Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Aadhaar service centers will operate 7 days a week

Aadhaar Seva Kendra: గుడ్ న్యూస్... ఇక వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు
Aadhaar Seva Kendra Slot Booking | ప్రతీ ఆధార్ సేవా కేంద్రంలో రోజుకు 1000 మంది ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్స్ కోసం వస్తున్నారు. అందుకే ప్రతీ రోజూ ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది యూఐడీఏఐ

ఆధార్ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI పాస్‌పోర్ట్ కేంద్రాల్లాగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో మొదటి ఆధార్ కేంద్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏర్పాటు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఆధార్ కేంద్రం విజయవాడలో ఏర్పాటైంది. ఇలా దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది UIDAI. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన మొదట్లో ప్రతీ మంగళవారం సెలవు ప్రకటించింది UIDAI. అంటే ఆధార్ సేవా కేంద్రాలు కేవలం వారంలో ఆరు రోజులు మాత్రమే సేవలు అందించేవి. ప్రతీ మంగళవారం సెలవు ఉండేది. అయితే ఆధార్ సేవా కేంద్రాలకు ఆధార్ సేవల కోసం వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో వారంలో 7 రోజులు సేవలు అందించాలని నిర్ణయించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.

ప్రతీ ఆధార్ సేవా కేంద్రంలో రోజుకు 1000 మంది ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్స్ కోసం వస్తున్నారు. అందుకే ప్రతీ రోజూ ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది యూఐడీఏఐ. అందుకే మంగళవారం కూడా ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ఆధార్ సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో హైదరాబాద్‌లోని మాదాపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఏర్పాటైన ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది. ఇక్కడ ఆధార్ సేవలు పొందాలంటే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.



UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి My Aadhaar ట్యాబ్‌లో 'Book an Appointment' పైన క్లిక్ చేయాలి. సిటీ లొకేషన్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. New Aadhaar, Aadhaar Update, Manage Appointment ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీ వివరాలన్నీ ఆన్‌లైన్ ఫామ్‌లో ఎంటర్ చేయాలి. అపాయింట్‌మెంట్ వివరాలు, వ్యక్తిగత వివరాలు ఫిల్ చేసిన తర్వాత టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి.మీ అపాయింట్‌మెంట్ వివరాలన్నీ ఓసారి సరిచూసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Aadhaar service centers will operate 7 days a week"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0