Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reforms in Syllabus New policy at CBSE, ICSE level

  • సిలబస్ లో సంస్కరణలు CBSE , ICSE స్థాయిలో నూతన విధానం
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు 
  • తల్లి దండ్రుల కోరిక మేరకే ఇంగ్లీషు మీడియం 
  •  ప్రైవేటు స్కూళ్లనుంచి సర్కారు బడికి దారులు 
  •  సాంకేతిక పరిజ్ఞానంలో పెను మార్పులు 
  •  ఇతర రాష్ట్రాల సిలబస్ పై అధ్యయన కమిటీ 
  •  విధ్యరంగంపై సీఎం ముద్ర

Reforms in Syllabus New policy at CBSE, ICSE level


అనేక సంస్కరణలతో ముందుకు సాగు తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో మార్పుకోసం కసరత్తు చేస్తోంది . విద్యారంగాన్ని ఆధునీకరించే దిశగా పావులు కదుపుతోంది . మరో రెండు దశాబ్దాల నాటికి సంబవించే మార్పులకు అనుగుణంగా ప్రస్తుత విద్యారంగంలో మార్పు లు తేవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నది . ప్రత్యేకించి విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా అన్ని స్థాయిల్లో సిలబస్లోనే మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ఇప్పటికే ఇంగ్లీషు మీడియంను ప్రాథమిక స్థాయి నుంచి 2020 - - 21 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి - తేవాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది . దీన్ని కొనసాగింపుగానే విద్యా ఉపాధి రంగాలలో సమాజంలోని అందరికీ సమాన " అవకాశాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవా లని ప్రయత్నిస్తోంది . ఈ నేపథ్యంలోనే అఖిల భారత స్థాయిలో సిబిఎస్ఈ , ఐసిఎస్ఈ స్థాయిలో సిలబసను రూపొందించే దిశగా పెనుమార్పులు తేవాలని భావించింది . యువ తకు ధీటైన మెరుగైన నాణ్యతతో కూడిన ప్రణాళికతో ముందుకెళుతోంది . ఇప్పటికే ఆర్థికస్తోమత లేని తల్లిదండ్రుల డిమాండ్ మేరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టబోతున్నారు . ప్రస్తుతం ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం చదువుతున్నవారు 82శాతం ఉన్నతవర్గాలకు చెందిన దనవం తుల పిల్లలే కావడం గమనార్హం వారితో పోటీ పడేందుకు పేద మధ్య తరగతి పిల్లల కోసమే ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోం ది . అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి . దీంతో ప్రభత్వుం చేస్తున్న ప్రయత్నాలు పాక్షికంగా మాత్రమే ఫలితాలుఇస్తాయనే అభిప్రాయానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి విద్యారుథల జీవితాల్లో కీలక మలుపు తిప్పే సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ సిలబస్టపై దృష్టి సారించడం జరిగింది . ఒకవైపు ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూనే మరోవైపు సీనియర్ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వంటి చర్యలను తీసుకోబోతున్నారు . సీబిఎ , ఐసీఎస్ఈ సెలబన్ల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని అవసమైతే రాష్ట్ర సెలబలో మార్పులకు కూడా వెనుకాడేది లేదని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి సంకేతాలు ఇచ్చారు . ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తున్నది . త్వరలోనే ఇందుకు సంబంధించి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో స్పష్టతకు రానున్నది . విద్యా అవకాశాలకు మెండుగాఉండే రంగాలలో చోటు చేసుకుంటున్న మార్పుల మేరకు యువతకు విద్యనందించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు . ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్పున్నారు . వచ్చే 20ఏళ్లలో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంలో పెనుమార్పులు చేసుకుంటాయని , నాలెడ్డి , డిజిటల్ ఎకానమిగా రూపాంతరం చెందుతుందని అంచనా వేస్తున్నారు . కృత్రిమ మేధస్సు , బయోటెక్నాలజీ రంగాలకు డిమాండ్ పెరుగుతున్న పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా ఇప్పటినుంచే యువతను సన్నద్ధం చేసేందుకు ఇంగ్లీషు మీడియంతో పాటు సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ సిలబస్ అనివార్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు . . ఫలితంగానే విద్యారంగంలో పెను సంస్కరణలకు శ్రీకారం చుట్టారు . ఇదిలా వుండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంగ్లీషు మీడియంతో పాటు అమ్మ ఒడి పథకంపై విస్తృతంగా ప్రచారం కల్పించారు . ఇప్పుడు సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ సిలబస్ పై కూడా దృష్టి సారించారు . దీంతో విస్తృత ప్రచారం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో 18 - 20 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు . ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 2 . 7లక్షల మంది చేరారు . రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా 8 . 5 లక్షల మంది విద్యార్థులు చేరారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి . ఇదిలా వుండగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , ఐసీఎస్ఈ సిలబస్ , పరీక్ష విధానాలకు ధీటుగా రాష్ట్ర సిలబస్టు రూపొందిస్తున్నారు . సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ సిలబస్ లోని కొన్ని అంశాలను ఇతర రాష్ట్రాలలోని సిలబసన్ను అధ్యయనం చేయాలని నిర్ణయించారు . అనంతరమే నూతన సిలబస్ అమల్లోకి వస్తోంది . ఇందుకు సంబంధించి ఇప్పటికే సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటైంది . కాగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు కానున్నది . ఉపాధ్యాయులతో పాటు విద్యారుథలు కూడా ఇంగ్లీషు గ్రామర్ తో పాటు చదవడం , రాయడం భాషపై పట్టు సాధించడానికి ఈ ల్యాబ్ దోహదం చేస్తుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reforms in Syllabus New policy at CBSE, ICSE level"

Post a comment