Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The beneficiaries of Jagannanna Ammado's scheme will be selected in all six tiers


అమ్మఒడికి ఆరు అంచెలు.
30లోగా వడపోత పూర్తి.
మార్పుచేర్పులకు హెచ్ఎం లకు స్వేచ్చ..*
ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే..*


  వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్న ' జగనన్న అమ్మఒడి ' పథ కానికి సంబంధించిన లబ్ధిదారులను మొత్తం ఆరు అంచెల్లో ఎంపిక చేయనున్నారు . ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పాఠ శాల విద్యాశాఖ ఆదేశించింది . అర్హులైన తల్లులు / సంరక్షకుల జాబితాలను సిద్ధం చేసేందుకు వీలుగా జిల్లా , మండల , పాఠశాల , గ్రామస్థాయిల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళి కను ఖరారు చేసింది . మొత్తం 6 అంచెల్లో లబ్ధిదారులను పరిశీలించి , ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఎంపిక చేయాలని విద్యాశాఖ సూచించింది . • ఈ నెల 11 నుంచి 21 మధ్యకాలంలో ప్రధానోపాధ్యా యులు విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసి , 21న ఏపీసీఎఫ్ఎస్ఎస్ కి అందజేశారు . ఏపీసీఎఫ్ఎస్ఎస్ పరిశీలించి , రేషన్ కార్డుల జాబితా , ప్రజా సాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి తెల్లరే షన్ కార్డులో ఉన్న తల్లుల సంరక్షకుల వివరాలను సేక రించి , విద్యార్థుల వారీగా 23 నాటికి అనుసంధానం చేయాలి . అనంతరం దీనిని హెచ్ఎంలకు పంపాలి . . ప్రధానోపాధ్యాయులు ఆవివరాలను సరిపోల్చుకోవడం , నమోదు చేయడం , విద్యార్థుల , తల్లి / సంరక్షకుల పేరు , ఆధార్ నెంబరు , బ్యాంక్ ఖాతా వివరాలను 24లోపు సేక రించి , ఆన్లైన్లో నమోదు చేయాలి . ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాల్లో లోపాలుంటే వాటిని సరిదిద్దాలి . ఆ తర్వాత విద్యార్థుల స్వగ్రామాలు , మండలాల వారీగా తల్లులు / సంరక్షకుల జాబితాను మండల విద్యాధికారి ( ఎంఈవో ) కి పంపాలి . . 100 మందిలోపు విద్యార్థులున్న పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఈ సమాచారాన్ని ఈ నెల 25 లోగా , 101 నుంచి 300 మందిలోపు విద్యార్థులున్న పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఈ సమాచారాన్ని 26లోగా , 300లకు పైగా విద్యార్థులుంటే ఈ సమాచారాన్ని 27లోగా ఆన్లైన్లో ఎంఈవోకు పంపాలి . ఎంఈవోలు తమకు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రామాలు / వార్డుల వారీగా జాబితాలను ముద్రించి గ్రామ సచివాలయ విద్యా సంక్షేమ సహాయకునికి లేదా క్లస్టర్ రిసోర్స్ పర్సను అందజేయాలి . గ్రామ సచివాలయ విద్యా , సంక్షేమ సహాయకుడు / క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఎంఈవో ద్వారా అందిన జాబితాలను సంబంధిత గ్రామ / వార్డు వలంటీర్లకు ఇవ్వాలి . వారి ద్వారా సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి . . లేని వివరాలు అంటే . . తల్లి పేరు , తెల్లరేషన్ కార్డు వివ రాలు , ఆధార్ నెంబరు , బ్యాంక్ ఖాతా నెంబరు , ఐఎఫ్స్ ఎసీ కోడ్ తదితర వివరాలను సేకరించాలి . ఆ సమాచా రంలో తెల్లరేషన్ కార్డు లేనివారి విషయంలో వారు నిరు పేద / అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో 6 అంచెల పరిశీలన ద్వారా నిర్ధారించాలి . ఈ కార్యక్రమం 30లోగా పూర్తి చేయాలి . గ్రామ / వార్డు వలంటీర్లు క్షేత్రస్థాయిలో నమోదు చేసిన / నిర్ధారించిన సమాచారాన్ని విద్యా , సంక్షేమ సహాయకుడు / క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల ద్వారా తిరిగి ఎంఈవోకి పంపాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The beneficiaries of Jagannanna Ammado's scheme will be selected in all six tiers"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0