Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are Protecting apps

రక్షించే యాప్‌లివి
ఏదయినా ఆపద ఎదురైనప్పుడు కంగారుపడటం, సహాయం కోసం ఎదురుచూడటం కన్నా... మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం ఎందుకు చేయరు... ఈ యాప్‌లు మీ దగ్గర ఉంటే అది సాధ్యమే తెలుసా...
 These are  Protecting apps

ఐవాచ్‌ ఎస్‌ఒఎస్‌ ఫర్‌ విమెన్‌: 

పరిసరాల్లోని దృశ్యాలు, శబ్దాలను సేకరిస్తుందీ యాప్‌. వాటిని ఆ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చేరవేస్తుంది. ఇది ఇంటర్నెట్‌ లేకుండానే పనిచేస్తుంది. ఓ మహిళ తన గమ్యస్థానానికి చేరుకున్నాక తాను క్షేమమనే సమాచారాన్నీ సంబంధిత వ్యక్తులకు తెలియజేయొచ్చు.

స్పాట్‌ అండ్‌ సేవ్‌ ఫీల్‌ సెక్యూర్‌...  

చుట్టుపక్కల ప్రదేశానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి రెండు నిమిషాలకొకసారి ఫోన్లో ఉన్న ముఖ్యమైన నంబర్లకు పంపుతుందీ యాప్‌. దీన్ని ఫోనులోనే కాదు రిస్ట్‌బ్యాండ్‌కూ అనుసంధానం చేయొచ్చు. ఇది ఫోన్‌ మాదిరిగానే బ్లూటూత్‌ సాయంతో పనిచేస్తుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఐగో సేఫ్లీ... 

అత్యవసర సమయంలో మీరు ఎక్కడున్నారనేది సంబంధించిన వ్యక్తులకు అలర్ట్‌ మెసేజీలు పంపిస్తుందీ యాప్‌. ఇంకా చెప్పాలంటే అలారం ఆపేసేవరకూ నిమిషానికోసారి ఇది సందేశాలు పంపిస్తూనే ఉంటుంది. ఫోనులోని మైక్రోఫోన్‌ అర నిమిషంపాటు ఆడియోను రికార్డు చేసి ముఖ్యమైన వారికి చేరవేస్తుంది.

స్మార్ట్‌ 24 X 7... 

దీనిలో ప్రత్యేకంగా ఉండే పానిక్‌ బటన్‌తో పోలీసులకు ఫోను చేయొచ్చు. ఏదయినా ఆపదలో ఉంటే... అంతకుముందే నమోదు చేసిన ముఖ్యమైన నంబర్లకు ఫోను వెళ్లిపోతుంది. ఇంటర్నెట్‌ పనిచేయని సందర్భంలో మనం ఉండే పరిసరాలను సందేశాల ద్వారా పంపించే సౌకర్యం ఇందులో ఉంది. ట్రాకింగ్‌, కస్టమర్‌ కేర్‌, ఛాట్‌ లాంటి సౌకర్యాలతోపాటు ఈ యాప్‌ ఫొటోలనూ తీస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " These are Protecting apps "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0