Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SGT posts high in the 2020 DSC


  • 2020 డియస్సి లో ఎస్జీటీ పోస్టు లే అధికం.
  • ఆ తర్వాతే స్కూల్ అసిస్టెంట్లు 
  •  ఇక భాషా పండితులకు ఎసరు 
  • లెక్కలో నిమగ్నమైన అధికారులు 
  • టెట్ నిర్వహణకు సన్నాహాలు
  •  ఉపాధ్యాయుల నియామకం కోసం


SGT posts high in the 2020 DSC

 వచ్చే ఏడాది నిర్వహించనున్న డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు అధికంగా ఉంటాయా . . . అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి . ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్జీటీ పోస్టుల  సంఖ్య అధికంగా ఉండగా , ఆ తర్వాత స్థానంలో స్కూల్ అసిస్టెంట్ (యస్. ఏ ) పోస్టులు ఉన్నట్లు తెలిసింది . రాష్ట్రంలో సుమారు 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం . వీటన్నింటి భర్త ప్రభుత్వం ఒకేసారి నోటిఫికేషన్ ను జారీ చేస్తే ఒక్కో జిల్లాలో సగటున 600 నుంచి 1200 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది . ఈసారి డీఎస్సీలో  ఎస్జీటీ పోస్టులకు అధిక పోటీ ఉండే అవకాశం కూడా ఉంది . ఈసారి భాషా పండితులు ( యస్ ఎ ) పోస్టులకు ఎసరు పెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది . ఫలితంగా తెలుగు , హిందీ ,ఉర్దూ తదితర భాషా పండితులకు నష్టం వాటిల్లనుంది . ఈసారి కూడా పాత విధానంలోనే డియస్సి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది . అందులో భాగంగానే జిల్లాలు వారి గా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అధికారులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలివీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఖాళీల వివరాల నివేదికను సమర్పించారు . మరికొన్ని జిల్లాల నుంచి వివరాలు రావాల్సి ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు . రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీలు , నోటిఫికేషన్ , పరీక్షలపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశంఉంటుంది.

టెట్ తప్పనిసరి

విద్యాహక్కు చట్టం (ఆర్టిఈ ) ప్రకారాం ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ( టెట్ ) అర్హత సాధించాలి . కొత్తగా బీఎడ్ , డీఎడ్ , లాంగ్వేజ్ పండిల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు లక్షలాది మంది నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తున్నారు . వారిలో స్కూల్ అసిస్టెంట్లు మూడు లక్షల మంది ఉన్నారు . కొందరు గతంలో టెట్ అర్హత పొందగా , మరికొందరు టెట్ రాయాల్సి ఉంది . ఒక్కసారి టెట్‌లో అర్హత పొందిన వారంతా వెయిటేజీ మార్కులు కోసం మళ్లీ టెట్ రాసి పెంచుకునే అవకాశముంది .
టెట్ లో ఒక్కసారి అర్హత పొందితే , దాని కాలపరిమితి పదేళ్ల వరకు ఉంటుంది . ఏడేళ్ళ క్రితం టెట్ లో అర్హులైన వారంతా మళ్లీ టెట్ రాసి తాజాగా అర్హత పొందాలి . డీఎస్సీ - 2018 నుంచి వీరు అభ్యర్థులను    ఎస్జీటీ పోస్టులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది .Bed అభ్యర్థులు టెట్ పేపర్ - 1లో తప్పనిసరిగా అర్హత సాధిస్తేనే డీఎస్సీకి దరఖాస్తు చేయాలి . ఈ అంశాలన్నీ పరిశీలిస్తే కొత్త డీఎస్పీ కంటే ముందుగా టెట్ కీలకంగా మారనుంది .

వేర్వేరుగా పరీక్షలు

టెట్ , డీఎస్పీలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు . డీఎస్సీ - 2018లో టెట్ పూర్తయ్యాక ఒక్క వీరుడి , ఎస్టేటీలకే టెట్ - టీఆర్టీ పరీక్షలను నిర్వహించారు . అప్పట్లో వారికి టెట్ , డీఎస్సీలు వేర్వేరుగా పెట్టేందుకు సమయం లేదు . టెట్ , డీఎస్సీ పరీక్షల సిలబస్ లో స్వల్ప మార్పులు మినహా , అంతా పాత విధానంలోనే ఉంటుందని , డీఎస్సీ - 2018 , టెట్ - 2018 తరహాగానే వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది . దీంతో ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులపై గురిపెట్టిన అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు . ఇప్పటికే పలు సంస్థలు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ శిక్షణ తో బాటు ఆన్లైన్ లోనూ కోలింగ్ ఇస్తుండటం 

టెట్ స్కోరింగేతోనే డీఎస్సీలో సక్సెస్ 

టెట్ పరీక్షలో 150 మార్పులకు గాను 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది . డీఎస్పీని 80 మార్కులకు నిర్వహిస్తారు . టెటీలో వచ్చిన వెయిటేజీ మార్కు లను డీఎస్సీ మార్కులతో కలిపి మెరిట్ జాబితాను రూపొందిస్తారు . అనంతరం జిల్లాలు , కేటగిరీలు , రాష్ట్రం వారీగా కటాఫ్ మార్పులు , ర్యాంకులను నిర్ధారించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు . గత డీఎస్సీలను పరిశీలిస్తే , టెట్ లో అధిక మార్కులు సాధించిన అభ్యర్థులే ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు . ఇప్పటికే టెట్ లో అర్హత సాధించిన వారంతా స్కోరింగ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SGT posts high in the 2020 DSC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0