Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The education department should also inform the mother or student guardian's death numbers for the mother's scheme

చరవాణి నంబరు ఇవ్వాలి
అమ్మఒడికి ఆధార్‌పై ఆందోళన వద్దు
రేషన్‌కార్డు పరిశీలనకు వాలంటీర్లు

అమ్మఒడి పథకానికి తల్లి లేదా విద్యార్థి సంరక్షకుల చరవాణి నంబర్లను సైతం తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ సూచించింది. పిల్లలు చదివే పాఠశాలలో ఈ వివరాలను అందజేయాలని విద్యాశాఖ అధికారులు కోరారు. ఇంతకు ముందు తల్లి బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలు, పిల్లవాడి ఆధార్‌ నంబరు మాత్రమే సేకరించారు. తాజాగా ప్రభుత్వం తల్లి లేదా సంరక్షకుల చరవాణి నంబర్లను సైతం సేకరించి ఆ వివరాలను అమ్మఒడికి సంబంధించిన సీఎఫ్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు చరవాణి నంబరు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. పిల్లల సమాచారం సేకరణకు ఇప్పటికే గడువు ముగిసింది. ఇంకా ఎవరైనా సమాచారం ఇవ్వకపోతే వారు కూడా స్పందించి సోమవారం నాటికి నిర్దేశిత నకళ్లు పాఠశాలల్లో అందజేయాలన్నారు.

పాఠశాలల్లోనే ఆధార్‌ కేంద్రాలు...


చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధార్‌కార్డు లేదని, కార్డు గతంలో పొందినా అది ప్రస్తుతం కనిపించటం లేదని ఆందోళన చెందుతున్నారు. దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు. ఆధార్‌ లేదని పథకాన్ని వర్తింపజేయకుండా ఉండరని పేర్కొన్నారు. ఆధార్‌ లేని వారి వివరాలతో ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందించారు. వీరికి సంబంధించి త్వరలోనే పాఠశాలల్లో ఆధార్‌ కేంద్రాలు ప్రారంభించి వాటిని పిల్లలకు ఇప్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
అర్హులై ఉండి రేషన్‌ కార్డు లేకపోయినా దరఖాస్తు చేయించి ఇస్తారన్నారు. ప్రస్తుతం తల్లి బ్యాంకు ఖాతా, ఆధార్‌, విద్యార్థి ఆధార్‌ కార్డు, 75 శాతం హాజరు ఈ వివరాలన్నీ పక్కాగా ఉంటే దీనితో కూడిన జాబితాను మరొకటి రూపొందించారు. ఇంకేమైనా పత్రాలు అవసరమా (రిక్వయిర్డ్‌ డాక్యుమెంట్స్‌) అని ఇంకో  జాబితా ఇలా మొత్తం మూడు జాబితాలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రేషన్‌కార్డు ఏ చిరునామా పేరుతో ఉందో అక్కడికే వాలంటీర్లు విచారణ కోసం వెళతారని, అక్కడ పిల్లల తల్లిదండ్రులు అందుబాటులో ఉండాలని విద్యాశాఖ వర్గాలు సూచించాయి. కొందరు గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుల నిమిత్తం తాత్కాలికంగా పట్టణాలకు వచ్చి ఉంటున్నారు. వీరంతా కార్డు విచారణకు వాలంటీర్లు ఎప్పుడు ఆయా గ్రామాలకు వచ్చేది తెలుసుకుని ఆ సమయానికి ఆ చిరునామాలో అందుబాటులో ఉంటేచాలు.

సర్వర్‌తో ఇక్కట్లు...

ప్రస్తుతం పిల్లల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి సర్వర్‌ మొరాయిస్తోందని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అనుసంధానం ఒకేసారి జరగనుండడంతో సర్వర్‌పై బాగా ఒత్తిడిపడి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని విద్యాశాఖ వర్గాల సమాచారం. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సర్వర్‌ సామర్థ్యం పెంచి అది మొరాయించకుండా చూడాలని కోరుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The education department should also inform the mother or student guardian's death numbers for the mother's scheme"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0