ నుంచి రూ . 50 లేట్ ఫీజుతో 12వ తేదీ వరకు , రూ . 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 28వ తేదీ వరకు , రూ . 500 లేట్ ఫీజుతో జనవరి 2వ తేదీ వరకు చెల్లించవచ్చు . ఆన్ లైన్లో www . bseap . org ద్వారా ఫీజు చెల్లించే అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 5వ తేదీలోపు చెల్లించాలి . ఉప విద్యాశాఖాధికారులు ఈ నెల 27 నుంచి డిసెంబర్ 6వ తేదీలోపు లేట్ ఫీజు లేకుండా డీఈవోలకు ఆన్లైన్లో ఎస్ఆర్ డేటా పంపాలి . డిసెంబర్ 16 వరకు రూ . 50 , డిసెంబర్ 27 వరకు రూ . 200 , జనవరి 3. . . . వరకు రూ . 500 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది . డీఈవోలు - డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషను ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు లేట్ ఫీజు లేకుండా పంపవచ్చు . డిసెంబర్ 27 వరకు రూ . 50 , డిసెంబర్ 29 వరకు రూ . 200 , జనవరి ఆరో తేదీ వరకు రూ . 500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని సూచించారు . 

ఫీజుల వివరాలు 

రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ . 125 మొత్తాన్ని ఫీజు చెల్లించాలి . ఫెయిలైన అభ్యర్థులు మూడు సబ్జెక్టులు దాటితే రూ . 125 , 3 సబ్జెక్టులలోపు రూ . 110 చెల్లించాలి . ఒకేషనల్ అభ్యర్థులు రూ . 60 అదనంగా చెల్లించాలి . పదో తరగతి వయసు రాని పిల్లలు రూ . 300 ఫీజు చెల్లించి పరీక్షకు అర్హత సాధించాలి . ఎస్సీ , ఎస్టీ , బీసీ విద్యార్థుల కుటుంబాదాయం అర్బన్ ప్రాంతాల్లో రూ . 24 వేలు , రూరల్ ప్రాంతాల్లో రూ . 20 వేలు మించకుండా ఉంటే వారికి ఫీజు మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . ఇందుకు సంబంధించిన వివరాలను హెడ్ మాస్టర్లు సేకరించాలని ఎ . సుబ్బారెడ్డి సూచించారు . జట

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Release of tenth class fee schedule"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0