Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

State Government Activity for Telugu Language Development


  •  తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ
  • ఒకటో 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు..
  • అధికార భాషా సంఘం ఏర్పాటు, తెలుగు అకాడమీ పునరుద్ధరణ..
  • త్వరలో ఉర్దూ అకాడమీ పునరుద్ధరణ..
State Government Activity for Telugu Language Development



 తెలుగు భాషకు మంచిరోజులొస్తున్నాయి . మాతృభాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది . అధికారం లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిర్మాణాత్మక చర్యలు చేప ట్టింది . అధికార భాషా సంఘం , తెలుగు అకాడమీలను ఏర్పాటు చేసింది . పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా చేసింది . భాష , సంస్కృతుల వికాసానికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపట్టడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . చంద్రబాబు హయాంలో తెలుగు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది . 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యా లయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది . ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు . దీనిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ , తెలుగు భాషాభిమానులు ఆందోళనలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు . ఇక అధికార భాషా సంఘాన్ని నియమించలేదు . తెలుగు అకాడమీ ఏర్పా టును అసలు పట్టించుకోలేదు . తెలుగు భాషాభివృద్ధికి భాషావేత్తల సూచనలు , డిమాండ్లను చంద్రబాబు బేఖాతరు చేశారు . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఎన్నో వినతులిచ్చినా పెడచెవిన పెట్టారు . ' తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది . తప్ప . . చంద్రబాబు మనసులో తెలుగుకు స్థానం లేదు ' అని భాషాభిమానులు తీవ్రంగా విమర్శించారు .

తెలుగుకు మళ్లీ వెలుగులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు భాషా మోసానికి గట్టి చర్యలు చేపట్టారు . పరిపాలనలో తెలుగు వినియోగం , భాషాభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు , సూచనలు ఇచ్చేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు . దానికి తెలుగు , హిందీ భాషల్లో పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు అధ్యక్షుడిగా నియమించారు . ప్రముఖ సాహితీవేత్తలు మోదుగుల పాపిరెడ్డి , షేక్ మస్తాన్ . ఆచార్య చందు సుబ్బారావు , ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిలను అధికార భాషా సంఘం సభ్యులుగా ప్రభుత్వం నియమించింది . తెలుగు అకాడమిని పునరుద్దరించారు . ప్రముఖ రచయిత్రి , ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతిని ఆ అకాడమి అధ్యక్షురాలిగా నియమించారు . తద్వారా తెలుగు భాష , సాహిత్యాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు . . అదే విధంగా 1 నుంచి పదో తరగతి వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు గానీ ఉర్దూగానీ తప్పనిసరి చేసి అమ్మభాష తప్పనిసరిగా నేర్చుకునేట్టు చేశారు . రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉర్దూ ఆకాడమీని కూడా పునరుద్ధరించనుంది . భాషాభివృద్ధికి ప్రభు త్వం చేపడుతున్న చర్యల పట్ల సాహిత్యాభిమానులు , విద్యా వేత్తలు , సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . . . .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "State Government Activity for Telugu Language Development"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0