Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The School Education Department has issued guidelines for the preparation of lunch from cooking to serving

మధ్యాహ్న భోజనం మరింత పరిశుభ్రం 
వండటం నుంచి వడ్డించే వరకు నిబంధనలు మార్గదర్శకాలు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ 
ఇక నుంచి విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో భోజనం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డ్రెస్ కోడ్ 

The School Education Department has issued guidelines for the preparation of lunch from cooking to serving


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది . అనేక పాఠ శాలల్లో ఆపరిశుభ్ర వాతావరణంలో మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు వడ్డిస్తూ వచ్చారు . అయితే కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో భోజనం అందడంతోపాటు కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వీలు కలుగుతోం ది . ప్రభుత్వ పాఠశాలలు , అందులో చదువుకునే విద్యార్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధలో భాగంగా మధ్యాహ్న భోజన నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టింది . వంట వండటం మొదలుకొని వడ్డించే వరకు నిబంధనలు విధించింది . కచ్చితంగా ఈ నిబంధ నలు పాటించాలంటూ పాఠశాల విద్యాశాఖ తరపున ఆదేశాలు జారీ చేసింది . జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 3370 పాఠ శాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తు న్నారు . 3150 పాఠశాలల్లోని 2లక్షల 59వేల 878 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వాహ కుల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుండగా , ఏక్తా ఏజెన్సీ ద్వారా 220 పాఠ శాలల్లో 20 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు . ప్రభుత్వ పాఠశా లల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిం చే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకో వడం ద్వారా కొన్నిరకాల సమస్యలకు చెక్ పెట్ట వచ్చు . దీనిని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్న భోజన పథకం అమలు విషయంలో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది . 

ఇవీ నిబంధనలు 

మధ్యాహ్న భోజన పథకానికి విని యోగించే బియ్యం బస్తాలను వంట గదిలో లేదా ఇతర గదుల్లో భద్రపరిచే  ఆ గదులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి . ఇరుకు గదుల్లో , బాగా చీకటిగా ఉండేగడుల్లో , ఎక్కువ రోజులు వినియోగించని - గదుల్లో బియ్యం , పప్పు తదితరాలను నిల్వ • చేయరాదు . వాటిని భద్రపరిచే విషయంలో - జాగ్రత్తలు తీసుకోవాలి . - బియ్యం , పప్పు తదితర వాటిని నిల్వ చేసిన సమయంలో క్రిమి కీటకాలు చొరబడకుం డా చూసుకోవాలి . క్రిమికీటకాలు చొరబడ్డా యంటే వాటిని పాడు చేస్తాయి . . పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి . విద్యార్థు లకు మధ్యాహ్న భోజనం వడ్డించే చోట పరిశు భ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి . - విద్యార్థులు భోజనానికి ముందు , తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి . అందుకు సంబంధించి పాఠశాలల ప్రధానో పాధ్యాయులు హ్యాండ్ వాష్ ద్రవాలను అందు బాటులో ఉంచాలి . - మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేసేటప్పుడు , వడ్డించేటప్పుడు తప్పకుండా తలకు క్యాన్లు , చేతులకు గ్లోబు , యాప్రాన్ ( తెల్లకోటు ) విధిగా ధరించాల్సి ఉంటుంది . - మధ్యాహ్న భోజనం , తాగునీరు కల్త్ జరగకుండా ఉండేందుకు తరచుగా మైక్రో స్కోప్ ద్వారా పరీక్షలు చేయిస్తూ ఉండాలి .
 ఈ పరీక్షల ద్వారా ఆహారం , తాగునీటి నాణ్యతను పరిశుభ్రంగా ఉండాలి.

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డ్రస్ కోడ్

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే నిర్వాహకులకు డ్రస్ కోడ్ అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయిం చింది . అందులో భాగంగా ప్రతి ఒక్క నిర్వాహ కుల గెటప్ మారనుంది . వంట చేసేటప్పుడు , వడ్డించేటప్పుడు తలకు క్యాప్ , చేతులకు ఫ్లాట్లు ధరించడంతోపాటు యాప్రాన్ ( తెల్లకోటు ) విధిగా ధరించాల్సి ఉంటుంది . పాఠశాల విద్యాశాఖ సూచించిన విధంగా మధ్యాహ్న భోజన నిర్వాహ కులు డ్రస్ కోడ్ పాటించాల్సి ఉంది . ఇందుకు సం బంధించిన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో డ్రస్ కోడ్ కు సంబంధించిన మెటీరియల్ ను - కూడా త్వరితగతిన అందించేందుకు చర్యలు చేపట్టింది . మధ్యాహ్న భోజనం , తాగునీటి విష యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది . - ఆహారం , తాగునీరు కలుషితమైనట్లే వాటిని తీసు - కొన్న విద్యార్థులు వాంతులు , విరేచనాలకు - గురయ్యే ప్రమాదం ఉంది . మధ్యాహ్న భోజనంతో పాటు వారు తాగే నీటి నాణ్యతను తెలుసుకునే - విషయమై మైక్రోస్కోట్లు అందించాలని నిర్ణయించింది . జిల్లాల వారీగా ఎన్ని మైక్రో స్కోట్లు అవసరమవుతాయో కూడా పాఠశాల విద్యాశాఖ నివేదికలు సేకరిస్తోంది . రాష్ట్రవ్యాప్తం - గా అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన వెంటనే - వాటికి సంబంధించిన మెటీరియల్ పంపిణీ చేసేం దుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధంగా ఉంది . - 

పర్యవేక్షణ తప్పనిసరి : - 

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకా నికి సంబంధించి అధికారుల పర్యవేక్షణ తప్పనిస రిగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు . జిల్లా విద్యాశాఖాధికారి , ఉప విద్యాశాఖాధికారులు , మండల విద్యాశాఖా | ధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో | మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేస్తూ ఉండా | లన్నారు . తాజాగా సూచించిన మార్గదర్శకాలు ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా అమలవుతు న్నాయో లేదో పరిశీలించాలన్నారు . ఎక్కడైనా | పాటించకుంటే ముందుగా హెచ్చరించాలని , ఆ తర్వాత కూడా మార్పు రాకుంటే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . పాఠశాలల ప్రధానో • పాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం విష | యంలో సవరించిన మార్గదర్శకాలు కచ్చితంగా | అమలయ్యేలా చూస్తూ ఉండాలని ఆదేశాలు జారీ , చేశారు . మొత్తం మీద విద్యార్థులకు అందించే | మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి | సారించడం వల్ల విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం అందడం | మరోవైపు నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో | ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చిన | ట్లేనని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The School Education Department has issued guidelines for the preparation of lunch from cooking to serving"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0