Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SICKROOM IN SARKARI SCHOOL

సర్కారీ స్కూలులో సిక్‌రూమ్‌
ప్రకాశంలోని బాలికల స్కూలులో..
రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు
SICKROOM IN SARKARI SCHOOL

 బాలికలు చదువుకోడానికి ప్రత్యేకంగానే పాఠశాలలు ఉన్నాయి. వారి నమోదును పెంచే ప్రయత్నాలకూ కొదవలేదు. ఇదంతా ఒక ఎత్తు మాత్రమే! చదువుకొనే వాతావరణం పాఠశాలలో ఉండటమనేది అన్నింటికన్నా ముఖ్యం. ఇంటి వాతావరణం నుంచి బడి ఆవరణలోకి అడుగుపెట్టిన ఆడపిల్లలకు ఎన్నో సమస్యలు! వాటన్నింటినీ కాకపోయినా, వారికి కనీసం ఆరోగ్యపరంగా ఊరటను, కొంత భరోసాను ఇచ్చే దిశగా ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల తొలి అడుగు వేసింది.
630 మంది విద్యార్థినులు చదువుకొంటున్న ఈ హైస్కూలులో సిక్‌రూమ్‌ ఏర్పాటుచేసి, ప్రాథమిక చికిత్స అందిస్తోంది. కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లకు ఇప్పటిదాకా పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఒక ప్రభుత్వ పాఠశాల తొలిసారిగా కల్పించడం, ఉపాధ్యాయులే ఉత్సాహంగా పాలుపంచుకొంటూ ఉండటం విశేషం. విద్యార్థినులు పలు సందర్భాలలో అస్వస్థతకు గురి అవుతుంటారు. క్లాసు నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో వారు పడే బాధలు ఉపాధ్యాయులను కదిలించాయి. ప్రధానంగా నెలసరికి సంబంధించి కడుపునొప్పి తదితర ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతుండటం గుర్తించారు. దీనిపై హెచ్‌ఎం, టీచర్లు.. చీరాల ఐకాన్‌ ఆస్పత్రి నిర్వాహకులను సంప్రదించారు. సిక్‌రూమ్‌ను ఏర్పాటుచేసేలా ఒప్పించారు. దీనికోసం పాఠశాలలోనే ఒక గదిని కేటాయించారు. అందులో రెండు బెడ్లు, ప్రాఽథమిక చికిత్సకు అవసరమైన మందులు ఉన్నాయి. అవసరమైన విద్యార్థినులకు శానిటరీ నాప్‌కిన్స్‌ను రెండు రూ.5కే అందిస్తున్నారు. దుస్తులు మార్చుకోవాలంటే వీలుగా ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. ఐటీసీ రక్షణ సంస్థవారు నాప్‌కిన్‌ బర్నింగ్‌ మిషన్‌ను ఈ స్కూలుకు బహూకరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SICKROOM IN SARKARI SCHOOL"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0