Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ministry of Human Resource Development hopes to establish a strong link between academia and industry to improve employment opportunities for students upon completion of studies

చదువుల వెంటే కొలువులు..
పాఠ్య ప్రణాళికలో మార్పులు..
వర్శిటీ-ఇండస్ట్రీ లింకేజ్ పై త్వరలో నూతన విధానం..
చదువుల వెంటే కొలువులు

చదువులు పూర్తవ్వగానే విద్యార్థులకు ఉపాధి మార్గాలు మెరుగవ్వాలంటే విద్యాసంస్థలకు , పరిశ్రమలకు మధ్య గట్టి అనుసంధానం ఏర్పాటు చేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తోంది . విశ్వవిద్యాలయాలు , పరిశ్రమల ( యూ - ఐ ) అనుసంధానంపై ఏర్పాట యిన వర్కింగ్ గ్రూప్ తన నివేదికను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ ) కు అందించింది . దీనిపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయా లను స్వీకరిస్తున్న కేంద్రం . . త్వరలోనే కొత్త విధానాన్ని ప్రకటించనుంది .నిపుణుల కమిటీ సూచనల ప్రకారం . . వివిధ పరిశోధనలపై పేటెంటు హక్కు కలిగిన నిపుణులు , శాస్త్రవేత్తలతో టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెల్ ( టీఐఈసీ ) లను ప్రతి వర్సిటీలో ఏర్పాటు చేస్తారు . బోధన , పరిశోధనలు , ఇంటెలెక్చ్యువల్ ప్రాపర్టీ ( ఐపీ ) టెక్నాలజీ ట్రాన్సఫర్ తదితర అంశాల్లో ఈ కేంద్రాలు . . వర్సిటీలు , పరిశ్రమలకు మధ్య అనుసంధానం చేస్తాయి . ఇందుకు యూ - ఐ ఫెసిలిటేషన్ ఫండ్ , యూ - ఐ ఆర్డీ ఫండ్ , ఐపీ ఫండ్లను యూజీసీ ద్వారా కేంద్రం సమకూర్చనుంది . ఈ కార్యక్రమాలకోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ . 225 కోట్లు యూజీసీకి బడ్జెట్ కేటాయించనుంది .

ప్రయోజనాలు ఇవీ . . - 

వర్సిటీ పరిశ్రమల info . ఆనుసంధానం ద్వారా అతి - తక్కువ ఖర్చుతో విద్యార్థులకు నూతన పరిజ్ఞానం అందుతుంది . సైన్సు తదితర అంశాల్లో నూతన నైపుణ్యాలు కలిగిన సిబ్బంది అందుబాటులో ఉంటారు . అతి తక్కువ ఖర్చుతో పరిశోధన , అభివృద్ధి ( ఆల్దండీ ) ఫలవంతమ వుతుంది . తద్వారా ప్రజా ధనం ఆదా అవుతుంది . ఈ పరిశోధనల ద్వారా వర్సిటీలకు ఆదనపు ఆదాయం ఉంటుంది . పరిశోధన ప్రక్రియలు విస్తృతం అవుతాయి . పరిశ్రమల వాస్తవిక సమస్యలపై లోతైన ఆధ్యయనం జరగడం ద్వారా సమస్యలను గుర్తించి , వాటికి శాశ్వత పరిష్కారాలు చూడవచ్చు .విద్యార్థుల్లో సామర్ధ్యాల పెంపు . - ఇంటర్న్ షిన్లు తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి . ఇండస్త్రీలనుంచి వచ్చే అనుభవాంశాల ఆధారంగా పాఠ్యప్రణా శికల రూపకల్పన పరిశ్రమల ప్రతినిధుల నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఏర్పాటు . పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రీసెర్చి పార్కుల ఏర్పాటు . శాస్త్ర , సాంకేతిక పరిజ్ఞానం పెంపొం దించుకోవడానికి , పరిశోధనలను చేపట్టే దిశగా ప్రోత్సాహకాలు . - ఎంటర్ ప్రెన్యూర్‌షిపై నూతన కోర్సులు . పారిశ్రామిక భాగస్వా మ్యంతో ' అప్లయిడ్ రీసెర్చి ' కి ప్రాధాన్యత .

పాఠ్య ప్రణాళికలో మార్పులు

 పరిశ్రమలకు అవసరమైన రీతిలో వర్సిటీల కార్యక్రమాలు , పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నారు . పరిశ్రమలకు అవసరమైన కోర్సులు ప్రవేశపెడతారు . పాఠ్యాంశాలు రూపకల్పనలో పరిశ్రమలను కూడా భాగస్వామ్యం చేస్తారు . విద్యార్థులు , పరిశోధకులకు ' పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ ' తప్పనిసరి చేస్తారు . వర్సిటీలు , పరిశ్రమలు కలిసి ' జాయింట్స్ ఫండెడ్ పీహెచ్ డీ ' కార్యక్రమాలను ప్రారంభిస్తాయి .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ministry of Human Resource Development hopes to establish a strong link between academia and industry to improve employment opportunities for students upon completion of studies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0